ADVERTISEMENT
Houthi rebels
టెహ్రాన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధి విషయంలో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన ఇరాన్, తాజాగా బాబ్-అల్-మందేబ్ జలసంధిని సైతం మూసివేస్తామని హెచ్చరించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్...
ప్రస్తుతం యెమెన్‌లోని ప్రభుత్వ అనుకూల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా హోదైదా, మారిబ్ ప్రాంతాల్లో తమ బలగాలను మళ్లీ మోహరించారు హౌతీలు...
ఇరాన్ నుండి యెమెన్‌లోని హౌతీలకు బాలిస్టిక్ క్షిపణి భాగాలను అక్రమంగా రవాణా చేసినందుకు పాకిస్తాన్ పౌరుడు ముహమ్మద్ పహ్లావన్‌కు అమెరికాలోని వర్జీనియా కోర్టు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అరేబియా సముద్రంలో అమెరికా...
టెల్అవీవ్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఆదివారం ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడికి పాల్పడ్డారు. హౌతీలు ప్రయోగించిన డ్రోన్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని ఎయిలట్కు సమీపంలోని రమోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్‌ను...
కైరో: యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హౌతీ తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధానమంత్రి అహ్మద్ అల్ రహావి చనిపోయారు. గురువారం జరిగిన ఈ దాడుల్లో రహావితోపాటు పలువురు మంత్రులు...
సనా: యెమెన్ రాజధాని సనాలో హౌతీ గ్రూప్‌కి చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో హౌతీ గ్రూప్‌కి చావు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన మెరుపు దాడుల్లో...
దుబాయ్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న గ్రీక్ దేశానికి చెందిన అంతర్జాతీయ సరకు రవాణా నౌక ‘ఎటరి్నటీ సి’పై హౌతీలు గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడిచేశారు. దీంతో నౌకకు కిందవైపు...
యుద్ధం కొనసాగినన్ని రోజులూ రణ క్షేత్రాల్లో ఎక్కడ చూసినా రక్తతర్పణమే. సైనికుల రుధిరంతో తడిసి ముద్దయిన భూములు మాత్రమే కాదు పరోక్షంగా కోట్లాది ఎకరాల్లో సాగుభూమి, జనావాస ప్రాంతాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని ఐక్యరాజ్యసమితి...
టెల్ అవీవ్: తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను...
హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్పోర్ట్...
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్...
సనా: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్ల మౌలిక వనరులే లక్ష్యంగా అమెరికా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. హొడైడా నౌకాశ్రయం, విమానా శ్రయాలపై ఆదివారం 13 సార్లు అమెరికా వైమానిక దాడులు జరిపిందని హౌతీల అధీనంలో...
దుబాయ్: యెమెన్‌లోని హౌతీ రెబల్స్ ఆదీనంలో ఉన్న చమురు నౌకాశ్రయంపై అమెరికా భీకర వైమానిక దాడులు జరిపింది. ఘటనలో 74 మంది చనిపోగా, 171 మంది గాయపడినట్లు హౌతీలు ప్రకటించారు. కాగా, హౌతీల లక్ష్యాలపై...
వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడి వ్యూహాలను రహస్యంగా ‘సిగ్నల్’ యాప్ గ్రూప్చాట్లో చర్చిస్తూ పొరపాటున ఒక సీనియర్ పాత్రికేయుడిని ఆ గ్రూప్‌లో చేర్చుకున్న ఉదంతంలో అసలు ఆ గ్రూప్‌లో ఏం చర్చించారన్న వివరాలు...
వాషింగ్టన్: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున యెమెన్ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ...
వాషింగ్టన్ డీసీ: అమెరికా( America) మరోమారు యెమెన్ పై దాడి చేసింది. ఈ దాడిని హౌతీ మీడియా ధృవీకరించింది. దీనికిముందు కూడా అమెరికా యెమెన్‌పై దాడికి పాల్పడింది. ఆ దాడిలో 54 మంది మృతి...
సానా: యెమెన్‌లో హౌతీలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. హౌతీలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. ఈ నేపథ్యంలో దాడులపై ట్రంప్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌతీల టైమ్...
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump) ఆదేశాల దరిమిలా యెమెన్ రాజధానిపై జరిగిన దాడుల్లో 20 మంది పౌరులు మృతిచెందారని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. హౌతీ...
న్యూయార్క్: తమ యుద్ధనౌకపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా వెల్లడించింది. బాబ్ అల్-మందాబ్ జలసంధిని దాటుతున్న సమయంలో రెండు అమెరికా డిస్ట్రాయర్లు లక్ష్యంగా హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారని...
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించాయి. గురువారం ఉదయం ఆక్రమిక పాలస్తీనాలోని...
జెరూసలెం: ఇజ్రాయెల్‌పై హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఆదివారం(సెప్టెంబర్15) ఉదయం మిసైల్‌తో దాడి చేశారు.యెమెన్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.తూర్పు వైపు నుంచి మిసైల్ దూసుకువచ్చింది. అది ఓ బహిరంగ ప్రదేశంలో పడింది. మిసైల్ దాడిలో...
ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్‌కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10...
సనా: అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్లు యెమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. యెమెన్ గగనతలంలో ఎగురుతున్న ఎమ్క్యూ-9 మానవరహిత విమానాన్ని(యూఏవీ) కూల్చేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా...
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్‌లోని అల్ హొదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ...
సనా: యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అల్హొదైదా పోర్టుతో పాటు పలు చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. పోర్టులోని చమురు నిల్వలకు...
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలపై హౌతీలు దాడులు పెంచారు. తాజాగా శనివారం(మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై హౌతీలు బాలిస్టిక్ మిసైళ్లతో...
వాషింగ్టన్ : హౌతీ గ్రూపు మిలిటెంట్లు తమ ఆయుధాలు దాచుకున్న యెమెన్‌లోని వారి భూగర్భ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్( సెంట్కామ్) ఒక ప్రకటన విడుదల...
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా తెలిపింది. హౌతీల డ్రోన్ వల్ల నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం ఒక...
భారత్ నుంచి నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలతోపాటు ఉత్తర అమెరికా దేశాలకు సరకు చేయడానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం ప్రధానపాత్ర పోషిస్తాయి. సదరు దేశాల నుంచి సరుకులు, ముడి పదార్థాలు మనదేశానికి రావాలన్నా...
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ గ్రూపు మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు షాక్ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్లను శనివారం రాత్రి కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ...
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో...
దుబాయ్: హౌతీ మిలిటెంట్ల క్షిపణి దాడిలో దెబ్బతిన్న మొట్టమొదటి వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దాడులకు నిరసనగా యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర...
సనా: యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ టార్మ్ థార్‌పై మిసైళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయిల్...
సనా: యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా ఆర్మీ మళ్లీ దాడులు జరిపింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) వెల్లడించింది. హౌతీలకు చెందిన యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల...
సనా: యెమెన్‌లోని తమ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులు, గస్తీలకు హౌతీ తిరుగుబాటుదారులు బెదరడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన రెండు నౌకలపై విజయవంతంగా దాడి చేసినట్లు...
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై అమెరికా కూటమి కన్నెర్ర చేసింది. యెమెన్‌లో డజన్ల కొద్ది హౌతీ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు జరిపాయి. దాదాపు 13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు...
జెరూసలేం: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్‌తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది...
సనా : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల తీవ్రతను పెంచే ఉద్దేశం లేదని, కేవలం ఇజ్రాయెల్‌తో సంబంధమున్న నౌకలే తమ లక్ష్యమని యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు ప్రకటించింది. అదే సమయంలో...
యెమెన్, సనా: ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలపై తిరుగుబాటుకు యెమెన్ పిలుపునిస్తోంది. అయితే.. హౌతీలపై భూతల దాడులు చేయడానికి తమ సైన్యానికి తోడుగా ఇతర దేశాల సైన్యం...
టెహ్రాన్: ఎర్రసముద్రంలో వాణిజ్య రాకపోకలకు పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. భారతదేశానికి సమీపంలో...
వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా...
సనా: యెమెన్ రాజధాని సనాలోని తమ స్థావరాలపై అమెరికా,బ్రిటన్లు సంయుక్తంగా చేస్తున్న దాడులను హౌతీ మిలిటెంట్లు తేలిగ్గా కొట్టి పారేశారు. దాడుల ప్రభావం తమపై పెద్దగా లేదని, దాడుల్లో ఎవరూ గాయపడలేదని హౌతీ గ్రూపు...
అంకారా: యెమెన్‌లోని హౌతీ గ్రూపు స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు హౌతీలపై అవసరమైన దానికంటే ఎక్కువ దాడులు చేస్తున్నాయని...
ఎర్రసముద్రం కొంతకాలంగా అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ దన్నుతో హౌతీ ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై విచ్చలవిడి దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. యెమన్‌లో అత్యధిక భాగాన్ని నియంత్రిస్తున్న...
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య...
టెహ్రాన్: తమపై దాడులు చేసిన అమెరికా, బ్రిటన్లకు యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడ్డ అమెరికా, యూరప్‌లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హౌతీల డిప్యూటీ...
టెహ్రాన్: ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్ల దాడులు తప్పించుకోవడానికి వాణిజ్య నౌకలు కొత్త టెక్నిక్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. చైనాతో సంబంధాలున్నట్లుగా సంకేతాలిస్తూ నౌకలు హౌతీల దాడుల నుంచి తప్పించుకుంటున్నాయి. నౌకలో అందరూ చైనా సిబ్బంది...
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేపట్టిన హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా మిత్రపక్షాలు కన్నెర్ర చేశాయి. హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా-బ్రిటన్ గురువారం వైమానిక దాడులు జరిపాయి. హౌతీలపై తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని...
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలోని యెమన్ హౌతీ రెబల్స్ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హౌతీ రెబల్స్ 18 డ్రోన్ దాడులకు తెగపడిందని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ నివేదికలో పేర్కొంది. మొత్తంగా...
ఇజ్రాయెల్-గాజా యుద్ధం కొనసాగుతోంది. గాజాలోని హమాస్ సాయుధులను అంతం చేసేవరకు తమ దాడులు ఆపమని ఇజ్రాయెల్ దళాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో యెమెన్ హౌతీ ఉద్యమ నేత మహమ్మద్ అలీ అల్ హౌతీ కీలక...
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను...
టెహ్రాన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణపై అమెరికా ఏర్పాటు చేసిన కూటమిలో భాగస్వామ్య దేశాలంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు హెచ్చరించింది. కూటమి దేశాలన్నీ ఎర్ర...
న్యూయార్క్: ఎర్ర సముద్రంలో దాడులు నిలిపివేయాలని అమెరికా మిత్రపక్షాలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ హౌతీ ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయకుండా దాడులను మరింత పెంచే దుస్సాహసం చేస్తున్నారు...
న్యూయార్క్: హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను నిలిపివేయాలని అమెరికా సహా 12 మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. లేనిపక్షంలో సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే చివరిసారి మరోసారి హెచ్చరికలు...
న్యూయార్క్: అమెరికా నేతృత్వంలో ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత కూడా ఎర్రసముద్రంలో తొలిసారి ఓ నౌకపై దాడి జరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మెర్స్క్ హాంగ్జౌ...
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన రెండు యాంటి షిప్ బాలిస్టిక్ మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఈ మిసైళ్లను హౌతీ రెబెల్స్ యెమెన్ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. గడిచిన మూడు...
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను...
ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్‌దాడి చేశారని భారత నౌకాదళం తెలిపింది. అయితే.. ఇండియన్ జెండా లేని నౌకపైనే దాడి...
న్యూఢిల్లీ: గోధుమలు, బాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే...
టెల్ అవీవ్: తుర్కియే నుంచి భారత్ రావాల్సిన కార్గో షిప్ ఎర్ర సముద్రంలో హైజాక్‌కు గురైంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న ఇజ్రాయెల్...
సనా: ఇప్పటికే ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలతో పశి్చమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు అమెరికా సైన్యంపై దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను హౌతీ...
సనా: యెమెన్ దేశంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానికులకు తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది. వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు...