సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ తేదీ నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ప్రకటనలో పేర్కొంది.
ADVERTISEMENT
ADVERTISEMENT