Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. సన్నిధానం క్యాంటీన్ పట్ల TTDకి ఎందుకంత ప్రేమ?: భూమన
ADVERTISEMENT 

సన్నిధానం క్యాంటీన్ పట్ల TTDకి ఎందుకంత ప్రేమ?: భూమన

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 1, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Bhumana-Karunakar-Reddy.jpg

కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తుల సేవ మరిచి, వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... అద్దె చెల్లించకుండా రూ.2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ను ముఖ్యమంత్రి కార్యాయల ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.

సాక్షి, తిరుపతి: తిరుమలలో వ్యాపారుల సేవలో పాలకమండలి తరిస్తోంది. టీటీడీని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకుందని అన్నారాయన. 

● అద్దె బకాయిలు - అయినా అడ్డగోలు ఉత్తర్వులు
నిబంధనల ప్రకారం అద్దె చెల్లించక పోవడంతో టీటీడీ రెవెన్యూ అధికారులు  సన్నిధానం క్యాంటీన్ ను  21-12-2024న మూసివేశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని 30-12-2024 నాడు సన్నిధానం క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడంతో పాటు రెగ్యులరైజేషన్ చేయాలని ఉత్తర్యులు జారీ చేసింది. వాస్తవానికి టీటీడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులు 26-05-2025 నాటికి రూ.2,85,7,106 నగదు చెల్లించాలి. అందులో నిర్వాహకులు నాలుగు దఫాలుగా కేవలం రూ.1,00,24,400 మాత్రమే చెల్లించారు. అయినా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీటీడీ వారికి తలుపులు బార్లా తెరిచి సేవ చేసింది. 

మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు 201 చదరపు మీటర్ల స్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించారు. దీనిపై అధికారులు తనిఖీ చేసి నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు 16-09-2024 నాడు  టీటీడీ ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్ కూడా వీళ్ల ఆక్రమణపై లేఖ రాస్తూ... క్యాంటీన్ నిర్వాహకులు ఆక్రమించిన స్ధలంలో కట్టడాలు చేపట్టిన మాట వాస్తవమే, మేం తనిఖీలు చేసినప్పుడు నిర్మాణం ఆపి మరలా ప్రారంభించారు అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. టీటీడీ లైసెన్స్ నిబంధనలు ప్రకారం రెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఆఖరు నెల రెంట్ కట్టకపోతే క్యాంటీన్ మూసివేయాలి. ఈ నిబంధన టీటీడీ ప్రొసీడింగ్స్ లో ఉన్న సన్నిధానం క్యాంటీన్ పట్ల  టీటీడీకి ఎందుకింత ప్రేమ ?

● ప్రభుత్వ పెద్దల ఒత్తిడి- తప్పుడు నివేదిక.. 
నిబంధనలు పాటించని క్యాంటీన్‌ను మూసివేసి రెంట్ బకాయిలు ఉన్నారని తెలిసినా మరలా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. ఒకవైపు దేవస్థానం భూమి ఆక్రమణలు చేయడమే కాకుండా ఆ స్ధలంలో 15 పెద్ద చెట్లను కూడా తొలగించారు. సన్నిధానం క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే అటవీశాఖ అధికారులు కూడా అక్కడ కేవలం నాలుగు అకేషియా చెట్లను మాత్రమే తొలగించారని తప్పుడు నివేదిక ఇచ్చారు. 

తిరుమల సన్నిదానం క్యాంటీన్ అక్రమాలపై భూమన సంచలన నిజాలు

నిజానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ  రాగానే జనవరిలోనే క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించగా.. టీటీడీ అధికారులు మాత్రం ఏప్రిల్ 1, 2025న రీఓపెన్ చేసినట్లు రాసుకున్నారు. ఆ మూడు నెలల కరెంటు బిల్లులు తనిఖీ చేస్తే వాస్తవాలు కచ్చితంగా బయటపడతాయి. మరోవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులకు కేవలం నెలకు  రూ.50వేలు ఫీజు నిర్ణయించింది. అంటే టీటీడీ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే... ఇలా ఫైన్లు వేసి వదిలేస్తే తిరుమలలో ఇంచు స్థలం కూడా మిగలదు. 

ఒక వ్యాపార సంస్థ 201 చదరపు మీటర్ల స్థలం ఆక్రమిస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. అక్కడితో ఆగకుండా... టీటీడీ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు దాదాపు రూ.2 కోట్ల అద్దె కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు క్యాంటీన్ జనవరి నుంచి నడిచినా కూడా రన్ చేయలేదని చూపిస్తూ... 3 నెలల అద్దెను మినహాయించడం దారుణం. భక్తులకు సేవ చేయాల్సిన చైర్మన్, టీటీడీ బోర్డు ఇలా క్యాంటీన్ నిర్వాహకుల సేవలో మునిగిపోవడం దుర్మార్గం. దీనిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి అక్రమాలపై కచ్చితంగా పోరాటం చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
bhumana karunakar reddy
TTD
sannidhanam
canteen
BR Naidu
AP Politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.