ADVERTISEMENT
madhav singaraju
రాజీనామా లేఖను ప్రధానమంత్రికి అందించి బయటకు రాగానే నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లాయి. ఆ రోజు... భువనేశ్వర్‌లో, వందల మంది విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ‘‘జేబీ పట్నాయక్, దిగిపో... జేబీ పట్నాయక్...
అసలొక మనిషిని పట్టించుకోకూడదని మనం అనుకుంటున్నామంటేనే, ఆ మనిషిని వదిలించుకోలేనంత గట్టిగా మనం పట్టుకొని ఉన్నామని! ‘అతడి’ పేరును నేను ర్యాలీలలో రానివ్వటం లేదు. మీటింగులలో రానివ్వటం లేదు. మాటల్లో, ‘మాటకు మాట’ల్లో కూడా...
సంతకం పెడుతున్నప్పుడు చేయి వణికిందంటే చేయకూడని పని ఏదో చేస్తున్నట్లు! లేదా, జరగవలసిన పనే ఏదో జరుగుతున్నట్లు!! ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఒకేసారి 300 మంది జర్నలిస్టులను తొలగిస్తూ నేను చేసిన సంతకం... చేయక తప్పనిదా...
మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో...
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా...
ఇష్టమైన ప్రయాణాలకు, ఇష్టమైన మనుషుల్ని కలవటానికి సాకులు వెతుక్కోవడం బాగుంటుంది. బలంగా లేని సాకులు మనల్ని దొంగలా పట్టివ్వటం మరింత బాగుంటుంది. ‘‘స్కూల్‌కి ఎందుకు వెళ్లనంటున్నావ్ అమ్మూ బాబూ’’ అని అడిగేవారట అమ్మ, నా...
ఇల్లు, వంటిల్లు చేజారిపోకూడదు. ఇల్లు చేజారితే లోన్లు, ఈఎంఐల స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. వంటిల్లు చేజారితే ఫుడ్ డెలివరీ యాప్‌ల పాలౌతుంది. ఇల్లు అదుపు తప్పితే అప్పులు, వంటిల్లు ఆర్డర్ తప్పితే అనారోగ్యాలు! సభ కూడా...
అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు. తిరిగి ఇచ్చేయవలసి వచ్చినప్పుడే బాధపడి పోతుంటారు! సిద్ధరామయ్య నాకు సీఎం సీటు బాకీ. ‘‘ఫస్ట్ హాఫ్‌లో నేను సీఎంగా ఉంటాను. సెకండ్ హాఫ్‌లో మీరు సీఎంగా ఉండండి’’ అని...
దేశంలో ఏదైనా ఒక రాష్ట్రానికి 14 కోట్ల మంది సీఎంలు ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో శ్రీ మోదీజీ, శ్రీ నితీశ్ కుమార్ నవంబర్ 14న ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నేను సీఎంని అయితే...
సినిమాలో దమ్ము లేదని టాక్! దమ్ము ఉందా లేదా అన్నది కాదు, అసలైతే ‘టాక్’ ఉంది. అది కదా ఒక మంచి సినిమాకు నిజంగా ఆదరణ. సినిమా చూసేసి, ఖాళీ పాప్‌కార్న్ బకెట్‌ను సీటు...
చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా ‘మెటా’ లోకి వచ్చీ రావటంతోనే అలెగ్జాండర్ వాంగ్ చేసిన రెండో పని... జింజర్ ఫైర్‌బాల్ తెప్పించుకుని వాక్ ఏరియాలో నాతో కలిసి నడుస్తూ తాగటం. ఇక అతడు చేసిన మొదటి...
మనం ఏదైనా ఒకటి బలంగా అనుకున్నప్పుడు, దానిని నెరవేర్చటానికి పంచభూతాలన్నీ కలసికట్టుగా ఒక్కటై మనకు సహాయం చేస్తాయని అంటారు! ఈ మాట హైందవ పురాణ ప్రబోధమా, పవిత్ర ఖురాన్ సందేశమా, లేక పరిశుద్ధ గ్రంథ...
భారత ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినట్లయితే ఈ ఏడాది డిసెంబరులో విజయ్ మాల్యా, వచ్చే ఫిబ్రవరిలో నేను, మే నెలలో మా మామయ్య మెహుల్ చోక్సీ... ముగ్గురం ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో మా...
ఆటలో– ‘పడని’వాళ్లు ఉండరు. తలపడవలసిన వాళ్లు మాత్రమే ఉంటారు. రాజకీయాలైనా అంతే. గెలుపు కోసం ఆటలోకి దిగినవాడు యోధుడైతే, ఓడించటానికే ఆడేవాడు మహాయోధుడు! శ్రీ మోదీజీ నాకెప్పుడూ యోధుడిలా అనిపించరు. అన్నీ బయటికే అనలేం...
ఇరవై అంటే ఇరవయ్యే నిముషాల ఇంటర్వ్యూ కోసమని నన్ను నమ్మించి తన స్టూడియోకి రప్పించుకున్నాడు విక్కీ లల్వాని! గంటా ఇరవై నిముషాలు అయింది. ఎంతకూ వదలడు.రెండో ప్రశ్న వెయ్యడు. ‘‘ఒక్కమాట చెప్పండి ప్రహ్లాద్జీ! ఐశ్వర్యా...
తెలిసిన పదాలకే అర్థాలు వెతుక్కుంటున్నాను నేను! రాహుల్ గురించి నాకేం తెలియదని?! ఆయన నాతో ఒక్క నవ్వును మించి ఎక్కువ మాట్లాడరు. ఆ నవ్వుకు ‘‘నమస్తే ఖర్గేజీ’’ అని అర్థం; ఎక్కడికి వెళుతున్నదీ చెప్పరు...
అందంలోనే వికారం కలిసి ఉంటుంది! ఇది సృష్టి వైరుద్ధ్యమా, లేక మానవ మనో వైకల్యమా అని రెండు రోజులుగా వైట్ హౌస్ నుండి బయటికి రాకుండా టీవీ ముందే కూర్చొని ఆలోచిస్తున్నాను.విజ్ఞులు వికారాన్ని చూడొద్దని...
నూట నలభై తొమ్మిది పుస్తకాలు రాశాక కూడా, ఇవాళ రాయటం మొదలు పెట్టిన కొత్త పుస్తకానికి ప్రారంభ వాక్యం కుదరటం లేదు! నెహ్రూ నుంచి ముందుకు రావటమా, లేక నరేంద్ర మోదీ నుంచి వెనక్కు...
శుక్రవారం అలాస్కాలో ట్రంప్, పుతిన్ కలిసినప్పుడు చరిత్రలో నేను చదువుకున్న ‘యాల్టా’ సమావేశమే నాకు గుర్తుకొచ్చింది! నేను పుట్టటానికి 33 ఏళ్ల ముందు జరిగిన సమావేశం అది. అప్పటికి పుతిన్ పుట్టలేదు. ట్రంప్ కూడా...
దేశభక్తి మంచి విషయమే. అయితే నేనంటానూ... దేశానికి ఆర్థికంగా చేవనిచ్చే శక్తి కూడా మనలోని ఆ దేశభక్తికి ఉండాలని! శక్తి లేని భక్తి ఉత్త వేస్ట్ వ్యవహారం. దేశానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు...
‘అవతార్–3’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. సన్నగా మళ్లీ కడుపునొప్పి మొదలైంది! డైవర్టిక్యులిటిస్!! డాక్టర్లు ఈ నొప్పికి పేరైతే పెట్టారు కానీ, నయమవటం మాత్రం నా చేతుల్లోనే ఉందంటారు. నా చేతుల్లో అంటే –...
అదృష్ట సూచిక నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు. నేడు ఉన్నట్లుగా రేపు ఉండదు. కానీ, నిన్న – నేడు – రేపు కూడా మనం ఒకేలా ఉండాలి! ఒక అదృశ్య సూచికలా, ఒక నిశ్శబ్ద...
శ్రీ మోదీజీకి, నాకు ఈ ఏడాదితో 75 నిండుతాయి. నేను ఆయన కన్నా ఓ ఆరు రోజుల ముందు డెబ్బై ఐదును దాటేస్తాను. డెబ్బై ఐదేళ్లు పూర్తయిన వాళ్లు పదవి నుంచి హుందాగా తప్పుకుని...
నువ్వు నీ పైనున్న వాడితో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నావంటే, లేదా నీ కింద ఉన్నవాడు నీతో పూర్తి సమ్మతిని కలిగి ఉన్నాడంటే మీరిద్దరూ కలిసి త్వరలోనే దేనినో నాశనం చేయబోతున్నారనే! లేదా, ఇప్పటికే...
కొన్ని మాటల్ని మళ్లీ తలచుకున్నప్పుడు,సందర్భం మారి – అవి పట్టలేనంత నవ్వును తెప్పిస్తాయి! ‘‘నా ఒంట్లోని ప్రతి ఎముకా సెక్యులర్ ఎముక. ఆ సెక్యులర్ ఎముకల్లో ఒక్కటైనా దెబ్బతిని ఉంటుందని నేను అనుకోను’’ –...
అహంకారం మంచి విషయం. కానీ, ఎవరు అహంకరిస్తున్నారు అనే దానిని బట్టి అది మంచి విషయం అవునా కాదా అనేది ఉంటుంది! అహంకారం, జాతి రక్షకుడికి దేవుని అనుజ్ఞ. అదే అహంకారం, జాతులను తుడిచి...
జ్ఞాపకాల స్తూపాలను నిర్మించుకోగలం. పోగొట్టుకున్న నమ్మకాల సౌధాలను పునర్ని ర్మించుకోగలమా?! కశ్మీర్ ఖాళీ అయిపోయింది! కశ్మీర్ గుండె వట్టి గ్రీష్మాన్ని ఊపిరి తీసి వదులుతోంది. ఒక్క వాన చుక్క... ధైర్యం చేసి జారి పడే...
డోనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం బాగుంది! ఓవల్ ఆఫీస్‌లోకి నేను అడుగు పెట్టగానే, సాదరంగా ఆయన నాకు పలికిన అపూర్వ ఆహ్వానం... ఆ గదిలోని లైట్స్ అన్నీ డిమ్ చేయించటం!! రెస్టారెంట్లలో, ఇలాగే డిమ్ లైట్ల...
ఆత్మవిశ్వాసం మీదకెక్కి కూర్చున్నప్పుడు వినూత్నమైన ఆలోచనలు మదిలో మెదులుతుంటాయి. మంచి ఉద్యోగంలో ఉన్న వారు ఆ ఉద్యోగం మానేసి, సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటారు! గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీని వదిలేసి...
మై హ్యాపీ ప్లేస్! అంతరిక్షం!! తొమ్మిది నెలలుగా ఇక్కడ రోజుకు పదహారు సూర్యోదయాలు, పదహారు సూర్యాస్తమయాలు! ‘‘ఇంకెంత... కొన్ని గంటలే... ’’ అని నవ్వారు బుచ్ విల్మోర్ (butch wilmore). ఆయన నవ్వు నక్షత్రంలా...
స్నేహంలో ఎదగాలి కానీ, స్నేహాలతో ఎదగకూడదు. ‘‘ఎదగటానికి కాకపోతే ఇంకెందుకు స్నేహాలు?!’’ అనే వాళ్లకు నేను ఒకటే చెబుతాను. స్నేహాన్ని నిచ్చెనగా చేసుకొని ఎదగటమంత పతనం వేరే ఇంకేదీ ఉండదు. రాజీవ్ నన్ను రాజకీయాల్లోకి...
ఇందిరా భవన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నాం అందరం. అంతా ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు, స్టేట్ ఇంఛార్జిలు, కొత్త సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీలోని ఇతర మహామహులు. ‘చెప్పండి’ అన్నట్లు వారి...
ఇప్పటికీ నాకు ఒక కల వస్తూ ఉంటుంది. ఇప్పటికీ అంటే, పాతికేళ్లు దాటిపోయినప్పటిMీ ! బహుశా ఇంకో పాతికేళ్లు దాటి పోయినా ఆ కల నాకు వస్తూనే ఉంటుందనుకుంటాను. అది ఎప్పుడూ వచ్చిపోతుండే కలే...
డాడ్ నాపై చాలా కోపంగా ఉన్నారు! ఆయనలో నా పట్ల అంత నిజమైన కోపాన్ని నేను నా చిన్నప్పుడు కూడా చూడలేదు. ‘‘ఎలాన్, ఆఫ్ట్రాల్ నువ్వొక ప్రపంచ కుబేరుడివి మాత్రమేనన్న సంగతి మర్చిపోకు...’’ అన్నారు...
కంపెనీలు వర్కర్ల మీద ఆధారపడి పనిచేయవు. ఇంఛార్జిల మీద వర్కర్లు ఆధారపడేలా చేసి చక్కటి ఫలితాలను సాధిస్తుంటాయి. ఎక్కడైనా చూడండి... ఇంఛార్జిలే, వర్కర్ల కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు. వర్కర్లలో పని చేయనిదెవరో...
‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. అయితే ఒక బౌద్ధ గురువు...
మాధవ్ శింగరాజు ఉదయ్ సామంత్, భరత్ గొగావాలే, రవి పాఠక్, సంజయ్ శిర్సాత్, నేను.. కూర్చొని ఉన్నాం. మాతో రాబిన్ శర్మ కూడా ఉన్నారు. రాబిన్ శర్మ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. మిగతా నలుగురు...
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి...
‘‘మీరు వృద్ధాప్యంలో ఆలోచిస్తారు. యవ్వనంలో ఉండగా బీజేపీలో చేరి వికసిత్ భారత్‌లో ఎందుకు పాలు పంచుకోలేదా అని...’’ అన్నారాయన నాకు మళ్లీ ఫోన్ చేసి! ఆ ఫోన్ వచ్చింది ఆరెస్సెస్ నుంచి. ఆ ఫోన్...
ఎవరి మీదనైనా మనకు పట్టనలవి కాని గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడు కోవలసిన బాధ్యత కూడా మనదే అవుతుంది తప్ప, అవతలి వాళ్లది కానే కాదని గట్టిగా నమ్ముతాన్నేను. శరద్‌జీ అంటే నాకు...
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ...
లోకం మనల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసినప్పుడు లోకానికి మనం ఏదైనా కొత్తగా చేసి చూపించాలన్న తపన మన లోలోపల ఎందుకని అంత అర్థరహితంగా రేయింబవళ్లూ జ్వలిస్తూ ఉంటుంది?! ‘‘ఇదిగో.. చాణక్యపురిలోని న్యాయ్మార్గ్లో ఉన్న ‘మానస...
మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే. ‘‘ఏంటి...
మనిషిని చూస్తే శుభ్రంగా ఉన్నాడు. సంప్ర దాయంగా ఉన్నాడు. ధోతీ–చొక్కా ధరించి ఉన్నాడు. శ్రీమతితో కలిసి నడుస్తున్నాడు! ‘‘ఈయన రవి కదా, మన తమిళనాడు గవర్నర్!’’ అన్నాను... ఫొటోలో అలా శుభ్రంగా, సంప్రదాయంగా, ధోతీ–చొక్కా...