Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. వారిజీవితం ‘ఆటో’.. ఇటో!
ADVERTISEMENT 

వారిజీవితం ‘ఆటో’.. ఇటో!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 7, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
auto.jpg

వరద ముంపులో చిక్కుకున్న ఆటోవాలాలు 

సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లోనే అత్యధికంగా ఆటో డ్రైవర్లు

విజయవాడలోని సింగ్‌నగర్‌ కేంద్రంగా సుమారు 6 వేల ఆటోల సేవలు 

ఇక్కడ తిరిగే 80 శాతం ముంపు ప్రాంతానికి చెందినవే.. 

70 శాతం మంది అద్దె ఆటోలు నడుపుకొంటూ జీవనం 

గత వారం రోజులుగా బుడమేరు ముంపులో నానుతున్న ఆటోలు 

చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మరమ్మతుల కోసం అగచాట్లు 

జీవితాంతం కష్టపడినా ఇంటిలో మళ్లీ సౌకర్యాలను సమకూర్చుకోలేమంటూ ఆవేదన      

సాక్షి, అమరావతి: విజయవాడ వరద విలయం.. సగటు బడుగు జీవితాలను ఒక్కసారిగా తిరగబెట్టింది. నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవే­స్తూ జీవనాన్ని సాగించే ‘ఆటో వాలాల’ పరిస్థితి దారుణంగా మారింది. రయ్‌రయ్‌.. అంటూ రోడ్లపై దూసుకెళ్లే వేలాది ఆటోలు బుడమేరు ఉధృతితో కనబడకుండా పోయాయి. దాదాపు వారం రోజు­లుగా నీటిలో నానిపోతూ ఎందుకు పనికి­రాకుండా పోతున్నాయి. 

శుక్రవారం వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పర్యటించగా.. ముంపులో నుంచి ఆటోలను రోడ్లపైకి తీసుకొస్తూ, రహ­దారుల పక్కనే చేతనైనా మరమ్మతులు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లే కనిపించారు. ఇందులో ఎవరిని పలకరించినా కన్నీటి గాథలే వినిస్తున్నాయి. ఊహించని వరదల్లో విలవిల్లాడుతున్న జీవితాలు కళ్లముందు కదలాడుతున్నాయి. సింగ్‌నగర్‌ కాలనీలతో పాటు పైపుల రోడ్డు, పాయకాపురం, కండ్రిక, రాజరాజేశ్వ­రిపేట, అంబాపురంలో అత్యధికంగా ఆటోలు నడుపు­కొంటూ జీవనం సాగిస్తున్నారు. 

విజయవాడ నగరంలో తిరిగే ఆటోల్లో 80 శాతంపైగా ఈ ప్రాంతానికి చెందినవే. ఇక్కడ సుమారు 6 వేలకు పైగా ఆటోలు ఉంటాయని అంచనా. బుడమేరు ఒక్కసా­రిగా ముంచెత్తడంతో ఆ ఆటోలు, యజమానులు నీటిలో చిక్కుకుపోయారు. వరద నీరు ఇంజిన్‌లోకి చేరడంతో పాటు, సీట్లు, కవర్లు నీటిలో నానిపోవడంతో పెద్దఎత్తున నష్టపోయారు. 

70 శాతం అద్దె ఆటోలే..
బుడమేరు వరదల్లో ఇంటి ముందు పెట్టిన ఆటోలు కూడా కొట్టుకుపోయాయి. ఇప్పుడు నీటి ఉధృతి తగ్గడంతో యజమానులు ఆటోలను వెతుక్కునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఇక్కడి ఆటో డ్రైవర్లలో 60–70 శాతం మంది అద్దె ఆటోలనే నడుపు­కొనేవారే. ఆటోను బట్టి రోజుకు రూ. 450 నుంచి రూ. 500 వరకు అద్దె చెల్లిస్తూ.. సర్వీసులు తిప్పు­కుంటున్నారు. రోజులో సర్వీసు ఉన్నా.. లేకున్నా ఆటో అద్దె చెల్లించాల్సిందే. 

రోజూ వేకువ జాము నుంచి రాత్రి వరకు కష్టపడినా రోజుకు రూ. 500 సంపాదించడం కష్టంగా ఉంటోంది. అలాంటి ఆటో­వాలల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయా­రైంది. చేతిలో చిల్లిగవ్వ లేక మరమ్మతులు చేసుకో­లేక ఆటోవాలాలు దిక్కులు చూస్తున్నారు. ఒక్కో ఆటోకు సుమారు రూ.10 వేల నుంచి రూ. 20 వేలకుపైగా ఖర్చు చేస్తేకానీ మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించట్లేదని వాపోతున్నారు.  

మళ్లీ మొదటికి వచ్చింది..
వరద తగ్గిపోయిందని ఇంటిని శుభ్రం చేసుకోవడం మొ­దలు పెడితే.. మళ్లీ తెల్లా­రేç­Üరికి మెట్లపైకి వర­ద చేరింది. పైన అంతస్తు­ల్లో కాలకృత్యాలు తీర్చుకునే వారి వ్యర్థాలు మొత్తం నీళ్లలోకి చేరుతున్నాయి. ఎంత శుభ్రం చేసినా మళ్లీ మొదటికొచ్చింది. నేను గతంలో కరెంట్‌ కాంట్రాక్టు పనులు చేస్తూ దెబ్బతి­న్నాను. 

ఆరోగ్యం రీత్యా నా కొడుకుతో కలిసి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించు­కుంటున్నాను. మాకు దెబ్బమీద దెబ్బ త­గులుతోంది. వారం రోజులుగా ఆహారం అం­దించిన నాథుడే లేడు. బలవంతుడికి ఆహారం దొరికింది.. మా లాంటి బలహీనులు పస్తులు­న్నాం. ఇప్పుడు చలి జ్వరంతో ఇబ్బంది పడు­తు­న్నాం. ఇదేం జీవితమో అర్థం కావట్లేదు. – ఏలియా, పాయకాపురం

పాయకాపురం రాధానగర్‌కు  చెందిన మణికంఠ. మూడేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుడమేరు వరద మణికంఠ జీవితాన్ని తల్లకిందులు చేసింది. రేయింబవళ్లు ఆటో నడిపి ఇంటిలో సమకూర్చుకున్న వస్తువులన్నీ దెబ్బతినడంతో సుమారు  రూ. లక్షకుపైగా నష్టపోయాడు. నడిరోడ్డుపై నీట మునిగిన ఆటో వద్ద.. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టుకుని ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నాడు. 

‘నాకు రూ.లక్షలు పోసి ఆటోలు కొనే పరిస్థితి లేదు. రోజూ రూ. 500కు అద్దె ఆటో నడుపుకొంటున్నాను. ఉదయం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆటో నడిపితేనే ఒక్కోరోజు ఇంటికి రూ. వంద కూడా తీసుకెళ్లలేని పరిస్థితి. అలాంటిది వారం రోజులుగా ఉపాధి పోయింది. శనివారం రాత్రి వరద వస్తుందని అధికారులు  హెచ్చరించలేదు. మేము రాత్రి నిద్రపోయాం. ఆదివారం ఉదయం 7 గంటలకే మా ఇంటిని వరద చుట్టుముట్టింది. 

ఆటోను స్టార్ట్‌ చేసి బయటకు వద్దామంటే ముందుకు కదల్లేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కట్టించి ఇచ్చిన అపార్ట్‌మెంట్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్నాం. ఇంటిలోకి నీళ్లు రావడంతో వంట సామగ్రిని తీసుకుని మొదటి అంతస్తులో కారిడార్‌లో కాలం వెళ్లదీస్తున్నాం.  మునిగిపోయిన ఆటోను కిలో మీటరుపైగా మా నాన్నతో కలిసి తోసుకుంటూ వచ్చాను. కనీసం తాడు కట్టుకుని లాక్కుని వెళ్దామంటే మరో ఆటోని పోలీసులు లోపలికి రానివ్వట్లేదు.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
vijayawada
floods
autos
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.