Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. విక్రాంత్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌
ADVERTISEMENT 

విక్రాంత్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hc.jpg

కాకినాడ సీ పోర్ట్‌ వాటాల బదిలీ కేసులో హైకోర్టు ఊరట

వాటాల బదిలీపై నాలుగున్నరేళ్ల తరువాత కేవీ రావు ఫిర్యాదు చేశారు 

ఇంత జాప్యానికి ఆయన సంతృప్తికర వివరణ ఇవ్వలేదు 

బెదిరించి ఉంటే కోర్టులో ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

ఫిర్యాదుకు ముందే పోలీసులు ప్రాథమిక విచారణ ఎలా చేస్తారు? 

ఆడిట్‌ రిపోర్ట్‌ను ఆడిట్‌ కంపెనీనే తయారు చేసిందని కేవీ రావే చెబుతున్నారు 

అలాంటప్పుడు ఆ నివేదికను విక్రాంత్‌రెడ్డి ఎలా ఫోర్జరీ చేస్తారు?   

తీర్పులో పేర్కొన్న హైకోర్టు

సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో యర్రంరెడ్డి విక్రాంత్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టడం, భయపెట్టడం చేయరాదని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు.

తనను బెదిరించి పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందంటూ సీఎం చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్‌ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ విక్రాంత్‌రెడ్డి డిసెంబర్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, కేవీ రావు తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.  

నాలుగున్నరేళ్ల తర్వాత ఫిర్యాదా? 
‘నాలుగున్నరేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఆలస్యంపై ఫిర్యాదుదారు కేవీ రావు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. జాప్యానికి బెదిరింపులే కారణమని, ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేశానంటూ ఆయన చేసిన వాదన ఆమోదయోగ్యం కాదు. అయన్ని బెదిరించి ఉంటే, కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేయలేదో వివరణ లేదు. కేవీ రావును బెదిరించడం వల్లే ఆయన వాటాలను నామమాత్రపు ధరకు అరబిందో రియాలిటీకి బదిలీ చేశారన్నదే పిటిషనర్‌ విక్రాంత్‌రెడ్డిపై ఉన్న ప్రధాన నేరారోపణ. 

పీకేఎఫ్‌ శ్రీధర్‌ సంతానం ఆడిట్‌ సంస్థతో విక్రాంత్‌ కుమ్మక్కయి ఆడిట్‌ రిపోర్ట్‌లో సంఖ్యలను పెంచి చూపారని, దీన్ని అడ్డంపెట్టుకునే కేవీ రావును బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఆడిట్‌ సంస్థతో కలిసి విక్రాంత్‌రెడ్డి సంఖ్యలను పెంచి చూపారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. దీనిద్వారా విక్రాంత్‌ లబ్ధి పొందారని సీఐడీ కూడా చెప్పడంలేదు. ఎఫ్‌ఐఆర్‌లోనూ ఆడిట్‌ కంపెనీని విక్రాంత్‌ కలిసినట్లు లేదు.  అంతేకాక అరబిందో కొన్న వాటాల ద్వారా విక్రాంత్‌రెడ్డి ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆరోపణలు లేవు. 

రిపోర్ట్‌ను ఆడిట్‌ సంస్థే తయారు చేసిందని కేవీ రావే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఈ నివేదిక విషయంలో విక్రాంత్‌పై నేరారోపణలు చేయడానికి వీల్లేదు. దానిని విక్రాంత్‌రెడ్డి ఫోర్జరీ చేశారన్న ప్రశ్నే తలెత్తదు. ఫోర్జరీ చేశారని సీఐడీ, ఫిర్యాదుదారు కూడా చెప్పడం లేదు. విక్రాంత్‌రెడ్డి ఆ నివేదికను తారుమారు చేయడం, మార్చడం, మోసపూరితంగా సంపాదించడం చేయలేదు. అందువల్ల ఆయనకు సెక్షన్‌ 464 వర్తించదు’ అని జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 

ఫిర్యాదు లేకుండానే ప్రాథమిక విచారణ జరపడమా! 
‘2024 సెపె్టంబర్‌లో తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారని కేవీ రావు చెబుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే.. 2024 డిసెంబరు 2న కేవీ రావు ఫిర్యాదు చేశారు. అంటే అంతకు ముందు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఫిర్యాదు లేకుండానే పోలీసులు ఎలా ప్రాథమిక విచారణ జరిపారో తెలియడంలేదు. 

నాలుగున్నరేళ్ల జాప్యంతో ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి తీరాలి. కానీ, ఇక్కడ ఫిర్యాదు ఇవ్వకపోయినా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. దీనినిబట్టి పోలీసులు దర్యాప్తును ఏ తీరున సాగించారన్న దానిపై ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Vikrant
Reddy
Andhra Pradesh High Court
anticipatory bail
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.