ADVERTISEMENT
Thailand
సోలోగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవ్వరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. అలాంటిది ఒక పనిమనిసి దేవం కానీ దేశంలో సోలోగా పర్యటించింది, రికార్డు చేసి తన ట్రావెల్‌వ్లాగ్‌లో షేర్ చేసింది. అది నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టడమే...
థాయ్‌లాండ్ రాజకుమారి యువరాణి బజ్రకితియాభా(47) మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆమె మరణం కేవలం రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత నష్టం మాత్రమే కాకుండా దేశ రాజ్యాంగ రాజరిక వ్యవస్థ భవిష్యత్తు, సింహాసన వారసత్వం మరియు...
థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో భూవిలయం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరు దేశాల్లోనూ భారీ విధ్వంసం మిగిల్చింది.
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ దువాంగ్‌దువాన్ కెట్సారో వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కనుల పండువగా జరిగినందుకో లేక అట్టహాసంగా జరిగినందుకో కాదు..పెళ్లి జరిగిన తీరు విచిత్రంగా ఉండటమే అందుకు కారణం...
థాయిలాండ్‌లో అరుదైన దృశ్యం నమోదైంది. ఆసియా గోల్డెన్ క్యాట్‌గా పిలిచే పైర్ టైగర్ అలా కనిపించి ఇలా మాయమైంది. ఖావో లువాంగ్ నేషనల్ పార్క్ లోపలి ట్రైల్ కెమెరాలో ఈ అరుదైన దృశ్యాలు రికార్డయ్యాయి...
రక్షిత వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేయడం తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలోనే థాయ్‌లాండ్ లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో భారతీయ టూరిస్ట్ అడ్డంగా బుక్కయ్యాడు. థాయిలాండ్ నుండి రెండు సజీవ కోతులను అక్రమంగా రవాణి...
హాట్ యాయ్: పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న ఓ ఆగంతకుడు సమీప స్కూల్లోకి చొరబడి గన్‌తో అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులను బెదిరించి అందర్నీ బంధించిన ఉదంతం థాయిలాండ్‌లో జరిగింది. విషయం తెల్సి రంగంలోకి దిగిన పోలీసులు...
థాయ్‌లాండ్‌లోని శోంక్లా పట్టణంలో దారుణం జరిగింది. పాఠశాలలో అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 34 మంది మృతి చెందారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. మాజీ పోలీస్ అధికారి ఈ...
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఆదివారం సాధారణ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా మరికొద్ది గంటల్లోనే వెలువడే అవకాశాలున్నాయి. అయితే, మందగించిన ఆర్థిక వృద్ధి, పెరిగిన జాతీయతావాద సెంటిమెంట్ నేపథ్యంలో దేశంలోని 5.3 కోట్ల మంది ఓటర్లు...
థాయిలాండ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పర్యటనకు వచ్చిన ఇద్దరు జర్మన్ పర్యాటకులు సరదాగా రోడ్లపై నడిచివెళ్తున్నారు. అంతలో వారికి గుమగుమలతో కూడిన వంటల వాసన వచ్చింది. దీంతో అందులోకి...
థాయిలాండ్‌లో ఓ బౌద్దసన్యాసుల మఠంలో పోలీసులు దాడులు నిర్వహించగా అశ్లీల చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఇతర నిషేదిత వస్తువులు లభించాయి. దీంతో ఆ నలుగురు సన్యాసులను పోలీసులు అరెస్టు చేశారు. చోన్బూరి ప్రావిన్స్‌లోని ఫ్రోమ్...
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణించిన భారత రైజింగ్ స్టార్ షట్లర్ దేవిక సిహాగ్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో దేవిక...
పైలట్ల కొరత, విమానాల రద్దు, పైలట్ల పనిగంటల తదితర అంశాలపై ఇప్పటికే చాలా విమర్శలెదుర్కొన్న ఇండిగో మరో వివాదంలో చిక్కుకుంది. డ్యూటీ సమయం ముగిసిన తర్వాత కూడా మరో విమానాన్ని నడపమని సంస్థ కోరడం...
నఖోన్ రాచసీమ(థాయిలాండ్): థాయిలాండ్‌లో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం తెప్పించిన భారీ క్రేన్ అటుగా వెళ్తున్న రైలు ప్రయాణికులకు పెనుశాపంగా పరిణమించింది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు మీద భారీ క్రేన్ పడటంతో బోగీలు...
థాయిలాండ్‌లో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఓ భారత పర్యాటకున్ని అక్కడి ట్రాన్స్జెండర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్...
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లోని ప్రజలు జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. ఆరోజు విందు వినోదాలతో వేడుకలు చేసుకుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటి నూతన సంవత్సర ఆరంభం కాదు...
బ్యాంకాక్: ఆగ్నేయాసియా దేశాలు థాయ్‌లాండ్- కంబోడియా మధ్య కొద్దివారాలుగా కొనసాగుతున్న భీకర పోరుకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఉభయ దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించాయి...
బ్యాంకాక్: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లొ విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ చర్య భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ...
ఢిల్లీ: థాయిలాండ్-కంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో విష్ణువు విగ్రహాన్ని కూల్చివేశారనే నివేదికలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవలి...
బ్యాంకాక్: థాయ్‌లాండ్ పార్లమెంటు శుక్రవారం రద్దయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు, కాంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ పార్లమెంటును రద్దు చేశారు. రాజు మహా వజీరాలాంగ్‌కార్న్ అనుమతి మేరకు...
పనాజీ/న్యూఢిల్లీ: గోవాలో 25 మందిని బలి తీసుకున్న అగ్ని ప్రమాదానికి కారణమైన నైట్‌క్లబ్ యజమానులు, సౌరభ్, గౌరవ్ లూథ్రాలకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. థాయ్‌లాండ్‌కు చెక్కేసిన ఈ సోదరులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు...
న్యూయార్క్, పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయి. కల్పించుకుని దాన్ని నివారించా‘ అన్నారు. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు...
ఇంట్లో భార్య ఉండగానే గాల్‌ఫ్రెండ్‌తో కలిసి థాయ్‌లాండ్ టూరుకు వెళ్లిన ప్రబుద్ధుడొకరు ఊహించని రీతిలో దొరికిపోయాడు. భార్యతో బిజినెస్ టూర్ అని చెప్పి రహస్య స్నేహితురాలితో షికారుకెళ్లిన అతగాడిని అనూహ్యంగా ప్రకృతి పట్టించింది. ఏంటి...
టాంగ్ టోరు: ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో భారీ వర్షాలతో గత వారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1,300 దాటింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండోనేషియాలో 712...
జకార్తా/న్యూఢిల్లీ: ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలకు సంభవించిన ఘటనల్లో మరణాలు వెయ్యి దాటేశాయి. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన...
భారీ వర్షాలతో థాయిలాండ్ అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టి ధాటికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి...
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం నుంచి ట్రాట్ ప్రావిన్స్‌లోని ప్రధాన భూభాగం వైపు వస్తున్న ఫెర్రీ ప్రమాదంలో చిక్కుకుంది. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం సిబ్బంది సహా మొత్తం 100 మందిని సురక్షితంగా...
సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ, థాయ్‌లాండ్‌లోని ఈ రెస్టారెంట్ యజమానికి మాత్రం వరద నీరే అదృష్ట దేవతలా మారింది! డైనింగ్ టేబుళ్ల మధ్య చేపలు ఈదుతుంటాయి. కస్టమర్లకు అద్భుతమైన...
బ్యాంకాక్: ‘పట్టపగలే మద్యం సేవిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగితే రూ.27,500 జరిమానా తప్పదు’అంటూ థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు కఠినమైన కొత్త చట్టాలను అమలు...
న్యూఢిల్లీ: మయన్మార్‌లో స్కామ్ సెంటర్ నుంచి పరారై సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్ పట్టణం మే సొట్‌లో తలదాచుకున్న 270 మంది భారతీయులు గురువారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు మిలటరీ రవాణా...
ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ పోటీలు వివాదంలో చిక్కుకున్నాయి. సాక్షాత్తు ఆతిథ్య దేశ అధికారే ఈ వివాదానికి కారకుడు కావడం దురుదృష్టకరం. ఈ ఘటనతో ఒక్కసారిగా అందాల భామలు..తాము కేవలం అందానికే కాదు, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు...
బ్యాంకాక్: నిరాశ్రయులు, పేదల కష్టాలు పోగొట్టేందుకు రాజ కుటుంబం తరఫున శాయశక్తుల ప్రయత్నించిన థాయ్‌లాండ్ రాజమాత, గతంలో రాణిగా సేవలందించిన సిరికిత్ కితియకారా తుదిశ్వాస విడిచారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా బ్యాంకాక్‌లోని ఆస్పత్రిలో అక్టోబర్...
భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా థాయిలాండ్ వ్యూహరచన చేసింది. ఇందుకు వెలుగుల పండుగ దీపావళిని వేదికగా చేసుకుంది. ‘గ్రాండ్ దివాళిృ2025’ వేడుకలను భారీగా...
థాయ్ బ్యూటీ క్వీన్ సుపన్నీ నోయినోంతాంగ్(Suphannee Noinonthong) అలియాస్ బేబీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందాల రాణి కిరీటం దక్కిన మరుసటిరోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. దీంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని...
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నగరంలోని ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ...
‘ ‘శిలలపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు మనసులో కోపాన్ని బయటికే తోసినారూ...!’’ అంటూ పాడుకుంటూ ప్రస్తుతం థాయిలాండ్ వాసులు తమలోని ఫ్రస్టేషన్‌ను బయటకు వెళ్లగక్కుతున్నారు. ‘‘అహో ఆఫీసు బాసూ... ఆ యముడంటి క్రూరిస్టు శాడిస్టు...
‘ఆడపిల్లలకు బైక్‌లు ఎందుకు!’ అని ఆ తండ్రి నిరాశపరిచి ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్‌లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేది కాదు. ‘బైక్ రేసింగ్ అంటే బాయ్స్‌కు మాత్రమే’ అనే అలిఖిత నిబంధనను జగతిశ్రీ కుమరేశన్...
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బుధవారం ఘోరం జరిగింది. అక్కడి ప్రముఖ జూలో పని చేసే వ్యక్తి(58)ని సింహాల గుంపు చంపి పీక్కుతింది. పర్యాటకులంతా చూస్తుండగానే ఇదంతా జరడం గమనార్హం. బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం...
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్రా(Thaksin Shinawatra)కు అధికార దుర్వినియోగం తదితర పాత కేసుల్లో ఏడాది జైలు శిక్ష పడింది. పదేళ్ల అజ్ఞాతం అనంతరం 2023లో ఆయన స్వదేశానికి తిరిగొచ్చాక అధికారులు ఆయన...
పేరుకు ప్రజాస్వామ్యమైనా రాచరిక వ్యవస్థ, దాని విధేయ సైన్యం, రాజ్యాంగ న్యాయస్థానం థాయ్‌లాండ్ రాజకీయాలను తెర వెనకుండి శాసించటం విడనాడలేదు. పర్యవసానంగా రెండేళ్ల వ్యవధిలో మూడో ప్రధాని రంగప్రవేశం చేశారు. ఇటీవల న్యాయస్థానం ఆదేశంతో...
బ్యాంకాక్: థాయ్‌లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా సీనియర్ నేత అనుతిన్ చర్న్‌విరకుల్(58) ఎన్నికయ్యారు. శుక్రవారం పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో పాల్గొన్న 492 మందికి గాను భుమ్‌జైతై పార్టీ తరఫున పోటీకి దిగిన అనుతిన్‌కు...
హాంగ్జౌ (చైనా): ప్రపంచ కప్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా... ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్‌లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్...
హాంగ్జౌ (చైనా): సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా... స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక గైర్హాజరీలో.. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటి నుంచి ఈనెల 14వ...
బ్యాంకాక్: థాయ్‌లాండ్, కంబోడియా సరిహదద్దు వివాదం కారణంగా ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయినప్పటికీ థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌కు ఫోన్ చేశారు.ఫోన్లో...
థాయ్‌లాండ్ ప్రధాని పాయ్టోంగ్టార్న్ షినవత్రకు షాక్
ఆసియా దేశాలు థాయ్-కంబోడియా తాజా సరిహద్దు ఘర్షణలకు ఎట్టకేలకు ముగింపు పడింది. ఇరు దేశాలు ఎలాంటి షరతులు లేకుండా తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన మలేషియా ప్రధాని...
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం ఓ వ్యక్తి ఐదుగురిని కాల్చి చంపాడు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఆహారాన్ని విక్రయించే ఓర్ టోర్ కోర్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. నలుగురు సెక్యూరిటీ గార్డులను, ఒక...
బ్యాంకాక్: థాయ్‌లాండ్, కాంబోడియాల మధ్య సరిహద్దు వివాదంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. థాయ్, కాంబోడియా నేతలు సోమవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో సమావేశమవనున్నారు. ఈ విషయాన్ని థాయ్ ప్రధానమంత్రి...
వాషింగ్టన్: థాయ్‌ల్యాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన మధ్యవర్తిత్వంతో విరమింపజేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న...
సురిన్(థాయ్‌లాండ్): థాయ్‌లాండ్, కాంబోడియా ల మధ్య సరిహద్దుల్లో ప్రారంభమైన ఘర్షణలు శనివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. కాల్పుల ఘటనల్లో ఇరు పక్షాలకు చెందిన కనీసం 33 మంది చనిపోగా, 1.68 లక్షల మధ్య నిరాశ్రయులయ్యారు...
థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది...
కాంబోడియా: థాయ్‌ల్యాండ్, కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 14 మంది పౌరులు మృతి చెందగా.. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక.. ప్రాణాలు...
బ్యాంకాక్: థాయ్‌లాండ్–కాంబోడియాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు గురువారం ఉదయం తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో కాల్పులకు దిగారు. థాయ్‌లాండ్ వైమానిక దాడులను సైతం...
బ్యాంకాక్: థాయ్‌లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశల సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా సరిహద్దుల్లో భద్రతా దళాల ఘర్షణలు జరిగినట్లు ఇరు దేశాలు మీడియాకు తెలిపాయి. థాయ్ సైన్యం, కంబోడియా రక్షణ...
బ్యాంకాక్: అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్‌లాండ్‌లో సంచలనం సృష్టిస్తోంది. గత నెలలో బ్యాంకాక్‌లోని బౌద్ధ ఆలయం నుంచి ఫ్రా థెప్...
ఇటీవల థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన బౌద్ధ సన్యాసుల సెక్స్ స్కాండల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్న 30 ఏళ్ల విలావన్ ఎమ్సావత్ అనే మహిళను పోలీసులు మంగళవారం అరెస్ట్...
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట. అలాంటి అమాయకత్వమే ఈ ఏనుగు పిల్లది. రాత్రిపూట ఓ చేలో చొరబడిన బుజ్జి ఏనుగు చెరుకు తింటూ ఉండిపోయింది. అంతలోనే ఎవరో వస్తున్నట్టు...
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్‌కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్ నేరుగా...
చియాంగ్ మయ్ (థాయ్‌లాండ్): ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత అమ్మాయిలకు అసలైన సవాల్ ఎదురవుతోంది. ర్యాంకింగ్‌లోనూ, పోటీలోనూ పటిష్టమైన థాయ్‌లాండ్‌తో ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో...
బ్యాంకాక్: 1999వ సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించిన హీరో అర్జున్ సినిమా ‘ఒకే ఒక్కడు’ గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి పాత్రధారి రఘువరన్ దమ్ముంటే ఒక్కరోజు సీఎంగా పరిపాలించి చూడు ఆ కష్టమేంటో తెలుస్తుంది...
థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు భారీ షాక్ తగిలింది. ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కంబోడియాతో జరిగిన డిప్లొమాటిక్ వివాదం నేపథ్యంలో...
ముంబై: ప్రయాణికుల మాదిరిగా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. వీరు బంగారం లాంటి విలువైన వస్తువులను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా...
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో...
టెల్ అవీవ్: గాజాలో థాయ్‌లాండ్ బందీ నాతాపాంగ్ పింటా మృతదేహాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడికి దిగి...
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఒక అడవి ఏనుగు అమాంతం సూపర్మార్కెట్లోకి దూసుకొచ్చి ఎలాంటి బీభత్సం సృష్టించకుండా తనకేం కావాలో అవి మాత్రమే తినేసి నెమ్మదిగా వెళ్లిపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నఖోన్ రాట్చసీమా ప్రావిన్సులో ఈ...
ఓపల్ సుచాతా.. మోడల్, థాయ్‌లాండ్.. తొలి మిస్ వరల్డ్... ఇప్పుడు 72వ మిస్ వరల్డ్! థాయ్‌లాండ్‌కి చెందిన ఆమె కేన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు...
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్–2025గా థాయ్‌లాండ్ భామ ఒపల్ సుచాత చువాంగ్శ్రీ(21) ఎంపికైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజయం...
రేయ్.. పులిని చూడాలనుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చెయ్యొచ్చు.. అంటూ ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేయబోయి తన ప్రాణాలనే...
నేపాల్, థాయ్‌లాండ్ జట్లు ఆఖరి నిమిషంలో మహిళల టీ20 వరల్డ్‌కప్-2026 గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీ పడేందుకు...
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను...
పులి మనతో మాట్లాడగలదా? తన బాధను మనతో చెప్పుకోగలదా? ఈ ఫొటో చెప్పగలదు.. ఆ పులి కథనే కాదు.. అందులోని అంతులేని వ్యథనూ మనకు కళ్లకు కట్టినట్లు చూపించగలదు ఓ గదిలో బంధించి కొడితే...
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ ( Mohammed Abdul Hamid)(81) ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో...
థాయ్‌ల్యాండ్‌లోని ఓ రెస్టారెంట్, కస్టమర్స్‌కి విచిత్రమైన ఆఫర్ ఇస్తోంది. ఇక్కడ భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ‘మెటల్ గేట్ చాలెంజ్’ అనే ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గొనాలి. అంటే ఒక ఐదు రకాల వెడల్పు అయిన...
హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలు జరగనుండటం విధితమే. దీనిలో దాదాపు 120 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంటులు భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా నగరానికి...
బంజారాహిల్స్(హైదరాబాద్): స్నేహితుడిని నమ్ముకుని భారత్‌కు వచ్చిన థాయ్‌లాండ్ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్‌కు డబ్బులు లేక వ్యభిచారంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్...
నూతన సంవత్సరం వచ్చిందంటే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సర్వసాధారణం. కాని, థాయిలాండ్‌లో మాత్రం న్యూ ఇయర్ వచ్చిందంటే నీటి యుద్ధమే జరుగుతుంది. అయితే ఇది కొట్లాట కాదు, నీటి కోలాటం. ప్రత్యేకమైన థాయ్...
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 10) బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ తలపడ్డాయి. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ థాయ్‌ను 178 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది...
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో తొలి విజయం చేరింది. తొలి రోజు మంగళవారం న్యూజిలాండ్ చేతిలో 1–2తో ఓడిపోయిన...
బ్యాంకాక్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus)తో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు(BIMSTEC Summit) ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు...
బ్యాంకాక్: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా యుత, సమ్మిళిత, న్యాయబద్ధమైన విధానాలకు కట్టుబడి ఉంటామని భారత్, థాయ్‌లాండ్ ప్రకటించాయి. విస్తరణ వాదం కాదు, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య...
బ్యాంకాక్: థాయ్‌లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే...
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్, థాయిలాండ్( Myanmar, Thailand) లను తాకిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ రెండు దేశాలలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటివరకు సుమారు 1,700 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం...
మాండలే: భూకంపం తాలూకు విధ్వంసం నుంచి మయన్మార్ ఇంకా తేరుకోలేదు. మౌలిక వనరుల లేమికి భూ ప్రకంపనలు తోడై సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుబడ్డవారి సంఖ్య అపారంగా ఉన్నట్టు సైనిక...
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే...
సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ...