జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్..

గుంటూరు:
- నల్లపాడులో తీవ్ర ఉద్రిక్తత
- బ్యాలెట్ బాక్సులు మార్చేందుకు టీడీపీ కుట్రలు
- వెంగాయళపాలెం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకెళ్లకుండా నల్లపాడులో దించిన వైనం
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు
- నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
- లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు మహిళా నేతలపై లాఠీచార్జ్
వైఎస్సార్ జిల్లా
- గోపవరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బ్రాహ్మణ పల్లెకు చేరుకున్న బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా
- రామాపురం పోలింగ్ బూత్‌లో ఇంకు బాటిల్ పోశారంటూ ప్రచారం రావడంతో ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి కుమారుని పై దాడి చేసేందుకు భారీగా చేరుకున్న టీడీపీ గూండాలు
- బ్రాహ్మణ పల్లెలోనే ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా.. ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి
- తమకు పోలీసులు సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా
శ్రీ సత్యసాయి జిల్లా
- ధర్మవరం నియోజకవర్గం వెంకటగారిపల్లిలో టీడీపీ నేతల బరితెగింపు
- వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణా రహితంగా దాడులు
- ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
- వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చారన్న కారణంతో దాడులు చేసిన టీడీపీ నేతలు
- జిల్లాలోని మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం రామాయణహట్టి గ్రామంలో టీడీపీ నేతల దొంగ ఓట్లు
- బయట నుంచి బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సులో వేస్తున్న వైనం
- ఒక టీడీపీ నేతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు
- వైరల్‌గా మారిన టీడీపీ నేతల బాగోతం వీడియోలు
శ్రీ సత్యసాయి జిల్లా
- ధర్మవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత
- జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి నేతల దొంగ ఓట్లు
- విషయం తెలిసి గ్రామానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతల కార్లపై రాళ్ల దాడులు
- వైఎస్సార్సీపీ నేత ప్రతాప్ రెడ్డికి చెందిన వాహనం ధ్వంసం
- పోలీసు జీపు అద్దాలు ధ్వంసం, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
- అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- కూటమి పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
- శ్రీకాంత్‌ను అడ్డుకున్న కూటమి నాయకులు కార్యకర్తలు
- ఇరు వర్గాల మద్య వాగ్వాదం
- శ్రీకాంత్ కామెంట్స్...
- అధికార పార్టీ యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతుంది
- ఈదరపల్లి వంటి కేంద్రాలను సమస్యాత్మక గ్రామాలుగా ముందుగానే గుర్తించినా పూర్తిలో పోలీసులు భద్రత కల్పించలేకపోయారు
- పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిన్నారు
ఏలూరు జిల్లా
- ద్వారకా తిరుమల మండలం తూర్ల లక్ష్మీపురంలో ఉద్రిక్తత
- వైఎస్సార్సీపీ నాయకులు ఓటు వేసేందుకు వెళ్లగా వారికి ఇచ్చిన బ్యాలెట్ పేపర్ పై అప్పటికే బీజేపీ సింబల్ పై సిరా ముద్ర ఉండడంతో అవాక్కయ్యారు
- ఇదేంటని పోలింగ్ ఆఫీసర్‌ను ప్రశ్నించగా స్లిప్పు మడత పెట్టేటప్పుడు పొరపాటున కమలం గుర్తుపై ఇంకు అంటుకుందన్నఅధికారులు
- మిగిలిన స్లిప్పులపై కూడా కమలం గుర్తుపైనే ముద్రలు ఉన్నట్టు గుర్తింపు
- ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు
- ఇలా రిగ్గింగ్ చేసుకునేటప్పుడు అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం అని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులు
- ఓటమి భయంతో కూటమి నేతలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు
అనకాపల్లి
- బుచ్చయ్యపేట మండలం తురకలపూడిలో బరితెగించిన కూటమి నేతలు
- దొంగ ఓట్లు వేస్తున్న కూటమి నేతలు
- అడ్డుకున్న వైఎస్సార్సీపీ ఏజెంట్లు రాజారావు, లోవరాజు, రమేష్, నాని
- వైఎస్సార్సీపీ ఏజెంట్లపై కూటమి కార్యకర్తలు దాడి
విజయవాడ
- ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ అనుమానాలు
- ఎస్ఈసి ప్రకటనతో బట్టబయలైన బండారం
- మధ్యాహ్నం 1 గంటకు 30.50 శాతం పోలింగ్
- 6 గంటల్లో 30.50 శాతం పోలింగ్ నమోదు
- మధ్యాహ్నం 1 గంట తర్వాత భారీగా అసాధారణంగా పెరిగిన పోలింగ్
- మధ్యాహ్నం 3 గంటలకు 58.55 శాతం నమోదు
- 2 గంటల్లోనే 28 శాతం నమోదు పై అనుమానాలు
- మొదటి 6 గంటల్లో 30 శాతం తర్వాత రెండు గంటల్లోనే 28 శాతం పోలింగ్
- అనేక జిల్లాల్లో దౌర్జన్యంగా టీడీపీ రిగ్గింగ్
కర్నూలు జిల్లా
- చిప్పగిరి మండలం గుమ్మనూరులో ఉద్రిక్తత
- కూటమి నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్
- కూటమి నాయకులు బీజేపీ , టీడీపీ నాయకుల మధ్య చెలరేగిన వివాదం
- ఇరువర్గాలు కర్రలతో, రాళ్ళతో పరస్పర దాడులు, పలువురికి గాయాలు
- దాడులకి పాల్పడిన కొందరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం
కాకినాడ జిల్లా
కాకినాడ
- తుని మండలం అటకువాని పాలెం పోలింగ్ బూత్ లో ఓటర్లపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకులు
- టీడీపీ నేతల దౌర్జన్యానికి ఓటర్ల భయబ్రాంతులు
నెల్లూరు జిల్లా
- నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఆత్మకూరు సీఐ గంగాధర్ ఓవర్ యాక్షన్
- పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని అడ్డుకొని రహదారికి పోలీసు వాహనం అడ్డుపెట్టిన సీఐ
- మండలంలో పర్యటించడానికి వీల్లేదంటూ నానా యాగి
తిరుపతి జిల్లా, చంద్రగిరి
- సప్తగిరి కాలనీ, 115,116,117 బూతులలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- అన్నా రామచంద్రయ్య, అన్న రామకృష్ణ, సప్తగిరి నగర్ ఓటర్లు కాకపోయినా ఇక్కడ ఓటు వేశారు
- సీసీ కెమెరాలలో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి
- దీనికి సహకరించిన పోలీసులు, అధికారుల మీద చర్యలు చేపట్టాలి
- జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికార పార్టీకి దాసోహమయ్యారు
- ప్రజల పక్షాన కాకుండా టీడీపీ పక్కా నా పని చేస్తున్నారు ఎస్బిఐ సుబ్బారాయుడు
- దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, న్యాయపరంగా పోరాడుతామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నెల్లూరు జిల్లా
- ఉదయగిరి, బండగానిపల్లిలో ఉద్రిక్తత
- బిజ్జంపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డ టీడీపీ గూండాలు
- అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి
- ఇరు వర్గాల మద్య ఘర్షణ జరగడంతో లాఠీచార్జ్ చేసిన పోలీసులు
- మర్రిపాడు మండలంలో వైఎస్సార్సీపీ ఏజెంట్స్ ను బయటకు నెట్టి రిగ్గింగ్
- 27, 28 బూత్‌లలో టీడీపీ శ్రేణులతో దగ్గర వుండి రిగ్గింగ్ వేయిస్తున్న ఎసై బలరాం రెడ్డి
ప్రకాశం జిల్లా
- చీమకుర్తి మండలం బల్లమూడి గ్రామం ఎంపీటీసీ ఎన్నికలలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
- ఏజెంట్లను, అభ్యర్థి భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి దొంగ ఓట్లు వేసుకుంటున్నారు
- తక్షణమే సంతనూతలపాడు నియోజకవర్గ నాలుగు మండలాలు రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసిన మాజీమంత్రి మెరుగు నాగార్జున
తిరుపతి జిల్లా
- మంగళం కోర్టు జడ్పీ హైస్కూల్ దగ్గర మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన
- పోలింగ్ బూత్ దగ్గర ఇతర ప్రాంతాల నుంచి రౌడీ ముఖాలను పిలిపించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
- రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గుండాలు
- టీడీపీ రౌడీ ముఖాలకు తొత్తులుగా పోలీసులు పని చేస్తున్నారంటూ పోలింగ్ బూత్ ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన
- శివ రెడ్డితో పాటు మంగళం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన
- పోలీసులే టీడీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- ఇతర ప్రాంతాల నుంచి వందలాదిమంది పోలింగ్ బూతులు దగ్గర ఉన్న పట్టించుకోవడం లేదు
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలను ఇక్కడ నుంచి పంపకుంటే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చిత్తూరు జిల్లా
- కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ గూండాల దౌర్జన్యం
- శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ బూత్‌లో రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ
- సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు నివాసం పక్కనే ఉన్న కడపల్లి పంచాయతీలో గెలిచే ధైర్యం లేక రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ శ్రేణులు
- టీడీపీ నాయకుల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి నిరసన
- భారీ ఎత్తున కుప్పం పట్టణం నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ నాయకులు
- తవణంపల్లి మండలం పట్నం ఎంపీటీసీ సెగ్మెంట్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత
- గొడవలను చిత్రీకరిస్తున్న మండల సాక్షి రిపోర్టర్ జగన్నాథంపై దాడి చేసిన టీడీపీ మూకలు
ఏలూరు జిల్లా
- నూజివీడు నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 60.70 శాతం పోలింగ్ నమోదు
- నాలుగు మండలాల్లో కలిపి ఇప్పటివరకు 1,18,085 మంది ఓటు హక్కు వినియోగం
- ఆగిరిపల్లి మండలంలో 59.39 శాతం పోలింగ్
- చాట్రాయి మండలంలో 63.69 శాతం పోలింగ్
- ముసునూరు మండలంలో 63.94 శాతం పోలింగ్
- నూజివీడు మండలంలో 54.31 శాతం పోలింగ్
- నాలుగు మండలాల్లో మొత్తం ఓటర్లు – 1,97,103
- ఇప్పటివరకు పోలైన ఓట్లు – 1,18,085
ఏలూరు జిల్లా
కైకలూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలలో మూడు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
1) కలిదిండి 60.86
2) ముదినేపల్లి 69.6%
3) మండవల్లి 63.2%
4) కైకలూరు 60%
పార్వతీపురం మన్యం జిల్లా
- వీరఘట్టం మండలం, కత్తులకవిటి పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత
- వైఎస్సార్సీపీ ఏజెంట్లపై పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దాడి
- కూటమికి ఓట్లు వేయాలని ఓటర్లకు ఎమ్మెల్యే బెదిరింపులు
వైఎస్సార్ జిల్లా - పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్
- టీడీపీ గూండాలు బూత్‌ల వద్ద ఎందుకు ఉన్నారని ప్రశ్నించినందుకు లాఠీ ఛార్జ్
- పోలింగ్ బూత్ ఆక్రమించుకున్న బీటెక్ అనుచరులు
- రిగ్గింగ్ చేసుకుంటున్నారని ప్రశ్నించినందుకు లాఠీ ఛార్జ్
కర్నూలు జిల్లా
- కర్నూలు జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎన్నికల అధికారులు
- కోసిగి 1 పోలింగ్ కేంద్రంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు.
- సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని సూచిస్తున్న పీవో
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి ఎంపీటీసీ 4 ప్రాదేశికం వైఎస్సార్సీపీ అభ్యర్థిని మామిడి జ్యోతి భర్త మామిడి కృష్ణని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులను అడ్డుకున్న ఎంపీటీసీ అభ్యర్థి , వైఎస్సార్సీపీ నాయకులు
కోసిగి మండలం ఆర్లబండలో ఉద్రిక్తత
- టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డుకున్న వైఎస్సార్సీపీ ఏజెంట్లు
- పోలింగ్ బూత్ వద్ద కు చేరుకున్న అధికారులు
- నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ
తూర్పుగోదావరి జిల్లా
- అనపర్తిలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య వివాదం
- వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కుమారుడిపై టీడీపీ నేత దాడికి దిగడంతో ఒకరినొకరు తోసుకున్న ఇరు వర్గాలు
- దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం
- సమాచారం అందుకుని ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
తిరుపతి జిల్లా
- నాయుడు పేట పెళ్లకూరు మండలంలో టీడీపీ అరాచకవాదులు రిగ్గింగ్
- పునబాక గ్రామం 26వ బూత్‌లో వైఎస్సార్సీపీ ఏజెంట్‌ను బయటకు నెట్టి యధేశ్చగా రిగ్గింగ్
ఎన్టీఆర్ జిల్లా
- ఎన్టీఆర్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకు జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ - 55.24 శాతం
నెల్లూరు జిల్లా
- వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దురుసు ప్రవర్తన
- ఉదయం నుండి ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను తరమికొట్టి మంత్రి అనుచరులు రిగ్గింగ్
- పోలింగ్ కేంద్రంలోని వైఎస్సార్సీపీ జెడ్పీటిసీ అభ్యర్థిని బయటకు వెళ్ళగొట్టి దుర్భసలాడిన మంత్రి
- ఎదురుపడ్డ మంత్రి ఆనంను ఇది ఎక్కడి కల్చర్ అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
- ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిపైకి దూసుకెళ్ళిన వైనం
పల్నాడు జిల్లా
- సత్తెనపల్లి నియోజకవర్గం చాగంటి వారి పాలెం పోలీసుల దౌర్జన్యం
- వైఎస్సార్సీపీ అభ్యర్థిని, ఓటర్లను పంపిణీ సీఐ ప్రభాకర్ రావు, సీఐ సుబ్బారావు
- పోలీసుల వైఖరి పై ఓటర్లు తీవ్ర ఆగ్రహం
- వైఎస్సార్సీపీ నాయకుల్ని ఆపివేసి టీడీపీ నాయకులను అనుమతిస్తున్న పోలీసులు
- సీఐ ప్రభాకర్ రావు సీఐ సుబ్బారావులు తెలుగుదేశం నాయకుల చేస్తున్న రిగ్గింగ్‌కు సహకరిస్తున్నారంటూ ఆగ్రహిస్తున్న ఓటర్లు
పశ్చిమగోదావరి జిల్లా
- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించిన భీమవరం మండలం కోమటి తిప్పనార్త్ గ్రామ పంచాయతీ వెంకటతిప్ప గ్రామ ప్రజలు
- 40 ఏళ్లుగా తమ గ్రామం లో ఉన్న పోలింగ్ బూత్ ను కోమటి తిప్ప కు మార్చారని, అందుకే ఎన్నికలను బహిష్కరించామని గ్రామస్తులు వెల్లడి
- పోలింగ్ బూత్‌ను యాదవిధిగా తమ గ్రామంలో తిరిగి ఏర్పాటు చేసేవరకు ప్రతి ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్థుల నిరసన
- పోలింగ్ బూత్‌ను పక్క గ్రామానికి ఎందుకు మార్చారు అంటూ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును నిలదీసిన గ్రామస్తులు
- చేసేదేమీ లేక వెనదిరిగిన జనసేన ఎమ్మెల్యే
అన్నమయ్య జిల్లా.. పీలేరులో టీడీపీ నాయకులు రిగ్గింగ్
- పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రిగ్గింగ్
- కె.వి.పల్లి మండలం లక్ష్మిరెడ్డిగారిపల్లెలో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ బాక్స్‌ను బయట వేసేందుకు టీడీపీ నాయకులు యత్నం
- ఒక్కసారిగా బయటకు పడేయడంతో పరిస్థితి ఉద్రిక్తం
- పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు యత్నం
- బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యం
పశ్చిమగోదావరి జిల్లా
• మొత్తం పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర పోలింగ్ (1:00 PM సమయానికి): 47.72%
• పెంటపాడు మండలంలో అత్యధికంగా 53.44% పోలింగ్ నమోదు
• మొగల్తూరు మండలంలో అత్యల్పంగా 42.61% పోలింగ్ నమోదు
• ఆచంట మండలంలో 43.80% పోలింగ్ నమోదు
• ఆకివీడు మండలంలో 47.32% పోలింగ్ నమోదు
• అత్తిలి మండలంలో 51.19% పోలింగ్ నమోదు
• భీమవరంమండలంలో 46.08 % పోలింగ్ నమోదు
• యలమంచిలి మండలంలో 47.84% పోలింగ్ నమోదు
• గణపవరం మండలంలో 48.20% పోలింగ్ నమోదు
• ఇరగవరం మండలంలో 47.64 % పోలింగ్ నమోదు
• కాళ్ళ మండలంలో 48.29% పోలింగ్ నమోదు
• నరసాపురం మండలంలో 46.76% పోలింగ్ నమోదు
• పాలకొల్లు మండలంలో 47.24 % పోలింగ్
• పాలకోడేరు మండలంలో 45.25% పోలింగ్ నమోదు
• పెనుగొండ మండలంలో 44.83% పోలింగ్ నమోదు
• పెనుమంట్ర మండలంలో 48.09 % పోలింగ్ నమోదు
• పోడూరు మండలంలో 50.61% పోలింగ్ నమోదు
• తాడేపల్లి గూడెం మండలంలో 49.86% పోలింగ్ నమోదు
• తణుకు మండలంలో 49.34% పోలింగ్ నమోదు
• ఉండి మండలంలో 49.72% పోలింగ్ నమోదు
• వీరవాసరం మండలంలో 46.64% పోలింగ్ నమోదు
గుంటూరు
- గుంటూరు రూరల్ మండలం వెంగళయపాలెంలో ఉద్రిక్తత
- వెంగళాయపాలెంలో భారీగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న తెలుగుదేశం నాయకులు
- అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు
- వైఎస్సార్సీపీ అభ్యర్థితో పాటు నాయకులను పంపించి వేస్తున్న పోలీసులు
- తెలుగుదేశం అభ్యర్థితో పాటు నాయకులని పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్న సీఐ పొన్నూరు భాస్కర్
- తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పిన వినిపించుకొని సీఐ పొన్నూరు భాస్కర్
- వైఎస్సార్సీపీ అభ్యర్థితో పాటు కార్యకర్తలని తరిమేస్తున్న పోలీసులు
- పోలీసులు తెలుగుదేశం నాయకులకు తొత్తులుగా మారారని నిప్పులు చెరుగుతున్న ఓటర్లు
చిత్తూరు
- గుడిపాల మండలంలో దొంగ ఓట్లు వేసేందుకు అధిక సంఖ్యలో మొహరించిన టీడీపీ నాయకులు
- చిత్తూరు టీడీపీ నాయకుడు కాజూరు బాలాజీ ఆధ్వర్యంలో మొహరించిన టీడీపీ గూండాలు
- మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ అల్లరి మూకలు
- గుడిపాల మండలంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు
- ఏమాత్రం పట్టించుకోని ఎన్నికల అధికారులు
- బయట ప్రాంతాల వ్యక్తులతో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్
కాకినాడ జిల్లా
కాకినాడ
- జగ్గంపేటలో ఎన్నిక కోడ్ ఉల్లఘించిన టీడీపీ
- ఎన్నికల వేళ టీడీపీ టీష్టరులు, ప్లకార్డులతో బహిరంగ ప్రచారం
- టీడీపీకి ఓటు వెయ్యాలంటూ కార్యకర్తల ప్రచారం
- సెక్షన్ 144 అమలులో ఉన్నా... టీడీపీ ప్రచారంపై పోలీసుల ప్రేక్షక పాత్ర
కళ్యాణదుర్గం
- కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల కేంద్రం, చింతర్ల పల్లి, కనుకూరు గ్రామాలలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ హల్ చల్
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను బెదిరించేందుకు యత్నం తిరగబడిన వైఎస్సార్సీపీ ఏజెంట్లపై అనుచరులతో దాడి
- వైఎస్సార్సీపీ ఏజెంట్లు, టీడీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం తోపులాట
- ఆయా గ్రామాలలో గంటలపాటు ఉద్రిక్తత
- ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
- ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు అనుచరులతో భౌతిక దాడులకు యత్నం
- సమస్యాత్మక గ్రామాలలో సైతం కూడా ఇద్దరు పోలీసులను నియమించిన పోలీసు ఉన్నతాధికారులు
- పలుచోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయని వైనం
ఏలూరు జిల్లా
• మొత్తం ఏలూరు జిల్లా సమగ్ర పోలింగ్ (1:00 PM సమయానికి): 43.74%
• పెదవేగి మండలంలో అత్యధికంగా 54.77% పోలింగ్ నమోదు
• భీమడోలు మండలంలో అత్యల్పంగా 27.33% పోలింగ్ నమోదు
• లింగపాలెం మండలంలో 53.94% రికార్డు స్థాయి పోలింగ్
• నిడమర్రు మండలంలో 49.84% పోలింగ్ నమోదు
• మండవల్లి మండలంలో 49.39% పోలింగ్ నమోదు
• అగిరిపల్లి మండలంలో 48.97% పోలింగ్ నమోదు
• చింతలపూడి మండలంలో 48.91% పోలింగ్ నమోదు
• దెందులూరు మండలంలో 48.71% పోలింగ్ నమోదు
• ముదినేపల్లి మండలంలో 48.64% పోలింగ్ నమోదు
• ముసునూరు మండలంలో 47.59% పోలింగ్ నమోదు
• ఉంగుటూరు మండలంలో 46.51% పోలింగ్ నమోదు
• కలిదిండి మండలంలో 46.24% పోలింగ్ నమోదు
• ఏలూరు మండలంలో 46.35% పోలింగ్ నమోదు
• జంగారెడ్డిగూడెం మండలంలో 45.17% పోలింగ్ నమోదు
• ద్వారకా తిరుమల మండలంలో 42.19% పోలింగ్ నమోదు
• పెదపాడు మండలంలో 41.08% పోలింగ్ నమోదు
• కొయ్యలగూడెం మండలంలో 40.70% పోలింగ్ నమోదు
• నూజివీడు మండలంలో 39.97% పోలింగ్ నమోదు
• కుక్కునూరు మండలంలో 38.49% పోలింగ్ నమోదు
• కైకలూరు మండలంలో 38.35% పోలింగ్ నమోదు
• టి.నరసాపురం మండలంలో 36.81% పోలింగ్ నమోదు
• చాట్రాయి మండలంలో 34.71% పోలింగ్ నమోదు
• కామవరపుకోట మండలంలో 32.07% పోలింగ్ నమోదు
• మొత్తం ఓటర్లు: 11,62,523
1:00 PM నాటికి ఓటేసినవారు: 5,08,545 (పురుషులు: 2,53,289 | మహిళలు: 2,55,256)
ప్రకాశం జిల్లా
- ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం కొలిజేడు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- పోలింగ్ కేంద్రంలోకి రాకుండా వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ నేతలు
- పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
కృష్ణాజిల్లా
- కృత్తివెన్ను మండలంలో ఎన్నికల పోలింగ్‌కు వర్షం ఆటంకం
- మాట్లం పోలింగ్ బూత్‌లో గొడుగు వేసుకుని వర్షంలో కూడా క్యూ లైన్లో నుంచుని ఓట్లు వేయడానికి వెళుతున్న ఓటర్లు
నెల్లూరు జిల్లా
- నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి
- ఓటు వేసేందుకు వెళ్లిన మస్తాన్‌పై దాడికి యత్నించిన టీడీపీ వర్గీయులు
- దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్లోకి పరుగులు తీసిన మస్తాన్
- అదే సమయంలో అటుగా వస్తున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు మందల పెంచలరావుపై మూకుమ్మడి దాడి
- టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన మందల పెంచలరావు
- ఈ ఘటనతో వెంకటాచలం మండల కేంద్రంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం
- గాయపడిన పెంచలరావును, మస్తాన్‌ను పోలీస్ స్టేషన్‌కి తరలిపు
విజయవాడ
- స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ నేతలు
- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమినేతల ఆగడాలు అఘాయిత్యాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలు
- ఎస్ఈసీకి వచ్చిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, వైఎస్సార్సీపీ నేతలు నారాయణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి
కర్నూలు జిల్లా... పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు..
- పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత
- స్థానిక ప్రజలపై లాఠీఛార్జి చేసిన సీఐ జయన్న
- వైఎస్సార్సీపీ నేత బనగాని శ్రీనివాసులను బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించేందుకు ప్రయత్నం
- పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు..
- కారణం లేకుండా ఎందుకు అరెస్టు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు
- వైఎస్సార్సీపీ కార్యకర్తలు, గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్
- ప్రజలు తిరగబడ్డంతో వైఎస్సార్సీపీ నేత శ్రీనును వదిలిపెట్టిన పోలీసులు
చిత్తూరు..
- వీ.కోట పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత..
- వీ.కోటలో ఓటు వేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్‌పై సీఐ సోమశేఖర్ రెడ్డి దౌర్జన్యం.. ఆపై దాడికి యత్నం!
- ఓటు వేయడానికి వేచి ఉన్న సమయంలో కుప్పం రిపోర్టర్ అక్రమ్‌పై దౌర్జన్యం
- ఓటు వేయడానికి వచ్చానని చెబుతున్న వినకుండా రెచ్చిపోయిన వీ.కోట సీఐ..
పోలీసులు, టీడీపీ కలిసి పులివెందులలో అరాచక పర్వం
- వైఎస్సార్ జిల్లా.. పులివెందులలో మొత్తం పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ మూకలు
- పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు
- ఉదయం నుంచి అరాచకం సృష్టించిన టీడీపీ గూండాలు
- బీటెక్ బంధువులు, టీడీపీ మూకలు కలిసి అరాచకం!
- ప్రతి బూత్ నుంచీ వైఎస్సార్సీపీ ఏజెంటును లాగేసిన టీడీపీ మూకలు
- పూర్తిగా పోలీసుల సహకారంతో ఏజెంట్లను అడ్డుకున్న వైనం
- ఓటర్లు రాకుండా పోలింగ్ కేంద్రాలకు తాళం వేసిన టీడీపీ గూండాలు
- పెట్రోల్ బాంబులతో స్వైర విహారం చేసిన టీడీపీ మూకలు
- ఉదయం 11 గంటలకే దాదాపు 50 శాతం పోలింగ్
- ఉదయం 5 గంటలకే బూత్ ల్లోకి దూరి రిగ్గింగ్ చేసుకుంటున్న మూకలు
- టీడీపీ దాడుల్లో విలేకరులు, ఓటర్లకు గాయాలు
అనంతపురం: రిగ్గింగ్ చేయిస్తూ పట్టుబడ్డ కూడేరు సీఐ రాజు
- నిలదీసిన మరుట్ల గ్రామస్తులు
- సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన సీఐ రాజు
- మంత్రి పయ్యావుల కేశవ్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం
పక్క ఊరి నుంచి వచ్చిన టీడీపీ గూండాల అరాచకాం..
- పెద్దముడియంలోని బూత్ నంబర్ 32,33 వద్ద ఉద్రిక్తత
- వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరవ భాస్కర్ బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి అరవ శ్రీకళపై దాడి..
- మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడిన టీడీపీ గూండాలు
మమల్ని చంపేయండి.. పోలీసులపై వైఎస్సార్సీపీ నాయకుడు జంపాని రాఘవులు ఆగ్రహం!
- నెల్లూరు జిల్లా, కావలి
- రాజ్యాంగాన్ని కూని చేస్తున్న చెంచుగానిపాలెం టీడీపీ నేతలు..
- చెంచుగానిపాలెం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ కలకలం
- అడ్డుకున్న జంపాని రాఘవులు..
- పోలీస్ సహకారాలతో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న కూటమి నేతలు..
- ప్రశ్నించిన రాఘవులు మీద కేసులు పెడతామంటూ బెదిరింపులు..
నంద్యాల జిల్లా...
- ప్రాతకోట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
- వైఎస్సార్సీపీ ఏజంట్లకు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
- రిలీవర్ ఏజంట్లను లోపలికి పంపకుండ అడ్డుకుంటున్న పోలీసులు.
కర్నూలు జిల్లా ....
- కర్నూలు మండలం టిడిపి పార్టీ నేతలు ప్రలోభాలు
- మండలంలోని నందనపల్లె ఎంపిటిసి అభ్యర్థి నాగరాజు డబ్బుల పంపిణీ
- ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు కు డబ్బులు అందిస్తున్న టిడిపి నేతలు
- దొంగ ఓట్లు వేసేందుకు ఎన్నికల సిరా ను హైపో ద్రవం తో తుడిచి ఓట్లు వేస్తున్న టిడిపి నేతలు ..
తాడేపల్లి : సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారు..
- టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కామెంట్స్..
- పరిషత్ ఎన్నికలలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు
- పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తూ కూర్చుంది
- సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లోనూ సరైన ఏర్పాటు చేయలేదు
- గతంలో ఎప్పుడూ గొడవలు జరగని చోట కూడా ఘర్షణలు జరుగుతున్నాయి
- ఇతర రాష్ట్రాల నుండి రప్పించిన గూండాలతో దాడులు చేయిస్తున్నారు
- పార్నపల్లెలో ఎంపీ అవినాష్‌రెడ్డిని డీఎస్పీ మురళినాయక్ ఎలా అడ్డుకుంటారు?
- టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలింగ్ కేంద్రాల్లో కూర్చుని రిగ్గింగ్ చేశారు
- వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలే పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారు
- అలాంటప్పుడు ఇక ఎన్నికలను జరపటం ఎందుకు?
- గ్రామాలలో పెట్రోలు బాంబుల సంస్కృతిని తెచ్చారు..
- అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా?
- పోలీసులు టీడీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు!
- పోస్టింగులు, ట్రాన్సఫర్ల కోసం టీడీపీ నేతలు చెప్పినట్టు ఆడుతున్నారు..
- సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారు..
- ఇక తనకు అధికారం రాదని తెలిసి ఇలా రెచ్చిపోతున్నారు
- అన్ని ఆటంకాలను ఎదుర్కొని మా పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారు..
- మహిళలు సైతం కొంగు బిగించి పోరాటం చేస్తున్నారు..
- ప్రశాంతంగా ఎన్నికలు జరిపించే దమ్ము చంద్రబాబుకు లేదు.
- ఎస్ఈసీ, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి దౌర్జన్యాలు, దాడులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ పోలీసుల దూకుడు..
- పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం
- మంత్రి సవిత ఇలాకాలో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై గోరంట్ల సీఐ శేఖర్ దాడులు..
- మహిళలను సైతం బూతులు తిడుతూ మానసికంగా వేధించిన సీఐ శేఖర్..
రైల్వే కోడూరులో దొంగ ఓటర్లు..
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు
- జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా సిటీలు, టౌన్ల నుంచి దొంగ ఓటర్లను తరలిస్తున్న టీడీపీ
- దొంగ ఓటర్లను తరలిస్తున్న వ్యాన్లను మార్గమధ్యలోనే గుర్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులు..
కృష్ణాజిల్లా...
- మచిలీపట్నం సౌత్ మండలం కోన గ్రామం..
- ఎన్నికల బూత్ వద్ద బరితెగించిన టీడీపీ నేతలు
- ఓట్లు వేయడానికి వెళుతున్న ప్రజలను అడ్డుకుంటున్న వైఖరి..
- పసుపు కండువాలు, చొక్కాలు ధరించి ప్రలోభాలకు గురి చేస్తున్న తీరు
- చోద్యం చూస్తున్న అధికారులు
శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే శంకర్ బరితెగింపు..
- కిష్టప్పపేట పోలింగ్ బూత్ దగ్గర ఎమ్మెల్యే హల్చల్
- వైఎస్సార్సీపీ నేత నరసింగరావుపై దాడి
- అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా దాడిచేసిన ఎమ్మెల్యే శంకర్
- వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల రాళ్ల దాడి
- పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం..
- పిల్లుట్ల గ్రామం నందు 10.30 నిమిషాలకే ఓటింగ్ పర్సంటేజ్ లేదంటూ టీడీపీ నాయకుల దౌర్జన్యం..
- ఓట్లు వేయటానికి అవకాశం లేదంటూ ఓటర్లను వెళ్లిపోవాలని బెదిరిస్తున్న వైనం
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత
- కూడేరు మండలం మరుట్లలో టీడీపీ నేతల రిగ్గింగ్
- ఆగ్రహంతో బ్యాలెట్ బాక్సు ఎత్తుకెళ్లిన స్థానికులు
- బ్యాలెట్ పేపర్లు చించేసిన ఓటర్లు
- కూడేరు సీఐ రాజు స్వయంగా రిగ్గింగ్ చేయించారని ఆరోపణలు
పోలీసుల సమక్షంలో రిగ్గింగ్ జరగటం దారుణం..
- తిరుపతి జిల్లా.. పెనగలూరు మండలం ఓబిలి బూత్
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటికి లాగేసి రిగ్గించేస్తున్న కూటమి నాయకులు
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించని ఎన్నికల అధికారులు, పోలీసులు
- వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రుప్ప దివ్యపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే గొండు శంకర్
- క్యూ లైన్లో ఓటర్లను ఎమ్మెల్యే ప్రలోభ పెడుతుండడంపై ప్రశ్నించిన దివ్య
- పోలింగ్ బూత్ దాటి బయటకు రాలేవంటూ ఎమ్మెల్యే వార్నింగ్
- శంకర్ దురుసు ప్రవర్తనపై ముక్కును వేలేసుకుంటున్న సొంత గ్రామం మహిళలు
- కిష్టప్ప పేటలో గొడవలు రేపేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం
- దీటుగా ఎదుర్కొంటున్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులు
టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ హల్చల్..
- అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల కేంద్రం..
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను బెదిరించేందుకు యత్నం
- తిరగబడిన వైఎస్సార్సీపీ ఏజెంట్లపై అనుచరులతో దాడి..
- వైఎస్సార్సీపీ ఏజెంట్లు, టీడీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం తోపులాట
- ఆయా గ్రామాలలో గంటలపాటు ఉద్రిక్తత
- ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
- ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు అనుచరులతో భౌతిక దాడులకు యత్నం
- సమస్యాత్మక గ్రామాలలో కూడా ఇద్దరు పోలీసులను మాత్రమే నియమించిన పోలీసు ఉన్నతాధికారులు
- పలుచోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటుచేయని వైనం
ఏలూరు జిల్లా.. నూజివీడు నియోజకవర్గంలో ఉద్రిక్తత
- ఆగిరిపల్లి నరసింహారావుపాలెం గ్రామంలో ఓటు విషయంలో ఘర్షణ
- వృద్ధురాలు ఓటు వేసే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం
- పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు నెలకొన్న ఉద్రిక్త వాతావరణం
- ఘర్షణతో అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది, అధికారులు
- ఎన్టీఆర్ జిల్లా:
- విస్సన్నపేట మండలం కలగరలో ఎన్నికల వేళ ఉద్రిక్తత
- జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఏజెంటును నెట్టేసిన టీడీపీ నాయకడు
- వైఎస్సార్సీపీ నాయకులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం..
- పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
- టీడీపీ నాయకుల తీరుతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం
- పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల యత్నం..
శైలజానాథ్‌ను అడ్డుకున్న పోలీసులు
- అనంతపురం:
- మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న పోలీసులు
- శింగనమల నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలు
- పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ నేతలు
- ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ ఆఫీసుకు బయలుదేరిన శైలజానాత్ను అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో మాజీ మంత్రి శైలజానాథ్ వాగ్వాదం
- అనంతపురం ఎస్పీ కార్యాలయంలో బైఠాయించిన శైలజానాథ్
టీడీపీ గూండాగిరి..
- ఏలూరు జిల్లాలో టీడీపీ గూండాగిరి
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ గూండాలు.
- ఆర్వో అనుమతించినా కుదరదన్న టీడీపీ రౌడీలు.
- టీడీపీ ఏజెంట్లతోనే పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు.
టీడీపీ గూండాల హల్చల్..
- ధూళిపాళ్ల పోలింగ్ బూత్‌లో టీడీపీ గూండాల హల్చల్.
- బూత్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ గూండాలు.
- ఏజెంట్లకు, టీడీపీ గూండాలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం.
శ్రీ సత్యసాయి జిల్లా.. కదిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం!
- దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు
- పోలీసులతో వైఎస్సార్సీపీ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి వజ్రా భాస్కర్ రెడ్డి వాగ్వాదం
- టీడీపీ స్థానికేతరులను ఎలా అనుమతిస్తారని ధ్వజం
కర్నూలు జిల్లా..
- పోలింగ్ స్టేషన్లలో ఉండాల్సిన ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నారు..
- పోలింగ్ ముందు రోజు నుండే వైఎస్సార్సీపీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పోలింగ్ స్టేషన్‌కు వెళితే పీడీ యాక్ట్ పెడతామంటూ బెదిరింపులు
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎక్కడికి వెళ్ళకుండా ఆంక్షలు..
- క్రిష్ణగిరిలో జరుగుతున్న ఎన్నికల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్న ఓటర్లు ..
- నంద్యాలలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి , శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి హౌస్ అరెస్ట్
- టీడీపీ నేతలు యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద మంది మార్బలంతో హల్చల్!
- నియోజకవర్గంలో కాన్వాయ్‌లతో హల్చల్ చేస్తున్న ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు భూమ విఖ్యాత్ రెడ్డి
- వైఎస్సార్సీపీ మండల నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో పెట్టిన వైనం..
- తారతమ్యం చూపుతున్న పోలీసులపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ నేతలు..
- కృష్ణాజిల్లాలో ఉదయం 9.00 గంటల వరకునమోదైన పోలింగ్ శాతం 15.75%
- విజయవాడ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 7 గంటల నుండి 9 గంటలవరకు 4.8శాతం పోలైన ఓట్లు..
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న దౌర్జన్యకాండ..
- రామకుప్ప మండలం బందార్లపల్లి పంచాయతీ బూత్ నెంబర్ 14, 15..
- కంచి దాసనపల్లి, లింగాపురం, వైఎస్సార్సీపీ తరఫున ఏజెంట్లుగా వెళ్లిన మహేష్, సోమశేఖర్..
- ఇద్దరినీ టీడీపీ గూండాలు అడ్డుకోవడంతో వాగ్వాదం
- బలవంతంగా పోలింగ్ బూత్ నుండి బయటికి పంపిన టీడీపీ గూండాలు
మార్కాపురం.. కనిగిరి
- జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నేతల ముందస్తు అరెస్టులు..
- వైఎస్సార్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు హౌస్ అరెస్టు..
- ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని సీఎస్ పురం పోలీసులు నోటీసులు..
విశాఖ జిల్లా..
- MPTC/ZPTC ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్..
- విశాఖ జిల్లాలో రెండు గంటల్లో 14.83 శాతం పోలింగ్ నమోదు..
- క్యూ లైన్లో బారులు తీరిన ఓటర్లు..
విశాఖ జిల్లా..
- MPTC/ZPTC ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్..
- విశాఖ జిల్లాలో రెండు గంటల్లో 14.83 శాతం పోలింగ్ నమోదు..
- క్యూ లైన్లో బారులు తీరిన ఓటర్లు..
చిత్తూరు జిల్లా..
- కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ..
- శాంతిపురం మండలంలోని శివరామపురం గ్రామంలో అల్లర్లు..
- మాజీ వైస్ ఎంపీపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..
- ఎన్నికల రోజు వైఎస్సార్సీపీ నేత రమేష్‌ను అదుపులోకి తీసుకోవడంపై మండిపడిన నేతలు
- వైఎస్సార్సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను అదుపులోకి తీసుకొని భయబ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు..
టీడీపీ అరాచకం.. పెట్రోల్ బాంబుల దాడి..
- రైల్వేకోడూరు నియోజకవర్గంలో రణరంగం..
- పెట్రోల్ బాంబులతో విరుచుకుపడిన టీడీపీ గూండాలు
- పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ రౌడీల బీభత్సం!
- పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో రౌడీల దాడులు..
- టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు
- శ్రీకాకుళం.. టెక్కలిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా పోలీసుల చర్యలు..
- సీఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహం!
- వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉషారాణి కుమారుడు పృథ్వీని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు..
- బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన
- టెక్కలిలో మాజీ ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వరుసగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న తీరు
- పలుచోట్ల వైఎస్సార్సీపీ ఏజెంట్ల ఫామ్ చింపి వేస్తున్న టీడీపీ గూండాలు
అన్నమయ్య జిల్లా...
- పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ నేతలు దౌర్జన్యం
- చౌడేపల్లి మండలం చారాల పోలింగ్ కేంద్రంలోకి వైఎస్సార్సీపీ ఏజంట్లను రానివ్వడం లేదని నిరసన
- పోలింగ్ కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ పార్టీ ఏజెంట్లు, నాయకులు..
- కుప్పం నియోజకవర్గంలో అప్రజాస్వామికంగా స్థానిక సంస్థలు ఎన్నికలు..
- సీఎం ఇలాకాలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
- రామకుప్పం మండలం బొమ్మనపల్లి గ్రామంలో పోలీసు అధికారుల దైర్జన్యం..
- ఏజెంట్లను అక్రమంగా అరెస్టు చేస్తున్న వైనం
ఏలూరు జిల్లా ..
- నూజివీడు మండలం గొల్లపల్లి పీహెచ్సీ సమీపంలోని పాఠశాల పోలింగ్ బూత్‌లో నిలిచిపోయిన ఓటింగ్..
- స్టాంప్ ప్యాడ్ అందుబాటులో లేక పోలింగ్ ప్రక్రియకు అంతరాయం..
- ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు నిరీక్షణతో ఇబ్బందులు..
- వెంటనే స్టాంప్ ప్యాడ్ ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రారంభించాలని ఓటర్ల డిమాండ్..
- అనకాపల్లి (మం) రోంగనివాని పాలెంలో ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు..
- రిజర్వేషన్లు మారిపోవడంతో ఓటింగ్‌కు దూరమైన ఓటర్లు..
- పోలింగ్ ప్రారంభించేందుకు స్థానికులతో చర్చిస్తున్న సిబ్బంది..
కడప జిల్లా..
అధికారాన్ని అడ్డంపెట్టుకొని, పోలీసుల సమక్షంలో.. ఓట్లు గుద్దుకుంటున్న కూటమి నాయకులు..
- పెద్దముడియం మండలం జై. కొట్టాలపల్లిలో టీడీపీ మూకల మోహరింపు..
- ఎంపీపీ స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టిన టీడీపీ నేతలు
- ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను వెనక్కి పంపుతున్న టీడీపీ గూండాలు
- వారిని దారుణంగా అడ్డుకుంటున్న టీడీపీ మూకలు..
- వైఎస్సార్సీపీ ఏజెంట్స్‌ను బయటకు పంపివేసిన పచ్చ మూకలు, ఆపై దాడికి యత్నం..
- ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడంపై ఓటర్ల ఆగ్రహం!
- బయట ఊరి నుంచి వచ్చిన టీడీపీ గూండాలు ఓటర్లను అడ్డుకుంటున పరిస్థితి
- పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా చేరిన టీడీపీ గూండాలు
- చోద్యం చూస్తున్న పోలీసులు..
తిరుపతి జిల్లా... పోలింగ్ కేంద్రం నిబంధనలకు పాతర..
- రేణిగుంటలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన..
- బాలికల ఉన్నత పాఠశాల బూత్ నం. 24 ఎదురుగా టీడీపీ కార్యాలయం తెరిచి హల్చల్!
- పోలింగ్ కేంద్రం సమీపంలోనే జోరుగా టీడీపీ కార్యకలాపాలు..
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..
- బూత్ నంబర్ 24, 25 వద్ద ఓటర్ల తీవ్ర గందరగోళం..
- క్షేత్రస్థాయిలో ఓటర్ స్లిప్పులు అందించని బీఎల్వోలు
- రేణిగుంట. బాలికల, బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాల వద్ద ఓటర్ల ఆందోళన!
- 'మా ఓటర్ స్లిప్పులు ఎక్కడ?' అంటూ బీఎల్వోలను నిలదీస్తున్న వైనం
- రేణిగుంటలో ఓటర్ స్లిప్పులు చేతికందక పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
- యంత్రాంగం వైఫల్యంపై ఆగ్రహం!
- ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అధికారుల నిర్లక్ష్యం..
- తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
- ఓబులవారిపల్లి మండలం మంగంపేట పునర వాస కాలనీలో కూటమి నాయకులు వైనం..
- ఎంపీటీసీ అభ్యర్థి మౌనిక పోలింగ్ కేంద్రంలో వెళ్లకుండా అడ్డుకుంటున్న తీరు
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను పేపర్లు చించేసి.. బయటికి పంపివేత
- వైఎస్సార్సీపీ పార్టీ ఏజెంట్లు లేకపోవడంతో పోలింగ్ బూత్‌లో టీడీపీ గూండాల రిగ్గింగ్..
- చోద్యం చూస్తున్న పోలీసులు..
ప్రకాశం..
- దర్శి మండలం తానంచింతల గ్రామంలో వైఎస్సార్సీపీ ఏజెంట్స్ బయటకు పంపిన తీరు..
- దారుణంగా రిగ్గింగ్ చేస్తున్న టీడీపీ గూండాలు..
- పోలింగ్ బూత్‌లలోకి చొరబడ్డ టీడీపీ మూకలు..
- నరసరావుపేట నుండి వచ్చినటువంటి 100 మంది గూండాలు..
కృష్ణాజిల్లా.. గన్నవరం నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం..
- బాపులపాడు తిప్పనగుంటలో వైఎస్సార్సీపీ నేత మూల్పూరు ప్రభుకాంత్ హౌస్ అరెస్ట్
- ఇంట్లో వంటలు చేస్తున్న గిన్నెల్లో వాటర్ పోసిన పోలీసులు..
- బైండోవర్ కేసులు పేరుతో వైఎస్సార్సీపీ నేత తేలప్రోలు రాముని ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కి తరలింపు..
నంద్యాల జిల్లా...
- నెహ్రూనగర్ గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద ఎంపీ శబరి అనుచరుడు శ్రీనివాసులు వీరంగం..
- పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్సీపీ నేత మాజీ ఎంపీటీసీ భర్తపై దాడి..
ఏలూరు జిల్లా..
- నూజివీడు మండలం బోరవంచ గ్రామంలో పోలింగ్ బూత్‌లను ఆక్రమించే ప్రయత్నం..
- 140, 141 పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లు కాకుండా బయట వ్యక్తులు..
- ఏజెంట్లు కాకుండా ఎక్కువమంది లోపల ఉండటంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం..
- పోలింగ్ కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు ఎలా వస్తారంటూ నిలదీసిన వైఎస్సార్సీపీ ఏజెంట్లు
- వైఎస్సార్సీపీ ఏజెంట్లతో వాగ్వాదానికి దిగిన టీడీపీ ఏజెంట్లు
తారుమారు పరిస్థితితో వెనుతిరుగుతున్న ఓటర్లు
- నర్సీపట్నం అనకాపల్లి మాకవరపాలెంలో నిలిచిన పోలింగ్..
- 31,32,31,34 బూత్‌లలో నిలిచిన పోలింగ్..
- బీఎల్ఓ లో పంచిన ఓటరు స్లిప్‌లు బూత్‌లో ఉన్న లిస్ట్ కు నో మ్యాచ్ంగ్
విశాఖ..
- కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఓటర్లు..
- భీమిలి మండలం రాయానిపేటలో ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు.
- గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తున్న ఓటర్లు.
- రాయానిపేట గ్రామంలో మొత్తం 120 ఓట్లకు గాను ఓటర్లంతా ఎన్నికలకు దూరం..
ఓటు వేసేందుకు స్లిప్పుల ఆధారంగా వెళ్లిన ఓటర్లకు జలక్..
- అనకాపల్లి జిల్లా, మాకవారి పాలెం మండలంలో పరిస్థితి తలకిందులు..
- పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ జాబితాలకు, ఓటర్లకు ఇచ్చిన స్లిప్పులకు తేడాలు..
- స్లిప్పుల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళితే.. లేని ఓటరు పేర్లు!
- పాత జాబితాల ఆధారంగా స్లిప్పులు పంపిణీ చేసిన బిల్ ఓలు
- ఓట్లు వేసేందుకు కొత్త జాబితాల్లో స్లిప్పుల కోసం ఓటర్ల పరుగులు
- ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న ఓటర్లు
నంద్యాల జిల్లా..
- నందికొట్కూరు నియోజకవర్గంలో బరితెగిస్తున్న టీడీపీ..
- గ్రామాల్లో ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్..
- వారిని నందికొట్కూరు రూరల్ స్టేషన్లో పెట్టిన పోలీసులు..
- జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి వన్ సైడ్ చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల వేధింపులు..
- మిడుతూరు, జూపాడుబంగ్లా మండల వైఎస్సార్సీపీ నేతలు శివరామిరెడ్డి, క్రిష్ణ రెడ్డి, రామిరెడ్డి రెడ్డి, రమణ, మస్తాన్, రంగస్వామి, శివ, అన్వర్‌లను పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు..
వైయస్సార్ జిల్లా..
లింగాల మండలం ఇప్పట్లలో టీడీపీ మూకల దాష్టీకం..
- సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై దాడి.. కర్రలతో దాడికి దిగిన మూకలు..
- జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీదేవి, ఇండిపెండెంట్ అభ్యర్థి సురేఖపై కూడా దాడి
- మహిళా అభ్యర్థులపై దాడి చేసి వారి మెడలో బంగారం లాక్కునే ప్రయత్నం
- తీవ్ర గాయాలతో అభ్యర్థులు, విలేకరి..
- ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డగింత...
అన్నమయ్య జిల్లా..
- పుంగునూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ నేతల గూండాగిరి
- రొంపిచర్ల గ్రామపంచాయతీలో పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు
- ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసులు, పోలింగ్ అధికారులు...
చేజర్లలో బరితెగించిన కూటమినేతలు..
- కోటితీర్థంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి రానివ్వని వైనం..
- ప్రతిపక్ష ఏజెంట్లు లేకపోవడంతో మొదటి గంటలోనే రిగ్గింగ్‌కు పాల్పడుతున్న కూటమి నాయకులు..
- జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించాలని వైఎస్సార్సీపీ పార్టీ డిమాండ్..
వైఎస్సార్ జిల్లా
- జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్లీ అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ
- టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న పోలీసులు
- గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా అరెస్టులు
- పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డిల అరెస్ట్
- నల్లపురెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఉమ్మారెడ్డి అరెస్ట్
- వేములలో పోలింగ్ బూత్‌ల వద్ద రాళ్లు సిద్ధం చేసుకున్న టీడీపీ నేతలు
- పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల మండలంలో అరాచకానికి స్కెచ్
- పోలింగ్ బూత్‌ల వద్ద కిరాయి మూకలు
- ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకునేందుకు కుట్ర
టీడీపీ నేతల అరాచకం..
- అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
- పుంగనూరు మండలం ఈడిగపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఐడీలను లాక్కొని వారిని బయటకు నెట్టివేసిన కూటమి నేతలు
- చౌడేపల్లి మండలం దుర్గ సముద్రంలో ఏజెంట్ల ఐడీలను లాక్కొని ఇదే తరహాలో బయటకు పంపించిన కూటమి నేతలు
వైఎస్సార్ జిల్లా..
- పెద్దముడియం మండలంలో మొదలైన కూటమి నేతల దాడులు
- భూతపురం గ్రామం వద్ద వైఎస్సార్సీపీ నేత కారుపై దాడి చేసి అద్దం పగులగొట్టిన పచ్చ గూండాలు
- గుండ్లకుంట గ్రామం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
- నేడు పెద్దముడియం మండలంలో 9 ఎంపీటీసీలకు ఒక జడ్పీటీసీకి జరగనున్న ఎన్నికలు
- పోలింగ్ మొదలవకముందే దాడులకు పాల్పడుతున్న కూటమి గుండాలు
- బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు
- మొన్న జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో చేసిన రిగ్గింగ్,
- ఇప్పుడు పెద్దముడియం మండలంలో అదే తరహాలో చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న కూటమి నాయకులు
- పెద్దఎత్తున బయటి ప్రాంతాల నుండి రౌడీ మూకలను తరలించి హింసా కాండకు రంగం సిద్ధం

నంద్యాల జిల్లా...
- జూపాడుబంగ్లా (మ) మండ్లెం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత,
- వైఎస్సార్సీపీ ఏజెంట్లను లోపలికి పోనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు,
- ఇదేమీ న్యాయం అంటూ పోలీసుల తీరుపై తిరగబడ్డ జనం..
- పోలింగ్ బూత్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన ఏజెంట్లు,
- బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
వైఎస్సార్ జిల్లా..
- జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అరాచకానికి తెరలేపుతున్న టీడీపీ
- వేముల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద రాళ్లు సిద్ధం చేసిన టీడీపీ నాయకులు
- ఉదయాన్నే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకునేందుకు కిరాయి మూకలను సిద్ధం చేస్తున్న పచ్చ బ్యాచ్
- రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకుని ఏజెంట్లు, ఓట్లర్లపై దాడికి సిద్ధం
- పులివెందుల నియోజకవర్గంలో లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లిలో జడ్పీటీసీ ఎన్నికలు
- అన్ని మండలాల్లో అదే దాష్టీకానికి సిద్ధమవుతున్న టీడీపీ
-
కాసేపట్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
-
582 జడ్పీటీసీ,7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
-
పోటీలో మొత్తం 20,966 మంది అభ్యర్థులు
-
2.61 కోట్ల మంది ఓటర్లు.. 31,460 పోలింగ్ కేంద్రాలు
-
పోలింగ్‌కు వర్షం బెడద










