Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘యుపిక్స్‌’ చీటింగ్‌ కేసులో నిందితుల అరెస్టు
ADVERTISEMENT 

‘యుపిక్స్‌’ చీటింగ్‌ కేసులో నిందితుల అరెస్టు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
uipix.jpg

354 గ్రాముల బంగారు, 21 కిలోల వెండి ఆభరణాలు, కారు స్వాదీనం 

మరో రూ.23 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు యత్నం 

183 మందిని రూ.353 కోట్ల మేర మోసం చేసిన సంస్థ  

విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వెల్లడి 

లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్‌ క్రియేషన్‌ అనే యానిమేషన్‌ సంస్థను చూపి, హాలీవుడ్‌ సినిమాలకు వర్క్‌చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు.   

మోసం చేసిందిలా.. 
నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్‌ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్‌ అనే యానిమేషన్‌ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్‌కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్‌గా ఏర్పడి అమాయకులకు వల వేశారు. 

తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.

వెలుగు చూసిందిలా.. 
ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్‌కుమార్‌ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్‌ స్రవంతి రాయ్‌తో పాటు మరో నలుగురు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్‌ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏ­ర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయ­టపడ్డాయి. 

అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధా­న నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్‌ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు. 

వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్‌ చేశా­రు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
cheating case
arrest
Andhra Pradesh
Animation
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.