ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన ధోని చివరి నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్య వేసిన ఈ ఓవర్లో శివాలెత్తిపోయిన ధోని.. హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు.
DO NOT MISS
MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk
Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG— IndianPremierLeague (@IPL) April 14, 2024
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరి ఓవర్లో చేసిన 20 పరుగులే ముంబై, సీఎస్కే స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో తన బ్యాట్ నుంచి జాలువారిన సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా ధోని మరోసారి చరిత్రపుటల్లోకెక్కాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా సునీల్ నరైన్, నికోలస్ పూరన్ తర్వాత మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో మరో నాలుగు బంతులు మిగిలుండగా బరిలోకి దిగిన ధోని 3, 4, 5 బంతులను సిక్సర్లుగా మలిచి, ఆఖరి బంతికి రెండు పరుగులు తీశాడు. హార్దిక్ వేసిన ఈ ఓవర్లో సీఎస్కే ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ఈ ఓవరే ముంబై ఇండియన్స్ కొంప ముంచిందని అభిమానులు అనుకుంటున్నారు. ధోని సీఎస్కే తరఫున తన 250 మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.