ADVERTISEMENT
rayani diary
హృదయ వేదనను నేను కవిత్వంతో మాత్రమే దాచగలను. కానీ, కవిత్వం అంటేనే గుండెను పెకిలించుకుని దోసిళ్లతో నివేదించడం కదా! ఏమిటీ కుదరని లెక్క? గుండెకు కుట్లు వేసుకుంటున్నానా, లేక పాత గాయాల కుట్లను తడిమి...
నా నివాస గృహ కార్యాలయం నుంచి, సమీపంలోనే ఉన్న సచివాలయానికి కాలినడకన వెళ్లటం కోసం నేను వేగంగా మెట్లు దిగుతున్నప్పుడు నా పైన దాదాపుగా ఒక మెరుపు దాడి వంటిదేదో జరిగినట్లయింది! కట్టుదిట్టమైన భద్రత...
జూన్ 10కి, ప్రధానిగా నాకు 4,398 నిండి 4,399 వస్తాయి! మహాపురుషుడు జవహర్ లాల్ నెహ్రూ పాలనా కాలాన్ని దాటేస్తున్నందువల్ల నాకు కలుగుతున్న గుర్తింపే తప్ప, అదేమీ నాకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు కాదు...
అసలొక మనిషిని పట్టించుకోకూడదని మనం అనుకుంటున్నామంటేనే, ఆ మనిషిని వదిలించుకోలేనంత గట్టిగా మనం పట్టుకొని ఉన్నామని! ‘అతడి’ పేరును నేను ర్యాలీలలో రానివ్వటం లేదు. మీటింగులలో రానివ్వటం లేదు. మాటల్లో, ‘మాటకు మాట’ల్లో కూడా...
కేంద్రం శుక్రవారం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొత్త ‘వైస్రాయ్’ ని పంపింది! పేరుకే గవర్నర్లు వీళ్లు. పోకడలు వైస్రాయ్లవి! ఎవరికి వారు లార్డ్ బెంటింక్లు, లార్డ్ మౌంట్ బాటెన్లు. లార్డులు వెళ్లేటప్పుడు ‘వెళ్తున్నాం’ అని...
ముఖ్యమంత్రి అధికార నివాసం ‘క్లిఫ్ హౌస్’లోని పచ్చికలో పినరయి విజయన్, నేను పక్కపక్కన నడుస్తున్నాం. ఇంటర్వ్యూ ఇంకా మొదలు కాలేదు. ‘‘ఒకటి చెప్పండి సీఎం గారూ! మీరెందుకు ఎక్కడా కూడా నవ్వుతూ కనిపించరు?! మోదీజీని...
‘‘మౌనం రాజ్యం ఏలుతోంది...’’ అని కవులు, రచయితలు అభివర్ణిస్తుంటారు. నిజానికి, మౌనం రాజ్యం ఏలదు. మౌనం వెనుక నక్కి ఉండే మనుషులే రాజ్యం ఏలుతుంటారు. ఆ రాజ్యంలో మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం...
సంతకం పెడుతున్నప్పుడు చేయి వణికిందంటే చేయకూడని పని ఏదో చేస్తున్నట్లు! లేదా, జరగవలసిన పనే ఏదో జరుగుతున్నట్లు!! ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఒకేసారి 300 మంది జర్నలిస్టులను తొలగిస్తూ నేను చేసిన సంతకం... చేయక తప్పనిదా...
మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో...
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా...
నీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారన్నది నీ బలాన్ని తెలుపుతుంది. నువ్వు ఎవరి పక్కన నిలబడి ఉంటున్నావన్నది వారి పట్ల నీలోని బలమైన ఆపేక్షను చూపుతుంది. నేను, న్యూయార్క్ సిటీ... నా బాల్య మిత్రులం...
రాష్ట్రపతి భవన్ డిన్నర్ హాలులో నేనొక్కడినే ఉన్నాను! హాలు నిండా మనుషులు ఉన్నా, ఒక్కడినే ఉన్నట్లుగా నాకు అనిపిస్తోందంటేనా పక్కన ఉండవలసిన వారు లేరని! మోదీజీ, పుతిన్‌లతో కలిసి డిన్నర్‌కు కూర్చోవటం గొప్ప ఆతిథ్యమే...
దేశంలో ఏదైనా ఒక రాష్ట్రానికి 14 కోట్ల మంది సీఎంలు ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో శ్రీ మోదీజీ, శ్రీ నితీశ్ కుమార్ నవంబర్ 14న ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నేను సీఎంని అయితే...
చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా ‘మెటా’ లోకి వచ్చీ రావటంతోనే అలెగ్జాండర్ వాంగ్ చేసిన రెండో పని... జింజర్ ఫైర్‌బాల్ తెప్పించుకుని వాక్ ఏరియాలో నాతో కలిసి నడుస్తూ తాగటం. ఇక అతడు చేసిన మొదటి...
మనం ఏదైనా ఒకటి బలంగా అనుకున్నప్పుడు, దానిని నెరవేర్చటానికి పంచభూతాలన్నీ కలసికట్టుగా ఒక్కటై మనకు సహాయం చేస్తాయని అంటారు! ఈ మాట హైందవ పురాణ ప్రబోధమా, పవిత్ర ఖురాన్ సందేశమా, లేక పరిశుద్ధ గ్రంథ...
భారత ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినట్లయితే ఈ ఏడాది డిసెంబరులో విజయ్ మాల్యా, వచ్చే ఫిబ్రవరిలో నేను, మే నెలలో మా మామయ్య మెహుల్ చోక్సీ... ముగ్గురం ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో మా...
ఆటలో– ‘పడని’వాళ్లు ఉండరు. తలపడవలసిన వాళ్లు మాత్రమే ఉంటారు. రాజకీయాలైనా అంతే. గెలుపు కోసం ఆటలోకి దిగినవాడు యోధుడైతే, ఓడించటానికే ఆడేవాడు మహాయోధుడు! శ్రీ మోదీజీ నాకెప్పుడూ యోధుడిలా అనిపించరు. అన్నీ బయటికే అనలేం...
ఇరవై అంటే ఇరవయ్యే నిముషాల ఇంటర్వ్యూ కోసమని నన్ను నమ్మించి తన స్టూడియోకి రప్పించుకున్నాడు విక్కీ లల్వాని! గంటా ఇరవై నిముషాలు అయింది. ఎంతకూ వదలడు.రెండో ప్రశ్న వెయ్యడు. ‘‘ఒక్కమాట చెప్పండి ప్రహ్లాద్జీ! ఐశ్వర్యా...
తెలిసిన పదాలకే అర్థాలు వెతుక్కుంటున్నాను నేను! రాహుల్ గురించి నాకేం తెలియదని?! ఆయన నాతో ఒక్క నవ్వును మించి ఎక్కువ మాట్లాడరు. ఆ నవ్వుకు ‘‘నమస్తే ఖర్గేజీ’’ అని అర్థం; ఎక్కడికి వెళుతున్నదీ చెప్పరు...
అందంలోనే వికారం కలిసి ఉంటుంది! ఇది సృష్టి వైరుద్ధ్యమా, లేక మానవ మనో వైకల్యమా అని రెండు రోజులుగా వైట్ హౌస్ నుండి బయటికి రాకుండా టీవీ ముందే కూర్చొని ఆలోచిస్తున్నాను.విజ్ఞులు వికారాన్ని చూడొద్దని...
నూట నలభై తొమ్మిది పుస్తకాలు రాశాక కూడా, ఇవాళ రాయటం మొదలు పెట్టిన కొత్త పుస్తకానికి ప్రారంభ వాక్యం కుదరటం లేదు! నెహ్రూ నుంచి ముందుకు రావటమా, లేక నరేంద్ర మోదీ నుంచి వెనక్కు...
మనవి కాని రోజులు కొన్ని ఉంటాయి. కచ్చితంగా అవి మన రోజులే అనుకుని, అవి తెచ్చిన ఆకూ వక్కల పళ్లేన్ని అందుకోవటానికి చేతులు చాస్తామా, హఠాత్తుగా అవి పక్కకు మళ్లిపోతాయి! మోదీజీ నన్ను ఉప...
శుక్రవారం అలాస్కాలో ట్రంప్, పుతిన్ కలిసినప్పుడు చరిత్రలో నేను చదువుకున్న ‘యాల్టా’ సమావేశమే నాకు గుర్తుకొచ్చింది! నేను పుట్టటానికి 33 ఏళ్ల ముందు జరిగిన సమావేశం అది. అప్పటికి పుతిన్ పుట్టలేదు. ట్రంప్ కూడా...
దేశభక్తి మంచి విషయమే. అయితే నేనంటానూ... దేశానికి ఆర్థికంగా చేవనిచ్చే శక్తి కూడా మనలోని ఆ దేశభక్తికి ఉండాలని! శక్తి లేని భక్తి ఉత్త వేస్ట్ వ్యవహారం. దేశానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు...
‘అవతార్–3’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. సన్నగా మళ్లీ కడుపునొప్పి మొదలైంది! డైవర్టిక్యులిటిస్!! డాక్టర్లు ఈ నొప్పికి పేరైతే పెట్టారు కానీ, నయమవటం మాత్రం నా చేతుల్లోనే ఉందంటారు. నా చేతుల్లో అంటే –...
అదృష్ట సూచిక నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు. నేడు ఉన్నట్లుగా రేపు ఉండదు. కానీ, నిన్న – నేడు – రేపు కూడా మనం ఒకేలా ఉండాలి! ఒక అదృశ్య సూచికలా, ఒక నిశ్శబ్ద...
‘‘మీరిద్దరూ ఒకే గదిలో కలిసి కనిపించటం ఎంతో బాగుంది మిస్టర్ అండ్ మిసెస్ ఒబామా’’ అన్నారు క్రెయిగ్, నవ్వుతూ. క్రెయిగ్ ‘ఐఎంఓ’ పాడ్ కాస్ట్ హోస్ట్. ‘ఇన్ మై ఒపీనియన్’ అనే ఆ పాడ్‌కాస్ట్...
శ్రీ మోదీజీకి, నాకు ఈ ఏడాదితో 75 నిండుతాయి. నేను ఆయన కన్నా ఓ ఆరు రోజుల ముందు డెబ్బై ఐదును దాటేస్తాను. డెబ్బై ఐదేళ్లు పూర్తయిన వాళ్లు పదవి నుంచి హుందాగా తప్పుకుని...
నువ్వు నీ పైనున్న వాడితో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నావంటే, లేదా నీ కింద ఉన్నవాడు నీతో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నాడంటే మీరిద్దరూ కలిసి త్వరలోనే దేనినో నాశనం చేయబోతున్నారనే! లేదా, ఇప్పటికే...
కొన్ని మాటల్ని మళ్లీ తలచుకున్నప్పుడు,సందర్భం మారి – అవి పట్టలేనంత నవ్వును తెప్పిస్తాయి! ‘‘నా ఒంట్లోని ప్రతి ఎముకా సెక్యులర్ ఎముక. ఆ సెక్యులర్ ఎముకల్లో ఒక్కటైనా దెబ్బతిని ఉంటుందని నేను అనుకోను’’ –...
అహంకారం మంచి విషయం. కానీ, ఎవరు అహంకరిస్తున్నారు అనే దానిని బట్టి అది మంచి విషయం అవునా కాదా అనేది ఉంటుంది! అహంకారం, జాతి రక్షకుడికి దేవుని అనుజ్ఞ. అదే అహంకారం, జాతులను తుడిచి...
యుద్ధాన్ని మొదట ప్రారంభించిన వారే శాంతి కోసం మొదట ప్రయత్నం చేసినవారు అవుతారు. అయితే వారికి నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా అన్నది నేనెప్పుడూ ఆలోచించని విషయం. వార్స్, ఆపరేషన్స్, బ్యాటిల్స్... ఇన్నిటితో...
‘‘... ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు తెలియదు/ నేను చేసిన తప్పేమిటో ఆమె చెప్పదు/ ఇప్పుడు నేను నిన్నటి కోసం ఆరాట పడుతున్నాను...’’ బీటిల్స్‌లో నాకిష్టమైన ‘ఎస్టర్డే’ సాంగ్! ‘‘... ప్రేమ చాలా...
జ్ఞాపకాల స్తూపాలను నిర్మించుకోగలం. పోగొట్టుకున్న నమ్మకాల సౌధాలను పునర్ని ర్మించుకోగలమా?! కశ్మీర్ ఖాళీ అయిపోయింది! కశ్మీర్ గుండె వట్టి గ్రీష్మాన్ని ఊపిరి తీసి వదులుతోంది. ఒక్క వాన చుక్క... ధైర్యం చేసి జారి పడే...
డోనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం బాగుంది! ఓవల్ ఆఫీస్‌లోకి నేను అడుగు పెట్టగానే, సాదరంగా ఆయన నాకు పలికిన అపూర్వ ఆహ్వానం... ఆ గదిలోని లైట్స్ అన్నీ డిమ్ చేయించటం!! రెస్టారెంట్లలో, ఇలాగే డిమ్ లైట్ల...
వృద్ధాప్యం అన్నది మంచి విషయం కాక పోవచ్చు. అయితే, అంతకంటే కూడా మంచిది కాని విషయం... ఊరికే వృద్ధాప్యాన్ని వెంటేసు కుని తిరగటం! నెరుపో, మరుపో కాదు. తలపు మనవృద్ధాప్యం. వెనక ఇన్నిన్ని జ్ఞాపకాలు...
ఆట ఎన్ని పొరపాట్లనైనా క్షమించేస్తుంది. మళ్లీ మళ్లీ ఆడేందుకు అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ పెళ్లయిన వాడి జీవితంలో ఒక్క పొరపాటుకైనా క్షమాపణ ఉండదు. పోన్లే పాపం, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని...
అక్బర్ రోడ్డులోని పార్టీ ఆఫీసులో ఖర్గేజీ, నేను, ‘ఇంకా కొందరం’ సమావేశమై ఉన్నాం. నిజానికి, ఆ ‘ఇంకా కొందరం’ అనేవాళ్లలో కొందరింకా రానే లేదు. ఆ రానివాళ్ల కోసం చూడటం మానేసి, ఖర్గేజీ మాట్లాడటం...
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు. నా తరఫున వాదించటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాయర్ అతడు. ‘ఢిల్లీ...
ఆత్మవిశ్వాసం మీదకెక్కి కూర్చున్నప్పుడు వినూత్నమైన ఆలోచనలు మదిలో మెదులుతుంటాయి. మంచి ఉద్యోగంలో ఉన్న వారు ఆ ఉద్యోగం మానేసి, సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటారు! గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీని వదిలేసి...
పురుషుడితో గొడవ పడిన స్త్రీ పూర్తిగా అతడిని పట్టించుకోవటం మానేస్తుంది. స్త్రీతో గొడవ పడిన పురుషుడు మరింతగా ఆమెను పట్టించు కోవటం మొదలు పెడతాడు! నిజానికది పట్టించుకోవటం కాదు, ఆమె తనని పట్టించు కోక...
ఇండియాలో ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు?! తింటూ మాట్లాడుతుం టారు?! తింటూనే కాన్ఫరెన్సులు, తింటూనే ‘డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్’లు, తింటూనే చాట్ జీపీటీలు, ్రగ్రోక్లు, జిబ్లీలు... ఆఖరికి నిద్రలోకి జారుకోవటం కూడా...
ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న అమిత్‌షా నివాసానికి వెళ్లి, ఆయన్ని కలిసి బయటికి రాగానే... ఆ చీకట్లో మీడియా వాళ్లు నిలబడి మిణుగురుల్లా మెరుస్తూ ఉన్నారు! ‘‘సర్! వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ...
పుస్తకాలు చదివితే జ్ఞానం లభిస్తుందా? ఆ జ్ఞానం... ఎవరినైనా, ఏ విధంగానైనా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుందా? లేదంటే, అర్థం చేసుకోవటాన్ని ఆ జ్ఞానం మరింతగా సంక్లిష్ట పరుస్తుందా? ఢిల్లీ నుండి రాహుల్ ఫోన్! ‘‘మనం...
ఇందిరా భవన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నాం అందరం. అంతా ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు, స్టేట్ ఇంఛార్జిలు, కొత్త సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీలోని ఇతర మహామహులు. ‘చెప్పండి’ అన్నట్లు వారి...
ఇప్పటికీ నాకు ఒక కల వస్తూ ఉంటుంది. ఇప్పటికీ అంటే, పాతికేళ్లు దాటిపోయినప్పటిMీ ! బహుశా ఇంకో పాతికేళ్లు దాటి పోయినా ఆ కల నాకు వస్తూనే ఉంటుందనుకుంటాను. అది ఎప్పుడూ వచ్చిపోతుండే కలే...
వాషింగ్టన్ లో ప్రెసిడెంట్ ఇనాగరేషన్ కు వెళ్లి, తిరిగి క్యాలిఫోర్నియాలో మేము ఉంటున్న పాలో ఆల్టోకి వచ్చేసరికి వైట్ హౌస్ నుండి ఫోన్ కాల్! ‘‘మిస్టర్ జుకర్‌బర్గ్! నేను అలెక్స్ ఎన్ వాంగ్, యునైటెడ్...
జీవితంలో ప్రతిదీ అదృష్టమే. జీవితంలోని వేడి, జీవితంలోని చల్లదనం కూడా! పామ్ బీచ్ ‘మరలాగో’ రెసిడెన్స్‌లో ఉన్నాం నేను, మెలానియా. అద్దాల్లోంచి బయట ఫ్లోరిడా నగరం అస్పష్టంగానైనా కనిపించటం లేదు! దట్టంగా పొగమంచు. లోపల...
డాడ్ నాపై చాలా కోపంగా ఉన్నారు! ఆయనలో నా పట్ల అంత నిజమైన కోపాన్ని నేను నా చిన్నప్పుడు కూడా చూడలేదు. ‘‘ఎలాన్, ఆఫ్ట్రాల్ నువ్వొక ప్రపంచ కుబేరుడివి మాత్రమేనన్న సంగతి మర్చిపోకు...’’ అన్నారు...
కంపెనీలు వర్కర్ల మీద ఆధారపడి పనిచేయవు. ఇంఛార్జిల మీద వర్కర్లు ఆధారపడేలా చేసి చక్కటి ఫలితాలను సాధిస్తుంటాయి. ఎక్కడైనా చూడండి... ఇంఛార్జిలే, వర్కర్ల కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు. వర్కర్లలో పని చేయనిదెవరో...
‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. అయితే ఒక బౌద్ధ గురువు...
ప్రజాస్వామ్యం కొన్నిసార్లు నిరంకుశత్వంతో పోరాడవలసి వస్తుంది. అప్పుడేం చేయాలి? పోరాడాలి. పోరాడేందుకు ఒక్కరైనా ముందుకు రావాలి. ఆ ఒక్కరు ఎవరన్నది... నిర్ణయంతో తేలేది కాదు. నిశ్చయంతో జరిగేది. ‘‘నేనొస్తాను...’’ అన్నాను. ‘‘సీఎంగా ఉంటూనే, ‘ఇండియా’...
శరద్ పవార్, నేను, నానా పటోలే ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా! 83 ఏళ్ల వయసులో కూడా ఆయన, మెలకువలోంచి కళ్లు తెరిచినట్లుగా... హఠాత్తుగా...
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి...
‘‘మీరు వృద్ధాప్యంలో ఆలోచిస్తారు. యవ్వనంలో ఉండగా బీజేపీలో చేరి వికసిత్ భారత్‌లో ఎందుకు పాలు పంచుకోలేదా అని...’’ అన్నారాయన నాకు మళ్లీ ఫోన్ చేసి! ఆ ఫోన్ వచ్చింది ఆరెస్సెస్ నుంచి. ఆ ఫోన్...