ADVERTISEMENT
vardhelli murali
ఏప్రిల్ ఏడో తేదీన దేశంలోని అన్ని దినపత్రికల్లో ఒక వార్త చాలా ప్రముఖంగా రిపోర్టయింది. చిరువ్యాపారులైన తండ్రీ కొడుకులిద్దరినీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి వారి చావుకు కారణమైన తొమ్మిదిమంది తమిళనాడు పోలీసులకు మధురై హైకోర్టు...
తిరుపతి సమీపాన నిన్న కూటమి సర్కార్ రెండేళ్ల పండుగ సభ జరిగింది. ఆ సభలో చెప్పుకోవడానికి విశేషాలు చాలానే ఉన్నాయట! సభా ప్రాంగణంలో లోకేశ్‌బాబు కలియతిరిగారట. మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముచ్చటించారట! ఆంధ్రజ్యోతి రాసింది...
‘ఈనాడు’ మీడియా అధిపతి వియ్యంకుల వారికి మరోసారి తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానాను సమర్పించిందట! వారి కాంట్రాక్టు సంస్థ పోలవరం ఎడమ కాలువ పనుల్లో రెండు ప్యాకేజీలను చేపట్టింది. కేవలం ఇరవై నెలల...
చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండాలోకి ఇప్పుడు కొత్త మాటలు కావాలి. రికార్డులు అరిగేలా పదేపదే పాడేసిన పాత పాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ఇరవై మాసాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకుందామంటే ‘క్రెడిట్...
ఊపిరాడనివ్వని అవినీతి కంపు నేడు ఆంధ్రావనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. పాలనా యంత్రాంగం లంచాల మత్తులో జోగుతున్నదని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిన్నాచితకా పనులు కూడా చేతులు తడపందే కావడం లేదని లోకవాణి...
ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే...
తెలంగాణకు సంబంధించినంతవరకు ‘నేనే రాజును, నేనే మంత్రిన’ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకున్నారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించ డానికి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయనీ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య...
‘‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ’’. చిత్తం శివుడి మీద – భక్తి చెప్పుల మీద నిలుపుకొనే దొంగ భక్తుల ముసుగుల్ని మహాకవి వేమన ఏనాడో...
సింగరేణిపై ఏ గద్దలనూ, ఏ పెద్దలనూ వాలనీయబోనని భట్టి విక్రమార్క ఘంటాపథంగా చెబుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ తన మీద చేసిన ఆరోపణలపై ఈ శనివారం కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ఇదేవారంలో...
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో...
ఇరవయ్యొకటో శతాబ్దంలో పాతికేళ్ల కాలం కరిగిపోయింది. ఇంకో ఇరవయ్యొక్క సంవత్సరాలు ఓపిక పట్టండి, భారత దేశాన్ని సూపర్ పవర్ చేసి చూపిస్తామని మన అధినేతలు అర చేతుల్లోనే వైకుంఠ దర్శనాలు చేయిస్తున్నారు. వైవిధ్య భారత...
మెడికల్ కాలేజీల ‘పీపీపీ’ మీద ఈరోజు (శనివారం) రెండు ముఖ్యమైన దినపత్రికల్లోని ఎడిట్ పేజీల్లో స్పందనలు కనిపించాయి. ఇందులో ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ కాలమ్ ఒకటి. ఈ కాలమ్‌లో వెలువడే అభిప్రాయాలు పత్రిక...
‘‘అమరావతిలో 25 బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. బాగానే ఉన్నది కానీ... వాటిని ఉపయోగించుకోవడానికి అంతమంది అక్కడున్నారా?’’ ఈ అపశకునం పలికిన వ్యక్తి ప్రతిపక్షి కాదు. అధికార పక్షానికి పరమభక్తుడు. చంద్రబాబుకు నిత్యం స్తోత్ర పారాయణం చేసే...
చంద్రబాబు పెంపుడు మీడియా అవాకుల గురించీ, ఆయన ఆస్థానంలోని పెయిడ్ చిలుకల చెవాకుల గురించీ తెలుగు నాట తెలియనివారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట పగులుతున్నకొద్దీ... యెల్లో...
ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకుంటేనే గొప్ప విజయంగా పరిగణించడం మీడియాలో ఒక సంప్ర దాయం. ఇక ఆరింట ఐదొంతుల సీట్లు గెలిస్తే చెప్పేదేముంది! బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సరిగ్గా అటువంటి విజయం...
చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా... ఇకపై చెల్లవని మన మహాకవి ఏనాడో చెప్పారు. ఇప్పుడైనా అంతే! బూటకపు మాటలతో, నకిలీ క్రెడిట్లతో, నయవంచనలతో ఇంకెన్నాళ్లు చక్రం తిప్పు తారు...
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో...
నిజాలపై నివురు కప్పడం, అసత్యాలకు అలంకారం చేయడం ఇప్పుడొక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లని ప్రశస్తి. ఈ ఖ్యాతిలో సింహభాగం యెల్లో మీడియాకు దక్కుతుంది. ఈ మీడియా గత...
‘‘ప్రతి బాల్యంలోనూ ఓ నందనోద్యానం ఉంటుంది. అది మెరిసిపోయే రంగులతో అల్లుకున్న మంత్రముగ్ధ నగరి. పిల్ల తెమ్మెరలక్కడ మృదువుగా హత్తుకుంటాయి. ప్రతి ఉదయమూ అక్కడ పరిమళ భరితమే’’ – బాల్యం గురించి ఓ రచయిత్రి...
నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని దీపావళి పండుగ ముగిసే వరకూ ఈ నెల రోజుల సీజన్‌ను ఎన్డీఏ సర్కార్ హైజాక్ చేసింది. జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను హేతుబద్ధీకరణ చేయడం వల్ల పేద, మధ్య...
మహాభారత కథలోని గాంధారీ సుతుల్లో ఒకడికి దుశ్శాసను డనే పేరు పెట్టారు వేదవ్యాస మహర్షి. శాసనాన్ని ఖాతరు చేయనివాడని దాని అర్థం. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపులేనివాడు...
‘‘నెహ్రూ ఒక ఫ్యూడల్. ఆయనకు బాగా డబ్బులున్నాయి. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన ఏ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడికో కారు వచ్చేది. ఆయన అనుసరించిన విధానాల వలన సింగపూర్‌తో మనం పోటీపడలేక...
వీళ్లు పాలకులేనా? భారత రాజ్యాంగం స్ఫూర్తితో ఎన్నికైన ప్రజా ప్రతినిధులేనా? ఇంతటి విశృంఖల అవినీతి గతంలో ఎప్పుడైనా ఉన్నదా? గజ్జెల మల్లారెడ్డి పద్యాన్ని కొద్దిగా మార్చి ‘తెలుగు నాట అవినీతి తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ...
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం...
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ...
పేరుకు మనది అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇప్పుడది మేడిపండు చందంగా మారిపోయిందనడానికి రుజువులు చాలా కనిపిస్తున్నాయి. దాని పొట్ట విప్పి చూస్తే పురుగులు భయపెడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి కాపు కాయవలసిన ఎన్నికల వ్యవస్థ అచేతనత్వంలోకి...
చాలా విషయాలు బయటకొస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టు కథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు...
నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ...
ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది...
ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు పన్నెండు రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసుగేసింది. ఫలితంగా రెండు రూపాయలకు కూడా కొనే...
సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట...
‘అంతులేని కథ’ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ’70వ దశకంలో సంచలన చిత్రం. ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లీడొచ్చిన పెద్ద కూతురు...
కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి...
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా...
చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను...
ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం...
భారత్ – పాకిస్తాన్ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే...
‘‘ఠండా మతలబ్ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్ టాక్. పది పైసల...
ఎట్టకేలకు పాకిస్తాన్ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం...
‘‘కాసులతో ప్రలోభపెట్టారు. వినకపోతే కేసులతో భయ పెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు ఈ విధంగా లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్‌పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి...
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్...
కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్రమించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని...
‘ఏరు దాటకముందు ఓడ మల్లయ్య... దాటిన తర్వాత బోడి మల్లయ్య!’ – ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’... ఎన్నికలయ్యాక ‘పీ–ఫోర్’ – ఇది కొత్త సామెత. ఎన్ని కల్లో గెలవడానికి...
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల...
సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. పిఠాపురంలో నిన్న ఆ వేడుక వైభవంగానే జరిగింది. తాను అసెంబ్లీ గేటు తాకడానికి అవకాశం కల్పించిన పిఠాపురాన్ని ఈ రకంగా పవన్...
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది...
కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్’ఫుల్‌గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు...
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు...
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాలు పూర్తి చేసు కొని ఎనిమిదో నెలలో ప్రవేశించి ఓ వారం గడిచిపోయింది. అష్టమంలోకి బుధుడు ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. గణాంకాలూ, లెక్కలూ వగైరా సబ్జెక్టులు బుధ గ్రహం పోర్టుఫోలియోలని...
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ...
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా...
పిడుగులు పడే సమయంలో మన పూర్వీకులు అర్జునుడి పేరును తలుచుకునేవారు. ఆయనకున్న పది పేర్లనూ గటగటా చదివేస్తే ఆ పిడుగుల్ని అర్జునుడు ఆకాశంలోనే బంధిస్తాడని ఓ నమ్మకం. ప్రకృతి కురిపించే పిడుగుల భయం పోగొట్టడానికి...
ఎన్నికల హామీలను అమలు చేయడం మాట దేవుడెరుగు. ప్రజల దైనందిన సమస్యలను కూడా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రాశులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని...
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం...
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన నివాసం కోసం...
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ...
ఇటీవల విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవినీతిని ఎండగట్టినందుకు సాక్షి ఎడిటర్‌పై కేసు నమోదు చేయడాన్ని పలు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఈకేసునుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. –సాక్షి...
భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్‌రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా...
భారతీయ జనతా పార్టీ వారు ఉత్తర భారతదేశాన్ని తమ కంచుకోటగా భావించుకుంటారు. ఆ కోట బీటలు వారుతున్న ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం జరిగితే దానిని పూడ్చుకోవడానికి కొత్త...
వారెవ్వా! ఎంతటి వంచనాశిల్ప చాతుర్యము. శకుని మామ అనేవాడు బతికే ఉంటే ఈ చతురత ముందు మోకరిల్లి పొర్లు దండాలు పెట్టి ఉండేవాడే! జగన్మోహన్రెడ్డి తిరుమల దర్శనా నికి వెళ్తే పెద్ద ఎత్తున అల్లరి...
భోపాల్ దుర్ఘటనకు ఇప్పుడు సరిగ్గా నలభయ్యేళ్ల వయసు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది...
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా...
మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్ర బాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ...
ఆకతాయిల పని కాదది. పథకం ప్రకారమే జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగింది. అదేదో చాటుమాటు ప్రాంతం కాదు. నిర్జన ప్రదేశం కాదు. విజయవాడ నడిగడ్డ. నగరంలోనే ఏక్ నంబర్ బిజినెస్ రాస్తా. బందర్...
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్ఠవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలవడానికి మోహరింపు మొదలుపెట్టాయి. ఇరాన్లో...
జనాభాపరంగా చూస్తే బ్రిటన్ దేశం ఇంచుమించుగా మన కర్ణాటక రాష్ట్రంతో సమానం. కానీ ఒకప్పుడు రవి అస్తమించనంత మేర విశాల భూభాగాలను తన సింహాసన ఛత్ర ఛాయలోకి తెచ్చుకున్న దేశం బ్రిటన్. ఈ ఘనత...
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ఓ కొటేషన్ చెప్పారు. ‘ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం’. ఈ రెండూ తన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు...
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా...
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది...
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని...
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో...
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు...
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు...
అంబేద్కర్‌ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో...
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు అనే అర్హత ఆమెకు రాజకీయ ఆశ్రయాన్ని కల్పించింది. తాజా హోదాకు కూడా కారణమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు, రామోజీల...
మన సమాజం వర్గాలుగా విభజితమై ఉన్నమాట ఒక వాస్తవం. కులాలుగా విడిపోయి ఉన్న మాట కూడా నిజం. ఈ కుల–వర్గ వేర్పాటులో కొందరిది ఆధిపత్య స్థానం, మెజారిటీ ప్రజలది అణచివేతకు గురయ్యే స్థానం. అవమానాలను...
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్...
శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్...
ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు స్నేహ హస్తాన్ని అందుకోవలసిన అవసరం బీజేపీకి ఉన్నదా? కామన్సెన్స్ ఉన్న వాళ్లె వరైనా లేదనే చెబుతారు. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎన్డీఏకు సవాల్...
పెత్తందారు ప్రమాదకరమైనవాడు. వాడు దశకంఠుడిలా కనిపి స్తాడు. మహాబలాఢ్యునిగా గోచరిస్తాడు. నల్లధనం కొండ మీద పడగవిప్పి కూర్చున్న నల్లతాచు వాడు. కనుక భయంకరంగానే కనిపిస్తాడు. వేయి పడగల కర్కోటకుడు పెత్తందారు. ఒక్కో వ్యవస్థలోకి ఒక్కో...
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం...
వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మంది ప్రజలు ఠకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం – ఆయనా కవల పిల్లలన్నంతగా అపఖ్యాతిపాలైన...
ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కని పిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో...
ఒకే ఒక్కడు సిద్ధం! ‘జో జీతా వొహీ సికిందర్’ అంటారు. తాను సిద్ధమేనని సికిందర్ ప్రకటించారు. సాగర తీరంలో ఆయన చేసిన రణగర్జనకు జన ప్రభంజన ఘోష ప్రతిధ్వని పలి కింది. ఏమా జనం...
కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నవారిని విమర్శించడానికి మనసొప్పదు. వారు తప్పు చేసినా సరే. కానీ ఇదేంది జీ? మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తున్నది? మీరు సింపతీ కోసం లీక్ చేసిన పడక సీన్ ఫోటోలను...
బాలరాముని అయోధ్య మందిరం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది. ఇక వచ్చే వారం రోజులైతే నిజంగానే ‘‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా...
‘ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి’ – ఘటోత్కచుని వేషంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్ ఇది – ఆల్‌టైమ్ గ్రేట్ మూవీ ‘మాయాబజార్’ క్లైమాక్స్ సీన్లో! కుట్రలతో, కుయుక్తులతో, కపటంతో, వంచనతో పాండవులను వేధిస్తున్న దుష్టచతుష్టయ...
ముసుగు జారిపోయింది. ఇప్పుడంతా తేటతెల్లం. చంద్ర బాబు కోసం పవన్ కల్యాణ్ చేత చంద్రబాబే ఏర్పాటు చేయించిన ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ (ఎస్పివి) జనసేన. అది ప్యాకేజీ ఫీజుతో కాంట్రాక్టుపై పనిచేస్తున్నదని వైఎస్సార్సీపీ నాయకులు...
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఓ సూపర్ వీక్ గడిచి పోయింది. ఆదివారం ఎన్నికల ఫలితాల వెల్లడితో ప్రారంభమై శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సూపర్ వీక్ ముగిసింది. ఈ ఏడు రోజుల్లో చాలా పరిణామాలు...
అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్ పోల్ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం...
ఇంకో నాలుగు రోజులు మాత్రమే! ఈనెల 30న తెలంగాణ రాష్ట్రం మూడో సర్కార్ ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. మూడో అసెంబ్లీ ఎన్నిక ముక్కోణపు పోటీగా మారడం విశేషం. ఎన్నికలన్న తర్వాత సర్వేలు, ప్రజాభిప్రాయ...
సూర్యుడు తూర్పు దిక్కుననే ఉదయించును. ఇది ఒక నిత్య సత్యం. పేద ప్రజల సాధికారతను పెత్తందార్లు అంగీకరించరు. ఇది కూడా అటువంటిదే. అనుదిన సత్యమే. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక... ఈ సుభాషితాన్ని ‘ఈనాడు’...
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు తెలంగాణాలో కూడా విజయం సాధిస్తే ‘ఇండియా’ కూటమిలో తన నాయకత్వానికి గౌరవం పెరుగుతుందనీ...
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నది. గాత్రంలో కొత్త గమకాలు పుట్టుకొస్తున్నాయి. లక్ష్యసిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలనేది కేసీఆర్ నుడివిన సూక్తి. దాన్ని మరింత ముందుకు తీసుకొనిపోతూ భస్మాసురుడి కౌగిట్లో చేరడానికి సిద్ధపడింది...
కొన్ని సారూప్యతలు కాకతాళీయం కావచ్చు. కొన్ని కాకతాళీయంగా భ్రమింపజేసే ప్రణాళికలు కావచ్చు. 83 సంవత్సరాల వృద్ధుడైన విప్లవ కవి వరవరరావుకు కూడా హైదరాబాద్‌లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి ముంబై ఎన్ఐఏ కోర్టు అనుమతి లభించింది...
నిఖార్సయిన వర్గ విభజన చోటు చేసుకుంటున్నది. కులమూ, వర్గమూ కలగాపులగమైన సమాజం మనది. పెత్తందారీ తోడేళ్లు కులాల మేకతోళ్లు కప్పుకొని మందల్లో దూరిన ప్రమాదకర వ్యవస్థ మనది. ఇప్పుడు ఒక రేడియం స్టిక్కర్ అడ్డుగీత...
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు...
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా...
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కర్ణాటక ఎన్నికలకు ముందు కొంతకాలంపాటు అది రెండో స్థానంలో ఉన్న భావన కనిపించింది. రాష్ట్రంలో ఉన్న బలమైన పునాది కారణంగా...