సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ బస్సు డిపో పరిధిలో ఓ మహిళ టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ.. చేయిచేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది. ఈ ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా స్పందించారు. ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చింది.
ఈ ఘటనపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో..‘హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ
హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు… pic.twitter.com/SAZ2gPxSGY— Telugu Scribe (@TeluguScribe) January 31, 2024
Video Credentials: Telugu Scribe
మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.
హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024
అయితే, హయత్‌నగర్ డిపో-1 పరిధిలో మద్యం సేవించిన ఓ మహిళ మత్తులో దుర్భాషలాడింది. బస్సులో తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కండక్టర్‌పై దాడికి దిగింది. కాగా, మహిళా కండక్టర్‌ను తన్నిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రూ.500లకు చిల్లర లేకపోవడంతో దిగిపోవాలని కండక్టర్ సూచించినట్లు తెలిసింది. దీంతో, సదరు ప్రయాణికురాలు హల్చల్ చేసింది.