తిరుమల: తిరుమలలో మంగళవారం 8 అడుగుల నాగుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుమలలో స్థానికులు నివాసముంటున్న బీ–టైపు 23వ క్వార్టర్స్ ప్రాంతంలో నాగుపాము వచ్చింది. స్థానికులు టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకు అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT