Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. బ్రిటన్‌ మినిస్టర్‌ కావడమే లక్ష్యం
ADVERTISEMENT 

బ్రిటన్‌ మినిస్టర్‌ కావడమే లక్ష్యం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Aryan-Uday.jpg

యూకే స్టూడెంట్స్‌ ఎన్నికల్లో గెలుపే రాజకీయాల వైపు నడిపించింది  

రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలుపొందా  

అందరితో కలుపుగోలుతనమే నా విజయ రహస్యం 

అక్కడి రాజకీయల్లోను అంతర్గత కుమ్ములాటలు, వివక్ష సహజమే  

‘సాక్షి’తో లండన్‌లోని కెన్సింగ్టన్‌ అండ్‌ చెల్సియా డిప్యూటీ మేయర్‌ ఆర్యన్‌ ఉదయ్‌  

స్వస్థలం భీమవరంలో సహవిద్యార్థులతో మమేకం

సాక్షి, భీమవరం: బ్రిటన్‌ మినిస్టర్‌ కావడమే తన లక్ష్యమని లండన్‌లోని రాయల్‌ బరో ఆఫ్‌ కెన్జింగ్టన్‌ అండ్‌ చెల్సియా డిప్యూటీ మేయర్‌ ఆర్యన్‌ ఉదయ్‌ ఆరేటి చెప్పారు. యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్టూడెంట్‌ ఎన్నికల్లో గెలవడమే తన రాజకీయ ప్రవేశానికి కారణమని తెలిపారు. అనంతరం కన్జర్వేటివ్‌ పార్టీలో చేరి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామానికి చెందిన ఆర్యన్‌ ఉదయ్‌ శుక్రవారం.. భీమవరం వచ్చారు. తాను చదువుకున్న సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన బాల్యం, చదువు, బ్రిటన్‌ రాజకీయాల్లో ఎదుగుదల, తన లక్ష్యాల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

టెన్నిస్‌ కోసం లండన్‌కు  
మాది భీమవరం పక్కనే ఉన్న తుందు­ర్రు గ్రామం. ఆరేటి వీరాస్వామి, గొ­బ్బి­లమ్మ తాత నాయ­నమ్మ. తండ్రి వెంకటసత్యనారాయణ కేజీఆర్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తల్లి విజయలక్ష్మి, సోదరి ఇంద్రాణి. 7వ తరగతి వరకు భీమవరంలోని సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో చదువుకున్నా. అప్పటికే ఏపీ తరఫున టెన్నిస్‌ ఆడుతున్న నేను ఆటపై ఆసక్తితో 8వ తరగతి హైదరాబాద్‌లో చేరాను. స్కూల్‌ నేషనల్స్, ఇంటర్‌ స్టేట్‌ కాంపిటీషన్స్‌కు ఏపీ కెపె్టన్‌గా వ్యవహరించాను. నా స్నేహితులు చాలామంది యూఎస్, యూకే వెళ్లేవారు. గ్రాడ్యుయేషన్‌ తరువాత టెన్నిస్‌ కోసం యూకే వెళ్లాను. 2006లో ఏయూ స్కాలర్‌షిప్‌ రావడంతో లండన్‌లో ఎంఎస్‌ చేశాను.   

రాజకీయాల్లోకి..  
యూకే కాలేజీలో తెలుగు విద్యార్థుల పట్ల వివక్ష పూరిత సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. అప్పుడే స్టూడెంట్స్‌ ఎన్నికల్లో గెలవడం నాలో ఆత్మస్థైర్యం, నమ్మకం పెంచాయి. చదువు అనంతరం అక్కడే ఉండి బిజినెస్‌ చేసుకుంటూ కన్జర్వేటివ్‌ పార్టీ ఫాలోవర్‌గా ఉన్నాను. అక్కడి సిటిజన్‌షిప్‌ కూడా వచ్చింది. బ్రిగ్జిట్‌ టైంలో డేవిడ్‌ కేమరూన్‌ టీంలో చేరాను. నా అనాలసిస్, స్ట్రాటజీని చూసి కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున పనిచేయాలని ప్రోత్సహించేవారు. 2014లో పార్టీలో సభ్యుడిగా చేరాను. రెండు, మూడు సంవత్సరాలు పార్టీ విధివిధానాలు, రాజకీయ పరిస్థితులను సైలెంట్‌గా అబ్జర్వ్‌ చేస్తూ వచ్చాను. ఇక్కడి మాదిరి అక్కడ కూడా రాజకీయ పారీ్టల్లో అంతర్గత విభేదాలు, వివక్ష కామనే. ఈ పరిస్థితులను బట్టి బ్రిటిష్‌ వాళ్లు మనల్ని రూల్‌ చేయలేదు. మన అంతర్గత కొట్లాటలతో మనమే పాలించబడ్డామని నా అభిప్రాయం.  

ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు 
యువత కులమతాలు, ప్రాంతీయ విభేదాలు విడిచిపె­ట్టి కలిసుండాలి. అనవసరమైన ఆర్భాటా­లు, ప­బ్లిసిటీలకు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువ అం­చ­నా వేయకుండా లక్ష్యాన్ని చేరేందుకు ముందుకు సాగాలి.  

2018, 2022ల్లో  సెంట్రల్‌ కౌన్సిలర్‌గా ఎన్నిక  
నిజాం కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆకర్షితుడినయ్యాను. లండన్‌లోను దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేసేవాడిని. భారతీయులు, మన సంప్రదాయాలను ఎంతో గౌరవించే పార్టీ చైర్మన్, మాజీ మేయర్‌ జూలీమీల్స్‌ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. అందరితో కలుపుగోలుతనం నాకు కలిసొచ్చింది. ఇంటర్నల్‌ ఓటింగ్‌లో తెల్లవాళ్లకంటే అత్యధిక మెజార్టీ సాధించడంతో 2017లో నాకు సీట్‌ డిక్లేర్‌ అయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సెంట్రల్‌ కౌన్సిలర్‌గా గెలిచాను. కౌన్సిలర్‌ అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో సమానం.

2022 ఎన్నికల్లోను వరుస విజయాన్ని అందుకున్నాను. లండన్‌లోని ముఖ్యమైన ప్రాంతానికి డిప్యూటీ మేయర్‌గా సు­మారు రెండున్నర లక్ష­లమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్లానింగ్, లైసెన్సింగ్, ఎని్వరాన్‌మెంట్‌ తదితర కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాను. మేయర్‌ అందుబాటులో లేని సమయంలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత్, బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌లో ఆక్వా, ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించి కొన్ని పాలసీలు చేయాలని అనుకున్నాం. కానీ సెంట్రల్‌ స్థాయిలో మా పార్టీ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఆ దిశగా కృషిచేస్తాను. దేవుడి దయతో ఈ స్థాయికి వచ్చాను. వచ్చే ఎన్నికల్లో మేయర్‌ కావాలన్నదే నా లక్ష్యం. ఎంపీ కావడం, అనంతరం మినిస్టర్‌ అవడం తదుపరి లక్ష్యాలు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Deputy Mayor
Aryan
interview with sakshi
Bhimavaram
NRI News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

ఫిన్లాండ్‌లో విద్యార్థి మణిదీప్‌ రెడ్డి మిస్సింగ్‌

ఫిన్లాండ్‌లో విద్యార్థి మణిదీప్‌ రెడ్డి మిస్సింగ్‌

మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ

మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ

తెరపైకి సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత చరిత్ర.. హీరో ఇతనే!

తెరపైకి సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత చరిత్ర.. హీరో ఇతనే!

యూట్యూబర్‌ నందు కేసులో విస్తుపోయే అంశాలు

యూట్యూబర్‌ నందు కేసులో విస్తుపోయే అంశాలు

కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు

కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.