Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా
ADVERTISEMENT 

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Apr 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
12322.jpg

ఫలితాలను ‘ఎక్స్‌’లో విడుదల చేసిన మంత్రి లోకేశ్‌ 

10,17,102 మంది హాజరవ్వగా 9,09,325 మంది పాస్‌ 

మొదటి ఏడాది 70 శాతం.. రెండో ఏడాది 83 శాతం మంది ఉత్తీర్ణత 

బాలికల ఉత్తీర్ణత మొదటి ఏడాది 75 శాతం.. రెండో ఏడాది 86 శాతం 

బాలుర ఉత్తీర్ణత ఫస్ట్‌ ఇయర్‌ 66 శాతం, రెండో ఏడాది 80 శాతం  

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10,58,893 మంది విద్యార్థులకు గాను 10,17,102 మంది హాజరవ్వగా 9,09,325 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,91,254 మందికి గాను 4,22,030 మంది (83 శాతం).. మొదటి ఏడాదిలో 5,25,848 మందికి గాను 4,87,295 మంది (70 శాతం) పాసయ్యారు. 

2024–25 విద్యా సంవత్సరం ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ శనివారం ఇంటి నుంచి ‘ఎక్స్‌’లో విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఎప్పటిలాగే ఇంటర్‌ విద్య ఫలితాల్లో బాలికలే అత్యధిక శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 86 శాతం, మొదటి ఏడాది 75 శాతం.. బాలురు రెండో ఏడాది 80 శాతం, మొదటి సంవత్సరంలో 66 శాతం పాసయ్యారు.    

టాప్‌లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు  
ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ (మొదటి, ద్వితీయ) ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్‌ మొదటి ఏడాదిలో కృష్ణా 85 శాతం, గుంటూరు 82 శాతం, ఎన్టీఆర్‌ జిల్లా 81 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రెండో ఏడాది కూడా ఇవే జిల్లాలు టాప్‌లో నిలవడం గమనార్హం. కృష్ణా 93 శాతం, గుంటూ­రు 91 శాతం, ఎన్టీఆర్‌ జిల్లా 89 శాతంతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్‌ రెండో ఏడాది 54 శాతంతో చిత్తూరు చివరి స్థానంలో, మొదటి సంవత్సరం ఫలి­తాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 73 శాతంతో చివరిలో నిలిచింది. అనకాపల్లి జిల్లా సైతం ఇదే శాతం సాధించడం గమనార్హం. 

ఒకేషనల్‌లోనూ బాలికల హవా  
ఇంటర్‌ ఒకేషనల్‌ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 71 శాత­ం, రెండో ఏడాది 84 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 67 శాతం మంది విజయం సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో మొదటి సంవత్సరం 38,553 మంది విద్యార్థులు పరీక్షలు రాయ­గా, 23,991 మంది (62 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 33,289 మంది హాజరవ్వగా 25,707 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించా­రు.   

ఈనెల 20 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం 
ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్మిడియట్‌ బోర్డు­కు తెలియజేయాలని కమిషనర్‌ కృతికా శుక్లా తెలిపారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు మే 12 నుంచి 20 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం శనివారం విడుదల చేశారు. మే 28 నుంచి జూన్‌ 19 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తారు.  

హెచ్‌ఈసీలో చాతుర్యకు 980 మార్కులు
కంభం: ప్రకాశం జిల్లా కంభంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివిన తమ్మినేని చాతుర్య హెచ్‌ఈసీ గ్రూపులో వెయ్యికిగాను 980 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యార్థిని కళాశాలలో చేరే సమయంలో సైన్స్‌ గ్రూపు తీసుకోమని లెక్చరర్లు సూచించినా, తాను సివిల్స్, గ్రూప్స్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని.. అందుకోసమే హెచ్‌ఈసీ గ్రూపు తీసుకున్నానని తెలిపింది.   

పేదింట మార్కుల పంట
జియ్యమ్మవలస: మన్యం జిల్లా జియ్మమ్మవలస మండలంలోని కన్నపు­దొరవలస గ్రామానికి చెందిన బర్ల లలిత సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో వెయ్యికి 989 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థిని తల్లిదండ్రులు సంగమేష్, సుశీల రోజువారీ కూలీలు. నెల్లిమర్ల బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Intermediate exam
Intermediate exam results
Andhra Pradesh
inter exam
girls
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.