Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. గుండెల్లో బెంబేళ్లు
ADVERTISEMENT 

గుండెల్లో బెంబేళ్లు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 14, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pogaku.jpg

దిగజారుతున్న పొగాకు ధర.. రైతులు విలవిల

సాక్షి, అమరావతి: పొగాకు సగటు అమ్మకం ధర రోజురోజుకు దిగజారిపోతోంది. ఓ వైపు వేలం కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకోవట్లేదు. మరొక వైపు పెద్ద ఎత్తున బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంకొక వైపు సగటు ధరలు పతనమవుతున్నాయి. ఈ పరిణామాలు పొగాకు రైతులపాలిట అశనిపాతంగా మారాయి. కానీ ప్రభుత్వం మాత్రం మార్కెట్‌ స్థిరంగా కొనసాగుతుందని, కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయంటూ చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. గతేడాది కొనేవారు లేక నల్లబర్లీ పొగాకు రైతులు నష్టపోతే, ఈసారి ప్రభుత్వ నిర్వాకంతో ఆశించిన ధరలు రాక నష్టపోతున్నారు.

ఉత్పత్తి 2.65 లక్షల టన్నులు..వేలం జరిగింది 17,290 టన్నులు..
2025–26 సీజన్‌లో 2.93 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవగా.. రెండో ముందస్తు అంచనా ప్రకారం హెక్టార్‌కు 2,276 కిలోల చొప్పున ఈ ఏడాది కనీసం 2.65 లక్షల టన్నులు(265 మిలియన్‌ కిలోలు) దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 63 రోజులు పూర్తికావస్తోంది. కానీ ఇప్పటి వరకు 17,290 టన్నులు(17.29 మిలియన్‌ కిలోలు)కు మించలేదు. గతేడాది ఇదే సమయానికి 48,840 టన్నులు (48.84 మిలియన్‌ కేజీలు) కొనుగోళ్లు జరిగాయి.  కొనుగోళ్ల తీరు చూస్తుంటే, మొత్తం ఉత్పత్తిలో కనీసం 5 శాతం పంటకు వేలం జరగలేదని స్పష్టమవు తోంది. ఈ స్థాయిలో కొనుగోళ్లు కొనసాగితే ఏడాదైనా సరే రైతుల వద్ద ఉన్న పంట పూర్తి స్థాయిలో అమ్ముడుపోయే అవకాశం లేదు.

రూ.211కు దిగజారిన సగటు ధర
మరొక వైపు 2023–24 సీజన్‌లో సగటుఅమ్మకం ధర కిలోకు రూ.288.65 పలుకగా, 2024–25లో కిలోకు రూ.248.86కి పడిపోయింది. కాగా 2025–26లో సగటు అమ్మకం ధర ప్రస్తుతం కిలో రూ.211కి దిగజారిపోయింది. మే 25న సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.237.21 పలికింది. జూన్‌ 1వ తేదీ నాటికి రూ.235.63కు పడిపోగా,12వ తేదీ నాటికి రూ.211కు దిగజారిపోయింది. 

దక్షిణాది తేలిక నేలల్లో పండిన పొగాకు జూన్‌ 1న కిలోకు రూ.231.02 పలకగా, ప్రస్తుతం రూ.211.04 మాత్రమే పలుకుతోంది. ఉత్తరాదితేలిక నేలల్లో పండిన పొగాకు జూన్‌ 1న కిలోకు రూ.260.29 పలకగా, ప్రస్తుతం రూ.255.98కు దిగజారింది. ఒంగోలు దక్షిణాది నల్ల నేలల్లో పండిన పొగాకు జూన్‌ 1న సగటు ధర కిలోకు రూ.224.45 పలకగా, ప్రస్తుతం రూ.200.41కి పడిపోయింది. అంటే 2023–24 సగటు ధరతో పోలిస్తే గరిష్టంగా కిలోకు రూ.77.65 మేర రైతులు నష్టపోతున్నారు. 

ప్రభుత్వ ప్రకటనల పట్ల తీవ్ర అసంతృప్తి
ఓ వైపు ఆశించిన స్థాయిలో వేలం జరగడం లేదు. మరొక వైపు సగటు ధరలు దిగజారిపోతున్నాయి. అయినా సరే పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయంటూ మంత్రి అచ్చెన్నాయుడు రోజు విడిచి రోజు జారీ చేస్తున్న ప్రకటనలు విస్మయానికి గురిచేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తిరస్కరణలు, నో బిడ్‌ల స్థాయి  20 శాతం కంటే తగ్గిపోయిందంటూ చెబుతుండడం పట్ల రైతులు మండిపడుతున్నారు. సగటు ధరలు కిలోకు కనీసం రూ.350 తక్కువ కాకుండా పలికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కొనసాగుతున్న బేళ్ల తిరస్కరణ..
మరోవైపు బేళ్ల తిరస్కరణ కొనసాగుతూనే ఉంది. తొలుత 43శాతం నుంచి 55 శాతం తిరస్కరణకు గురికాగా, ప్రస్తుతం సగటున 21.81 శాతం బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి ఒక్కో బేలుకు రూ.2వేలు అదనంగా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి మంచి దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి సాధించినా అమ్మకం ధరలు కుప్పకూలుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పొగాకు రైతుల్లో మెజార్టీ రైతులు కౌలు దారులే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కంపెనీలిచి్చన బాండ్లకనుగుణంగానే నాణ్యమైన పంటను పండించినప్పటికీ ధర లేక నష్టపోవాల్సి వస్తోందని సన్న, చిన్నకారు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
tobacco
price
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.