Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. నేడే పోలింగ్‌.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
ADVERTISEMENT 

నేడే పోలింగ్‌.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 13, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
polling_0.jpg

రాష్ట్రంలో ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం 

2,841 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 4.14 కోట్ల మంది ఓటర్లు

స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటింగ్‌ జరిగేలా ఏర్పాట్లు 

పార్టీ పోలింగ్‌ ఏజెంట్లు ఉ.5.30కే కేంద్రాలకు చేరాలి 

మాక్‌ పోలింగ్‌ ఉ.5.30 గంటల నుంచే నిర్వహణ 

ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు పోలింగ్‌ 

వికలాంగులు, వృద్ధులకు ఓటింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

ఓటర్లను ఆకర్షించడానికి పలుచోట్ల మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు 

అందరూ ఓటేసిరికార్డు స్థాయి పోలింగ్‌ శాతం నమోదు చేయండి 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా  

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీచేస్తున్న 2,841 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి పోటీచేస్తున్న 2,387 మంది, లోక్‌సభకు పోటీచేస్తున్న 454 మంది భవిష్యత్తును నిర్ణయించడానికి 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్‌ స్టేషన్లలో ఉ.7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండడంతో అధికారులంతా ఆదివారం రాత్రికే ఎక్కడికక్కడ చేరుకున్నారు. 

కానీ, దానికి రెండు గంటల ముందు అంటే ఉ.5 గంటల నుంచే అధికారులు ఏర్పాట్లు మొదలుపెడతారని.. ఏజెంట్లు ఉ.5.30కల్లా పోలింగ్‌ స్టేషన్లకు చేరుకుంటే 90 నిమిషాల పాటు మాక్‌ పోలింగ్‌ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదివారం తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్‌ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 

మొత్తం పోలింగ్‌ కేంద్రాలకుగాను 31,385 చోట్ల అంటే 75 శాతం కేంద్రాలను లోపలా, బయట  పూర్తిస్థాయిలో వెబ్కాస్టింగ్‌ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని మీనా చెప్పారు. ఇందుకోసం సచివాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే ఓటింగ్‌ సరళిని పోలింగ్‌ కేంద్రం లోపల, బయటా కూడా పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు.   

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి.. 
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకొకసారి జరిగే ఓట్ల పండుగలో ప్రతిఒక్క ఓటరూ పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ముఖేష్‌కుమార్‌ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని.. అటు­వంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లంతా పాల్గొని ప్రజాస్యామ్యవ్యవస్థను పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.    

83శాతం ఓటింగ్‌ లక్ష్యంగా.. 
ఇక గత ఎన్నికల్లో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్‌ నమోదైందని, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్‌ లక్ష్యంగా విస్తృతస్థాయిలో ఓటర్లను చైతన్యపర్చేలా పలు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించామన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి వయో వృద్ధులు, మహిళలు, యువత, పర్యావరణం పేరుతో మోడల్‌ పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. అదే విధంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన తాగునీరు, వీల్‌చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచామని ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటుచేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటుచేయనున్నట్లు మీనా తెలిపారు.  

1.60 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం.. 
రాష్ట్రంలో 46,389 పోలింగ్‌ కేంద్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. నిజానికి.. మొదట్లో ప్రతిపాదించినట్లుగా 46,165 పోలింగ్‌ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని, అయితే.. అదనంగా ప్రతిపాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్‌ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చుకున్నామన్నారు. మొత్తమ్మీద 46,389 పోలింగ్‌ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు.  

ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట భద్రత 
డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పూర్తి భద్రతా ఏర్పాట్లుచేశామని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలకు అదనంగా సీఆర్‌పీఎఫ్, తమిళనాడు, కర్ణాటక పోలీసు బలగాలను మోహరించామన్నారు. వారితోపాటు మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన చెప్పారు. పోలింగ్‌ విధుల కోసం వినియోగిస్తున్న బలగాల 
వివరాలు..  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Right to vote
voters
Polling Stations
Mukesh Kumar Meena
AP Assembly Elections 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఓటు పోతుంది జాగ్రత్త!

ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఓటు పోతుంది జాగ్రత్త!

ఓటర్లకు అలర్ట్‌!

ఓటర్లకు అలర్ట్‌!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

రక్తపాతం లేని నరమేధమే ‘సర్‌’

రక్తపాతం లేని నరమేధమే ‘సర్‌’

అర్హులెవ్వరినీ తొలగించం

అర్హులెవ్వరినీ తొలగించం

టీడీపీ ప్రభుత్వంలో ‘వైఎస్సార్‌సీపీ అంటే ఓట్లు తొలగింపే’

టీడీపీ ప్రభుత్వంలో ‘వైఎస్సార్‌సీపీ అంటే ఓట్లు తొలగింపే’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.