వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరే ఒక సంచలనం. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై చితక్కొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. వరల్డ్‌కప్-2025 ఫైనల్లోనూ భారీ శతకం (80 బంతుల్లో 175)తో జట్టును గెలిపించాడు.
అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా వైభవ్ దుమ్ములేపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లీగ్ దశలో 36 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్.. కీలక ఎలిమినేటర్‌లో మరోసారి సన్‌రైజర్స్ తన బ్యాటింగ్ పదునేమిటో చూపించాడు.
ఒంటిచేత్తో
కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. ఒంటిచేత్తో సన్‌రైజర్స్‌ను ఎలిమినేట్ చేసి.. రాజస్తాన్‌ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కూడా ఈ పదిహేనేళ్ల పిల్లాడు చితక్కొట్టాడు. ముల్లన్‌పూర్‌లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 96 పరుగులు రాబట్టాడు.

అయితే.. సన్‌రైజర్స్‌కు ఎదురైన చేదు అనుభవం చూసిన గుజరాత్ బౌలర్లు వైభవ్‌ను గట్టిగానే టార్గెట్ చేశారు. ముఖ్యంగా కగిసో రబడ బాడీలైన్ బౌలింగ్‌తో వైభవ్‌ను భయపెట్టాడు. మరోవైపు.. మహ్మద్ సిరాజ్ సైతం బౌన్సర్లు సంధిస్తూ ఇబ్బందిపెట్టాడు.
అయినా సరే బుడ్డోడు ఏమాత్రం బెదరకుండా నిలకడగా ఆడాడు. అయితే, ఆఖరికి రబడ వైభవ్‌పై పైచేయి సాధించి అతడిని అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ గుజరాత్ బౌలర్ల తీరును తీవ్రస్థాయిలో విమర్శించాడు.
నాలోని తండ్రి మనసు
‘‘పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడం కోసం బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్లపై అదరగొడుతున్నాడని నాకు తెలుసు. కానీ.. నాలోని తండ్రి మనసు ఈ రకమైన బౌలింగ్‌ను ఏమాత్రం అంగీకరించడం లేదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే.. చాలా మంది నెటిజన్లు ఇర్ఫాన్ పఠాన్ కామెంట్లపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా ఎలా మాట్లాడుతున్నారు?.. వైభవ్ సూర్యవంశీ ఏమో ఎదురుగా వరల్డ్‌క్లాస్ బౌలర్ ఉన్నా కనికరం లేకుండా బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు.
మీరు మాత్రం అతడికి వ్యతిరేకంగా బౌలర్లు ఏపనీ చేయొద్దని చెబుతున్నారు. పదిహేనేళ్లకే అతడు విధ్వంసం సృష్టిస్తుంటే తప్పు లేదు గానీ.. బౌలర్లు తమ వ్యూహాలు అమలు చేస్తే తప్పా? బౌలర్లు బ్యాటర్‌ను అవుట్ చేయాలని మాత్రమే చూస్తారు. అందుకోసం ఏమైనా చేస్తారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
బాడీలైన్ బౌలింగ్ అంటే ఏమిటి?
ఆస్ట్రేలియాలో 1932-33లో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి ఇది వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ జట్టు ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ను నిలువరించేందుకు బౌలింగ్ చేసిన తీరు వివాదాస్పదంగా మారింది.
ఈ తరహా బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్లు షార్ట్ పిచ్ డెలివరీలు లేదంటే లెగ్‌స్టంప్‌కు కాస్త ఆవల బంతులు వేస్తూ నేరుగా బ్యాటర్ శరీరాన్ని టార్గెట్ చేశారు. తలపైకి డెలివరీలు సంధిస్తారు. ఈ ప్రమాదకర బౌలింగ్‌తో బ్యాటర్ తీవ్రంగా గాయపడొచ్చు లేదంటే చాకచక్యంగా ఆ బంతి నుంచి తప్పించుకోవాలి.
గుజరాత్‌తో మ్యాచ్‌లో రబాడ ఈ తరహా బౌలింగ్‌తో చెలరేగడంతో వైభవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడి గ్లోవ్స్‌కు చాలాసార్లు బంతి తగిలింది. అయినా సరే అతడు పట్టుదలగా ఆడాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ రాజస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
చదవండి: జైస్వాల్‌కు క్షమాపణ చెప్పండి!
THE TITANS BOOK A TICKET TO THE FINAL! 🎟️🏟️#GujaratTitans will face #RoyalChallengersBengaluru in the #TATAIPL 2026 final! 🔥🎯#TATAIPL Final 👉 #RCBvGT | SUN, 31st MAY, 6 PM onwards pic.twitter.com/FNGCeZwjBW
— Star Sports (@StarSportsIndia) May 29, 2026