Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా?
ADVERTISEMENT 

కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
HIGH_COURT_OF_ANDHRA_.jpg

ఇలాంటి తీరును సహించేదే లేదు

కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదు

ఆరోపణలు నిజమని తేలితే తీవ్ర పర్యవసానాలు

పోలీసులపై నిప్పులు చెరిగిన హైకోర్టు

రవీంద్రరెడ్డి నిర్బంధంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం

విచారణ 28కి వాయిదా

సాక్షి, అమరావతి : సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్‌ చూపారు? ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వాలని పోలీసు లను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారంటూ మండిపడింది. రవీంద్రరెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్‌ కుమార్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే కింది కోర్టు ముందు హాజరుపరిచారంటూ  ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాంటి తీరును సహించేదే లేదని తేల్చి చెప్పింది. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా అంటూ పోలీసులను నిలదీసింది. ఎస్పీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదని, ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను హెచ్చరించింది. ఆరోపణ లున్నా స్పందించడంలేదంటే ఏమనుకోవాలంటూ నిలదీసింది. రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసులు కోర్టునూ తప్పుదోవ పట్టిస్తున్నారు
తన భర్తను అక్రమంగా నిర్బంధించారని వర్రా రవీంద్రరెడ్డి భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కళ్యాణి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అన్యాయాలు, అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. అవాస్తవాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. నవంబర్‌ 8న రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్న విషయంపై పోలీసులు మాట్లాడటంలేదన్నారు. చట్టం కన్నా, కోర్టుల కన్నా తామే ఎక్కువ అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు.

ముఖ్యంగా కడప ఎస్పీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశామని, ఆయన ఇప్పటివరకు కౌంటర్‌ వేయలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్‌ దాఖలు చేశారని, ఆయనే ఇప్పుడు కడప జిల్లాకు ఇన్‌చార్జి ఎస్పీగా ఉన్నారని తెలిపారు. రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని నిరంజన్‌రెడ్డి కోరగా.. ఆ పని తాము చేయలేమని ధర్మాసనం చెప్పింది. అలా అయితే సంబంధిత జిల్లా జడ్జికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh High Court
Police
ravindra reddy
Andhra Pradesh
Social Media
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.