Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. బ్లాక్‌ స్పాట్స్‌.. డేంజర్‌ బెల్స్‌
ADVERTISEMENT 

బ్లాక్‌ స్పాట్స్‌.. డేంజర్‌ బెల్స్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cars.jpg

రాష్ట్ర రహదారులపై 787 ప్రమాదకర ప్రదేశాలు 

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం 

బ్లాక్‌ స్పాట్ల వల్లే వాహనదారుల ప్రాణాలు పోతున్నాయి 

పోలీసు శాఖ నివేదిక

రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరతామా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్రంలో మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కారణం.. రహదారుల అస్తవ్యస్త నిర్మాణం, పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలే. దీంతో రాష్ట్రంలోని రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాటిల్లో ఎక్కువ ప్రమాదాలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ఎక్కాలంటేనే వాహనదారులు బెంబేలెత్తాల్సి వస్తోంది. గుంతలమయంగా, ప్రమాదకర మలుపులతో ఉన్న రోడ్లపై వాహనం నడపడమంటే సర్కస్‌ ఫీట్లు చేసినట్లే. గమ్యం చేరేవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవింగ్‌ చేయాల్సి వస్తోంది. 

రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సరే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న బ్లాక్‌ స్పాట్లపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. బ్లాక్‌ స్పాట్లే వాహనదారుల ప్రాణాలకు స్పాట్‌పెడుతున్నాయని పోలీసు శాఖ ఇటీవల సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు..

787 బ్లాక్‌ స్పాట్లు
రాష్ట్రంలో రహదారులపై అత్యధికంగా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌ స్పాట్లు 787 ఉన్నాయి. రోడ్ల నిర్మాణంలో డిజైన్‌ లోపం, ప్రమాదకర మలుపులు, రోడ్లు నిర్వహణ లోపం, గుంతలమయంగా ఉండటంతో ఆ ప్రదేశాల్లో తరచూ రోడ్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

అత్యధికంగా బ్లాక్‌ స్పాట్లు ఉన్న జిల్లాల్లో తిరుపతి (100), ఎన్టీఆర్‌ (76), కృష్ణా (56), కాకినాడ (43), విశాఖ(40) జిల్లాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 787 బ్లాక్‌ స్పాట్లు రాష్ట్రంలో 76 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. వాటిలో 44 పోలీస్‌స్టేషన్లు ఏలూరు, విశాఖ, అన్నమయ్య, కాకినాడ, కృష్ణా, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. 

ఏమిటీ బ్లాక్‌ స్పాట్‌?
భారతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా రహదారి 5 కి.మీ. పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జరిగి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానిని ‘బ్లాక్‌స్పాట్‌’గా గుర్తిస్తారు.

వామ్మో! రోడ్డు ప్రమాదాలు
బ్లాక్‌ స్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్లు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది నవంబర్‌ 30నాటికే ఏకంగా 18,837 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 8,237 ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో 8,466 మంది దుర్మరణం చెందారు. 

10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది కంటే మొత్తం రోడ్డు ప్రమాదాలు 2.2% పెరగగా... వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 4.6% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మృతులు 4.6% పెరగ్గా తీవ్రంగా గాయపడినవారి సంఖ్య 0.4% పెరిగింది. 

» అత్యధికంగా 45% ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురయ్యాయి. 
» 44% ప్రమాదాలు జాతీయ రహదారులపై, 22% రాష్ట్ర రహదారులపై సంభవించాయి. 
» జాతీయ, రాష్ట్ర రహదారులుకాని రోడ్లపై 34% ప్రమాదాలకు కేంద్రమయ్యాయి.
» మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్యధికంగా 39% ప్రమాదాలు సంభవించాయి.
» తిరుపతి, విశాఖ, ఎన్టీఆర్, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కలిపి 29% రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన టాప్‌ 5 పోలీస్‌ స్టేషన్ల పరిధి 
» నల్లపాడు (గుంటూరు జిల్లా)
» చంద్రగిరి (తిరుపతి జిల్లా)
» ఒంగోలు తాలుకా (ప్రకాశం జిల్లా)
» దేవరాపల్లి (తూర్పు గోదావరి జిల్లా)
»  రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా) 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Road Accident
Andhra Pradesh
Chandrababu Naidu
black spots
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.