ADVERTISEMENT
KM Pillai
‘ఏం తమ్మీ మంచి గున్నవా?’.. ‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’.. ‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్‌ని నేను దేవుడంటా...
దేవుడ్ని మొక్కేటోళ్లు రోజూ చెప్పుకునే మంత్రాలు కొన్నుంటాయి. వోటిని నిత్యపారాయణం అంటారు. ఆ పెకారం జూసినప్పుడు.. ఏడాదికి రెండుమార్లు చెప్పుకునే మంత్రాలను ఏటనుకోవాల? అట్టాంటివి మామూలు పెజానీకానికి అలవాటు లేదు గాబట్టి.. ఆ పనిజేసే...
చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును...
ఒక చావు.. కొందరిని కుంగదీస్తుంది. కుమిలిపోయేలా చేస్తుంది. అదే చావు.. మరికొందరికి మాత్రం కాసుల పంట పండిస్తుంది. ‘శవాల మీద పేలాలు ఏరుకుని తినే నీచులు..’ అంటూ.. మానవత్వం లేని మనుషుల గురించి మనం...
మొగుడు అయిన వెంటనే మనిషి అనే హోదాను కోల్పోతారా? భర్త అనే కిరీటం దక్కిన వెంటనే మానవత్వం అనే లక్షణం నశించి పోతుందా? భార్య అనే ప్రాణి మన జీవితంలోకి ప్రవేశిస్తే చాలు, కట్టు...
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. దొంగలు దోచుకుంటే అది వార్త కాదు. ఇవాళ్టి రోజుల్లో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ...
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి. ఏ పునాదుల ఆధారంగా మానవ సంబంధాలు నిర్మితం అవుతున్నాయి... కాలక్రమంలో ఎలాంటి కారణాలు మానవ సంబంధాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఎలాంటి వ్యవహారాలు నైతిక విలువలను పరిహాసం...
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత...
నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టివచ్చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంగతే ఇది.‘‘మధ్యప్రదేశ్ లో నలుగురు వ్యక్తులు కలిసి, ఒక మేకను దేవుడికి బలి ఇవ్వడానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారి వాహనానికి...
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు...
ఓలా, ఊబర్ ట్యాక్సీల తరహాలో ‘సహకార్ ట్యాక్సీ’ అనే విధానాన్ని తీసుకురావడం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్ సభలో ప్రకటించారు. ప్రజలకు స్థానిక ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఇలాంటి యాప్...
‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై.. ప్యార్ సే ఫిర్ క్యోం డర్తా హై దిల్’ అంటూ ఆ కుర్రవాడు బహుశా లోలోపల సాంగేసుకుని ఉండవచ్చు. ఒక ప్యారీతో ప్యార్ నడుస్తూ ఉండగానే.. మరో...
ఒక పురాణ కథ చెప్పుకుందాం.. రుషుల కాలంలో అష్టావక్రుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన కురూపి. శరీర నిర్మాణం సరిగా లేనివాడు. అయితేనేం.. అపరిమిత జ్ఞాన సంపన్నుడు! అనేక శాస్త్రాల మీద పట్టు...
‘గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఫరెగ్జాంపుల్ ‘ఒక పని’ చేయడం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉన్నదనుకోండి.. అక్కడ ఓ వెయ్యిరూపాయల లాభం రాబోతున్నట్టుగా...
సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది...
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ...
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఎలాంటి వంచనాత్మకమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందో.. ఆచరణాత్మకం కాని ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో.. ప్రజలకు తెలుసు. ఎన్డీయే సర్కారు ఆ హామీలను నిలబెట్టుకుంటుందో లేదో...
మర్కర్‌వాడీ అంటే కేవలం 1900 ఓట్లున్న కుగ్రామం. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ తహసీలులో ఉంటుందా పల్లె! ఎంత చిన్న పల్లె అయితేనేం.. ఇవాళ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకులలో వణుకు పుట్టిస్తోంది...
చల్లకొచ్చి ముంత దాచుకోవడం అనే సామెత ఒకటుంది. ఆ సామెత వెనుక ఓ బుల్లి కథ కూడా ఉంది. ఓ ఊళ్లో ఆదెమ్మ, సోదెమ్మ అనే ఇద్దరున్నారు. ఇద్దరూ ఇరుగు పొరుగువారే. ఆదెమ్మకు ఏదైనా...
ఇదేమిటబ్బా.. ‘ఏ పుట్టలో ఏ పాముంటుందో?’ అనేది కదా సామెత! ఇక్కడేదో తేడా కొడుతోందే అనుకుంటున్నారు కదా? సామెత అదే గానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మోసకారి బతుకులు బతికే వారి బుర్రల్లో రకరకాల...
‘అనగనగా ఒక ఊరిలో ఒక నాగుపాము ఉండేది. తనకు ఎవరు కనిపిస్తే వారిని కాటేసి చంపేసేది. లేదా, చిన్న జీవులైతే తినేసేది. అదంటే అందరికీ చాలా భయం. కొన్నాళ్లకు ఆ నాగుపాము బాగా ముసలిది...
నలుగురినీ మోసం చేసేవాడు నీతో మంచిగా ఉంటున్నాడంటే దాని అర్థం.. నీతో వాడికి ఏదో అవసరం ఉన్నదని.. అవకాశవాదంతో మాత్రమే నీతో మంచిగా ఉన్నాడని!. ఈ మర్మం తెలియకుండా.. చాలా మంది.. ‘వాడు ఎలాంటి...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ ఎత్తుగడలను మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఒకవైపు భాగస్వామ్య పక్షాల కోసం త్యాగాలు తప్పవని అంటూనే.. మరోవైపు వారి వెనుక గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం...
పవన్ కల్యాణ్ సెంటిమెంట్లకు, ఇంకా సూటిగా చెప్పాలంటే మూఢ నమ్మకాలకు చాలా చాలా విలువ ఇచ్చే వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన తన అత్యంత విశ్వసనీయుడైన సహచరుడితో కలిసి క్షుద్రపూజలు కూడా...
తనకేదో వీరబీభత్సమైన ప్రజాదరణ ఉన్నదని ముందుగా ప్రచారం చేసుకోవాలి. ఓట్లు పడినా పడకపోయినా పర్లేదు.. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే.. ఎమోషన్స్ రకరకాలుగా పండించినంత ప్రొఫెషనల్‌గా, వేదిక ఎక్కితే ఆవేశపూరిత ప్రసంగాలతో విజిల్స్ కొట్టించుకోవాలి...
తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబునాయుడుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనలాగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినవాళ్లు ప్రస్తుతానికి లేరు. అలాగే ఆయన పేరుకు ఒక పర్యాయపదం కూడా ఉంది. అదే ‘వెన్నుపోటు’...
కాపురం చేసే కళ.. కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత! చంద్రబాబునాయుడుతో వ్యవహారం ఎలా ఉంటుందో పొత్తు కుదిరిన తర్వాత చర్చలకు కూర్చున్న తొలిరోజునే బయటపడిపోయింది. బతిమాలి బామాలి బిజెపి పెద్దల కాళ్లు పట్టుకున్నంత...