ADVERTISEMENT
World Heritage site
ఈ నెల 27వ తేదీ వరల్డ్ టూరిజమ్ డే. ఓ గొప్ప పర్యటన చేసి తీరాలి. అది... ప్రపంచం గర్వించే ప్రదేశమై ఉండాలి. అంతేనా... అది మనదేశంలోనే ఉండాలి. ఈ టూర్ జీవితమంతా గుర్తుండాలి...
ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఢిల్లీ గొప్పదనాలు. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తించిన నిర్మాణాలు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్... ఆగ్రా రెడ్‌ఫోర్ట్... ఈ రెండింటికీ గుర్తింపు 1983లో వచ్చింది. కుతుబ్ మినార్... హుమయూన్ సమాధి...