Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. రాళ్లు విసిరి.. కేసులు పెట్టి..
ADVERTISEMENT 

రాళ్లు విసిరి.. కేసులు పెట్టి..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
stones.jpg

రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారమే పొదిలిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు  

వైఎస్‌ జగన్‌ ‘పొదిలి పోరుబాట’ను భగ్నం చేసేందుకు ఉన్నతస్థాయిలో కుట్ర 

వైఎస్‌ జగన్‌ పర్యటనకు ముందే పొదిలిలో టీడీపీ ఎమ్మెల్యే కందుల కారు కదలికలు 

ఆ వీడియోలుసోషల్‌ మీడియాలో హల్‌చల్‌ 

మాజీ సీఎం జగన్‌ పర్యటన ఉన్నా అదే సమయంలో టీడీపీ నిరసనలకు అనుమతివ్వడంపై సందేహాలు 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత బుధవారం చేపట్టిన పోరుబాటను భగ్నం చేసేందుకు భారీ ఎత్తున కుట్ర జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారులు తెరవెనుక కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ జగన్‌ పర్యటనకు మూడు రోజుల ముందు నుంచే పొదిలిలో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కారు రహస్యంగా తిరిగినట్లు తెలుస్తోంది. 

ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. స్థానిక నాయకులు, పోలీసులు వద్దని మొరపెట్టుకున్నా వినకుండా అలజడి సృష్టించేందుకు పై స్థాయిలోనే కుట్ర పన్నినట్లు సమాచారం. ఇందులో భాగంగా పోలీసుల సమక్షంలోనే రెండుచోట్ల వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌తోపాటు రైతులపై రాళ్లు విసిరి పలువురిని గాయపరిచారు. తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారు.  

సీఎం చంద్రబాబు మెప్పు కోసమే  
గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు వైఎస్‌ జగన్‌ పొదిలి పర్యటన ఖరారైనప్పటి నుంచే మార్కాపురం ఎమ్మెల్యే హడావుడి చేయడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 8న సీఎం చంద్రబాబు మార్కాపురం వచి్చనప్పుడు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఏమాత్రం బాగా లేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎలాగైనా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ మెప్పు పొందాలని నిర్ణయించుకున్న నారాయణరెడ్డి... ఇందుకు వైఎస్‌ జగన్‌ పర్యటనను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ పర్యటనలో అలజడి సృష్టించడం ద్వారా మొత్తం కార్యక్రమాన్ని విఫలం చేయాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ జగన్‌ పర్యటనకు ముందురోజు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు నారాయణరెడ్డి పొదిలిలోనే తిష్ట వేసి గొడవలకు పథకం రూపొందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

పది ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్‌ 
వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా పది ప్రాంతాల్లో నిరసనలు తెలిపేందుకు తొలుత పథకం రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, నిరసనలు తెలిపేందుకు స్థానిక నాయకులు విముఖత చూపడంతో ఇతర ప్రాంతాల నుంచి కిరాయి మూకలను తెచ్చి రెండుచోట్ల నిరసనలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుడు గుణుపూడి భాస్కర్‌ ఇంటి వద్ద 200 మందిని, నవాబ్‌మిట్టలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మరో 200 మందిని ఉంచి దాడులకు ఉసిగొల్పినట్టు విశ్వసనీయ సమాచారం. 

అక్కడక్కడ భవనాలపై ముందుగానే చేర్చుకున్న రాళ్లను కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌పై విసిరారు. పోరుబాటకు తరలివచ్చిన రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఇదంతా వీడియోల్లో చిత్రీకరించిన టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు పంపించినట్లు తెలుస్తుంది. 

పోరుబాటలో రాళ్లదాడి జరుగుతుందన్న విషయం టీడీపీ పెద్దలకు, స్థానిక ఎల్లో మీడియాకు ముందే తెలుసుకున్న ప్రచారం జరుగుతోంది. టీడీపీవారు రాళ్లు, చెప్పులు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే నారాయణరెడ్డి మార్కెట్‌ యార్డు పదవిని ఆశ పెట్టి కొందరు టీడీపీ నాయకులను నిరసనలకు ఉసిగొల్పినట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి.  

పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ... 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పొదిలికి వస్తున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తల నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసులు వద్దని చెబుతున్నా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు నిరసనలకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే 200 మందికి పైగా గుమిగూడినా ఎందుకు చెదరగొట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. 

మాజీ సీఎం కాన్వాయ్‌పైనే రాళ్లు విసురుతున్నా పక్కనే ఉన్న పోలీసులు వారించకుండా చోద్యం చూడడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాళ్లు విసిరినవారిని వదిలేసి ఎవరి ఆదేశాలతో రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేశారో పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. 

జాకెట్‌ ముక్కలు, నగదు పంపిణీ చేసిన పచ్చమూకలు  
వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకున్న మహిళలకు పచ్చమూకలు రూ.500 నగదు, జాకెట్‌ ముక్కలు పంపిణీ చేయడం మీడియా కంటపడింది. వైఎస్‌ జగన్‌పై అభిమానంతో పొదిలికి వచ్చిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వృద్ధులు, చిన్నారులు, మహిళలకే ఈ ప్లకార్డులు పంపిణీ చేస్తున్న దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డ­య్యాయి. ప్లకార్డులపై ఏమి రాసి ఉందో తమకు తెలియదని వారు చెబుతుండటం గమనార్హం.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YSRCP
Andhra Pradesh
tobacco farmers
YS Jagan Mohan Reddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.