Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అమరావతికి మరో 45 వేల ఎకరాలు సేకరణ
ADVERTISEMENT 

అమరావతికి మరో 45 వేల ఎకరాలు సేకరణ

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
land.jpg

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు 5 వేల ఎకరాలు 

స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌కు 2,500 ఎకరాలు, స్పోర్ట్స్‌ సిటీకి 2,500 ఎకరాలు 

ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ.. భూసేకరణకు మంత్రివర్గ ఆమోదం.. వచ్చే నెలలో నోటిఫికేషన్‌ 

జీఏడీ, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం ఎన్‌సీసీ, ఎల్‌అండ్‌టీ, షాపూర్‌ పల్లోంజీకి.. 

తెలంగాణతో చర్చించి వివాదం లేకుండా పోలవరం–బనకచర్ల 

బిల్డర్లకు వెసులుబాటుగా నిర్మాణ నిబంధనల్లో మినహాయింపులు, సరళతరం.. 

ఈ ఏడాది, వచ్చే ఏడాది పొగాకు పంట సాగుకు హాలిడే 

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు నారాయణ, పార్థసారథి  

సాక్షి, అమరావతి: రాజధాని కోసం గతంలో సీఆర్డీఏ తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్, హోటల్స్‌ రావాలని మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నా­రాయణ తెలిపారు. అప్పుడే టూరిజం... తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, ఇవన్నీ ఉండడం వల్లే హైదరా­బాద్‌ అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాల­యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను నారాయణ, సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి వేర్వేరుగా మీడియాకు వెల్లడించారు. 

‘‘2015 జనవరి నాటి ల్యాండ్‌ పూలింగ్‌ నియమ నిబంధనలను పునరుద్ధరించాం. వాటి ఆధా­రంగా కొత్తగా 45 వేల ఎకరాలు తీసుకుంటాం. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును 5వేల ఎకరాల్లో నిర్మించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్‌ ఇండ­స్ట్రీస్‌ 2,500 ఎకరాలు, స్పోర్ట్స్‌ సిటీ  2,500 ఎకరాల్లో వస్తాయి. కనీసం 45 వేల ఎకరాలు పూలింగ్‌ చేస్తే తప్ప వీటిని అభివృద్ధి చేయలేం. ఈ మొత్తం భూమి కేపిటల్‌ సిటీ 29 గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. భూసేకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూలైలో నోటిఫికేషన్‌ ఇచ్చి ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తాం’’ అని నారాయణ చెప్పారు. 

భవన నిర్మాణ నిబంధనలు సరళీకరణ
» భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించినట్లు నారా­యణ తెలిపారు. అపార్ట్‌మెంట్లు్ల, గ్రూప్‌ డెవలప్‌మెంట్‌ ఇళ్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్, మాల్స్, థియేటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి ఇప్పటికాదా టీడీఆర్‌ బాండ్లు ఇస్తున్నామని, అదే కట్టడంపై నిర్మాణం చేస్తే ఆ బాండ్లను వాడుకోవచ్చన్నారు.

» గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీలు, ఆస్పత్రుల వంటి భవిష్యత్‌ అవసరాల కోసమే అమరావతిలో మరోసారి భూ సమీకరణ అని పార్థసారథి పేర్కొన్నారు. గత అనుభ­వా­లను దృష్టిలో పెట్టుకుని అన్ని భూముల సమీకరణకు ఒకే తరహా నిబంధనలు (యూనిఫాం రూల్స్‌)ను ఆమో­దించి­నట్లు చెప్పారు. ‘‘ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు సూచనలకు అనుగు­ణంగా జలాశయాల రక్షణకు చర్యలు తీసుకుంటాం. 

అసైన్డ్, దేవాదాయ, లంక భూములను జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా విచారణ చేసి యాజమాన్యాలను నిర్ధారిస్తాం. సరిహద్దు వివాదాలు లేకుండా డ్రోన్స్‌ సర్వే చేస్తాం. ఆధార్‌ ద్వారా భూ యజమానులను నిర్ధారిస్తాం. భూమి లేనివారికి నెలకు రూ.5 వేలు చొప్పున పదేళ్ల పాటు పెన్షన్, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తాం. రైతుల వ్యవసాయ రుణాలను రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తాం’’ అని వివరించారు.

కేబినెట్‌ భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..
» అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా జీఏడీ, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణాలను రూ.844 కోట్లతో ఎన్‌సీసీకి, రూ.1,423 కోట్లతో షాపూర్‌ పల్లోంజీకి, రూ.1,247 కోట్లతో ఎల్‌అండ్‌టీకి ఇచ్చేందుకు ఆమోదం.
»  అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌కు 50 ఎకరా­లను చదరపు మీటర్‌కు ఏడాదికి రూపాయి చొప్పున 60 ఏళ్లు లీజుకిచ్చేందుకు అంగీకారం.
»   అంతర్జాతీయ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ సాయి మైనేనికి డిప్యుటీ కలెక్టర్‌ ఉద్యోగం. 
» జాప్యం కారణంగా నంద్యాల జిల్లాలో టయారో ఇన్ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (గతంలో అరబిందో రియాల్టీ– ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)కు కేటా­యించిన 800 మెగావాట్ల అవుకు ప్రాజెక్టు రద్దు. 
» చిత్తూరు జిల్లా శాంతిపురం, కుప్పం మండలాల్లో వి.కోట, రామకుప్పం వద్ద పాలార్‌ నదిపై 17 చెక్‌ డ్యాముల మరమ్మతు, పునర్నిర్మాణానికి రూ.5,355  లక్షలకు, పాలార్‌ నదిపై 4 చెక్‌ డ్యాముల మరమ్మతుకు రూ.1,024.50 లక్షలకు పరిపాలనా ఆమోదం. 
» వైఎస్సార్‌ కడప జిల్లా గండికోట వద్ద ఓబెరాయ్‌ (విల్లాస్‌) రిసార్ట్‌ అభివృద్ధి కోసం 50 ఎకరాలు ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.
»  ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వేడుకల సభలు నిర్వహణ.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Amaravati
Land acquisition
capital
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.