హైదరాబాద్: మలక్పెట్లో ఫ్రీగా హలీమ్ అంటూ హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు రావటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భారీ జనాలతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మలక్‌పేటలో ఓ హోటల్లో హలీమ్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో వందలాదిగా జనాలు ఎగబడ్డారు.

ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వందలాదిమందిని అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక.. హోటల్ వద్దకు భారీగా జనం గుమిగూడటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
Chaos over free #Haleem in #Hyderabad, police used mild force to disperse the crowd.
Marking the first roza of holy #Ramadan month, a famous eatery announced #FreeHaleem for 1 hour today.
Hundreds of people gathered outside their outlet, which led to #TrafficJam.#Ramadan2024 pic.twitter.com/NlFYSkSkPL— Surya Reddy (@jsuryareddy) March 12, 2024