సాక్షి హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో నగరవాసులతో పాటు వాహనదారులు కాసేపు సేదతీరారు. కొద్దిరోజులుగా ఎండవేడిమి బాగా పెరిగిపోవడంతో చల్లటి వాన జల్లులకు పట్టణవాసులకు కొంత ఉపశమనం లభించింది. అయితే నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT