Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Fact Check: రైతు పథకాలకు కోతలంటూ కారుకూతలా?    
ADVERTISEMENT 

Fact Check: రైతు పథకాలకు కోతలంటూ కారుకూతలా?    

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 21, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fake_202.jpg

సాక్షి, అమరావతి: సంతృప్తస్థాయిలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నా రామోజీరావు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడం ఆపడంలేదు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ ‘రైతు పథకాలకు కోత పెట్టడం.. విప్లవాత్మక పాలనా?’ అంటూ అబద్ధాలను అచ్చేసి ప్రభుత్వంపై సోమవారం తన ‘ఈనాడు’ పత్రికలో బురద జల్లే ప్రయత్నం చేశారు. అసలు కోతలంటే ఏమిటో మీ చంద్రబాబును అడిగితే.. రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కిన విధానాన్ని వివరిస్తాడు.

అలాగే రైతులకు సున్నావడ్డీలో పెట్టిన బకాయిల వివరాలు చెబుతాడు. అంతేగానీ అర్హతే కొలమానంగా పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ఆ రైతులే మీ పనిపడతారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తోంది ఈ ప్రభుత్వం. రైతులకు పథకాలను పంపిణీ చేసే ముందు అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీల్లో ప్రదర్శిస్తున్నారు.

అర్హత ఉండి జాబితాల్లో చోటుదక్కని వారికి మరో అవకాశం కల్పించడమే కాదు.. వారికి ఏటా రెండు విడతల్లో అదనంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చేస్తున్నారు. నిజంగా కోతలు పెట్టే ఉద్దేశం ఉంటే ఇలా బూతద్దం పెట్టి మరీ వెతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మాదిరిగా ఏదో సాకుతో కోతలు పెట్టొచ్చు. 



ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు కన్పించలేదా?

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 12,500 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి మిన్నగా ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పైగా దేశంలో మరెక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలురైతు కుటుంబాలతోపాటు అటవీ భూముల సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రూ.13,500 చొప్పున జమ చేస్తోంది.

ఇప్పటి వరకు 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ లెక్కన చూస్తే 2019–20తో పోలిస్తే 2023–24 నాటికి 6,83,530 మంది భూ యజమానులు అదనంగా లబ్ధిపొందారు. వీరిలో 5,88,811 మంది భూ యజమానులు ఉండగా, 51,418 మంది కౌలుదారులు, 43,301 మంది అటవీ భూసాగుదారులకు అదనంగా లబ్ధి చేకూరింది. నిజంగా కోత పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇలా ఏటా లక్షలాది మందికి అదనంగా లబ్ధి ఏ విధంగా కలిగిందో ‘ఈనాడు’కే తెలియాలి.



బీమాతో ధీమా ఇదీ..

రైతులపై పైసా భారం పడకుండా ఈ–క్రాప్‌ నమోదే ప్రామాణికంగా నోటిఫైడ్‌  పంటలన్నింటికీ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రక్షణ కల్పిస్తోంది ప్రభుత్వం. టీడీపీ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం ఇచ్చారు. ఖరీఫ్‌–21 సీజన్‌లో 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం జమ చేయగా, ఇదే సీజన్‌లో అర్హత ఉండి సాంకేతిక కారణాల వల్ల లబ్ధిపొందని 28,010 మంది రైతులను జల్లెడ పట్టి మరీ రూ. 187.18 కోట్ల మేర బీమా పరిహారం జమ చేశారు. 



పారదర్శకంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ 

విపత్తులవేళ నష్ట పోయిన రైతులకు అత్యంత పారదర్శకంగా పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్‌ సబ్సిడీ) ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 22.85 లక్షల మంది రైతులకు రూ. 1,976.55 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. గతేడాది అర్హత ఉండి పరిహారం దక్కని 65,851 మందికి రూ. 63.25 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. రూ. లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద వడ్డీ రాయితీని వారి ఖాతాల్లోనే జమచేస్తోంది.

2014–18 మధ్య 39.07 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిల సొమ్మును జమ చేసింది. గడిచిన నాలుగున్నర ఏళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. అర్హత ఉండి రాయితీ పొందని 85,499 మందికి సామాజిక తనిఖీల్లో గుర్తించి, రూ. 18.32 కోట్ల వడ్డీ రాయితీని అందించింది. నిజంగా కోత పెట్టే ఆలోచనే ఉంటే.. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించేదా?.



రైతుల నిరంతర సేవలో ఆర్బీకేలు

విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రపంచ స్థాయి ఖ్యాతిని గడించాయి. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుసంవర్ధక, మత్స్యసహాయకులు సేవలందిస్తు­న్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, పశుగ్రాసం, దాణా, ఆక్వా ఫీడ్, సీడ్‌లను రైతులకు సరఫరా చేస్తోంది. తక్కువ అద్దెకే సన్న, చిన్నకారు రైతులకు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

10,444 గ్రామ స్థాయి, 492 క్లస్టర్‌ స్థాయి యంత్రసేవ కేంద్రాల్లో యంత్ర పరికరాలను అందుబా­టులోకి తీసుకొచ్చారు. వీటి కోసం రూ.366.25 కోట్ల రాయితీని ప్రభుత్వం భరించింది. ఇప్పటి వరకు 4.67 లక్షల మంది రైతులు 13.28 లక్షల ఎకరాలలో వ్యవసాయ పనులకు యంత్రాలను వినియోగించుకున్నారు. మరోవైపు ఆర్బీకే సేవలకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు అద్దెల చెల్లింపు కోసం ఇటీవల రూ.32.97 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు ‘ఈనాడు’ రోతరాతలు కొనసాగిస్తోంది. 

పెట్టుబడి సాయం అందింది ఇలా..

2019–20లో 46,69,375 మందికి  రూ. 6,173 కోట్లు, 

2020–21లో 51,59,045 మందికి రూ. 6,928 కోట్లు, 

2021–22లో 52,38,517 మందికి రూ. 7,016.59 కోట్లు, 

2022–23లో 51,40,943 మందికి రూ. 6,944.50 కోట్లు, 

2023–24లో రెండు విడతల్లో 53,52,905 మందికి రూ. 6,147.72 కోట్లు .

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ramoji Rao
Chandrababu Naidu
Fact Check
interest free loans
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.