Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా.. పోలీసులకు చిక్కాడు
ADVERTISEMENT 

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా.. పోలీసులకు చిక్కాడు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 20, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mao_0.jpg

మరో మావోయిస్టు కీలక నేత అరెస్టు  

12ఏళ్ల వయసులోనే దళంలోకి సరోజ్‌ మడవి 

కొంత కాలంగా కోనసీమలోనే మకాం 

ఆక్వా చెరువు వద్ద గుమాస్తాగా జీవనం  

అంతకు ముందే హిడ్మా వద్దకు వెళ్లిన సరోజ్‌ మడవి..  

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకుని తిరిగి వస్తుండగా అరెస్టు  

రావులపాలెం: మరో మావోయిస్టు కీలకనేత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీసులకు చిక్కారు. ఆ వివరాలను రావులపాలెం సీఐ శేఖర్‌బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన సరోజ్‌ మడవి (అలియాస్‌) మడ్వీ హంధాను రావులపాలెం గౌతమి గోదావరి డంపింగ్‌ యార్డ్‌ వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని బుంద్లేలంక కిష్ట్రారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సుక్మా జిల్లాకు చెందిన సరోజ్‌ మడవి ఐదో తరగతి వరకు చదివారు. 12 ఏళ్ల వయసులో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై దళంలో చేరారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఎటపాక మావోయిస్టుల సౌత్‌ డివిజన్‌ కమాండర్‌ ఇన్‌చార్జిగా ఉన్న ముచాకీ ఎర్రా అలియాస్‌ ఎర్ర దాదా వద్ద కమ్యూనికేషన్‌ కమాండర్‌గా ఉన్నారు. 

2021 నుంచి వివిధ దాడుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకుని కోనసీమకు రాగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక గన్,  పది తూటాలు స్వాదీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌ నిమిత్తం కొత్తపేట కోర్టులో హాజరుపరచారు. కాగా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు సరోజ్‌ మడవి సన్నిహితుడు.  

హిడ్మాకు అనుంగు అనుచరుడు 
కోనసీమను తలదాచుకోవడానికి సురక్షిత ప్రాంతంగా మావోయిస్టులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సరోజ్‌ మడవి కొంత కాలం క్రితం సఖినేటిపల్లి వచ్చి అక్కడ ఆక్వా చెరువు వద్ద గుమస్తాగా చేరి జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. 

కోనసీమలో ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు, పోలీసులు అతని సెల్‌ సిగ్నల్‌ ట్రాక్‌ చేయడం ద్వారా కనిపెట్టారు. హిడ్మాకు అనుంగు అనుచరుడు.  ఎన్‌కౌంటర్‌కు ముందే హిడ్మా వద్దకు వెళ్లిన సరోజ్‌.. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమవడంతో అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి కోనసీమలో తలదాచుకోవడానికి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
konaseema
Maoist
arrest
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.