Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Vennupotu Dinam: పెల్లుబికిన ప్రజాగ్రహం
ADVERTISEMENT 

Vennupotu Dinam: పెల్లుబికిన ప్రజాగ్రహం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 5, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1232.jpg

సరిగ్గా ఏడాది క్రితం అబద్ధపు హామీలతో అధికారాన్ని దొరకబుచ్చుకున్నారు. ప్రజల నుంచి ఓట్లు దండుకుని.. వారికే పంగనామాలు పెట్టారు. ఇచ్చిన హామీలు కాకుండా.. ఏడాది కాలంగా కొత్త కథలు చెబుతూ నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారంటూ జనం రోడ్లపైకి వచ్చారు. వెన్నుపోటు సర్కారుపై నిరసన ప్రకటిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజావాహిని నిరసనల జోరుతో ఊరూవాడా దద్దరిల్లింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  ‘చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రోజిది. ఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజిది. అప్పుడు మామ ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పోడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’ అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి జిల్లా ప్రజలు గొంతెత్తారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై కదం తొక్కారు. కిలోమీటర్ల మేర పాదయాత్రగా ర్యాలీ చేశారు. నిరసన ర్యాలీలతో జిల్లా హోరెత్తిపోయింది. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా ఎక్కడా తగ్గలేదు. అన్నింటిని అధిగమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసనపై ఉక్కుపాదం మోపేందుకు గత వారం రోజులుగా అనుమతుల విషయంలో కుట్ర పన్నినా పారలేదు. వైఎస్సార్‌సీపీ కేడర్‌తో పాటు సామాన్య జనం నిరసన ర్యాలీల్లో వేలాదిగా పాల్గొన్నారు. దీంతో పారీ్టలో నూతనోత్తేజం కనిపించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.

మహిళా ద్రోహి చంద్రబాబు 
ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం.. అధికారం చేపట్టాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మహిళలంతా ఓటేసి మోసపోయాం. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి అమాయక ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద వింతకాదు. సూపర్‌సిక్స్‌ హామీలు అమలుచేయకుండా వెన్నుపోటు పొడిచారు.  – బెండి పూర్ణ,        పాత్రునివలస జగనన్న కాలనీ

 జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. 
నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి నినదించారు. వేలాది మంది ఏడు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ర్యాలీ అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసన ప్రదర్శనలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి.పద్మావతి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, రాష్ట్ర తూర్పు కాపు విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్‌ రావు, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

ఇచ్ఛాపురంలో.. 
ఇచ్ఛాపురంలోని దాసన్నపేట జంక్షన్‌ నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్‌ పరిశీలకుడు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన చేశారు. వేలాది మంది తరలిరావడంతో ఇచ్ఛాపురం కిటకిటలాడింది.  

హామీల అమలు చేసేదెప్పుడు? 
రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రతి విద్యార్థికి నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అని చెప్పారే తప్ప ఏడాదవుతున్నా ఇవ్వలేదు. మిగిలిన అన్ని వర్గాలను మోసం చేశారు.        
– పిరియా విజయ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌  

పాతపట్నంలో.. 
పాతపట్నంలోని పాతబస్టాండ్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. కోర్టు కూడలి, వైఎస్సార్‌ విగ్రహం జంక్షన్‌ వద్ద నిరసన ప్రదర్శన చేసి, ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.. చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త రెడ్డి శాంతి నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకుని కూటమి ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
vennupotu dinam
Chandrababu Naidu
promises
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.