ఐపీఎల్ ఏ ముహుర్తానా మొదలైందో తెలియదు కానీ క్రికెట్ అభిమానులకు ధోని ఫీవర్ పట్టుకుంది అని మాత్రం చెప్పగలం. ధోని ఎక్కడికి వెళ్లినా వస్తున్న క్రేజ్ మాత్రం ఒక లాగానే ఉంటుంది. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు సీఎస్కే స్టేడియానికి వస్తున్న వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి.
కారణం బస్సులో ధోని ఉండడమే. స్టేడియానికి వెళ్లే దారి పొడవునా సీఎస్కే జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును చుట్టుముట్టారు. కొందరు కార్ల బానెట్లపై నిలబడి తమ అభిమాన ఆటగాడికి చేతులూపారు. ధోని చూడడానికి చాలా మంది రావడంతో బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆ తర్వాత బస్సుకు దారి ఇచ్చారు.
అయితే అభిమానానికి హద్దులుండవని ఈ సంఘటనతో మరోసారి రుజువు అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. సరిహద్దు లేని అభిమానం అంటే ఇదే అంటూ కామెంట్ చేశారు. ఇక సీఎస్కే కూడా బస్సును చుట్టుముట్టిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఒక్కడి కోసం రాజధాని నగరం జనంతో నిండిపోయింది.. ఈ దృశ్యం చూడడానికి మా కళ్లు చాలడం లేదు అంటూ క్యాప్షన్ జత చేసింది.
ఇక సీఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం సీఎస్కే 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నప్పటికి.. లక్నో కూడా 15 పాయింట్లతోనే ఉంది.
Fans behind the CSK bus in Delhi.
This is madness. pic.twitter.com/P594b5r8QL— Johns. (@CricCrazyJohns) May 20, 2023
Thaana Serndha Kootam at ThalaiNagaram! 🦁#DCvCSK #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/LrgHw3SQYM
— Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2023
చదవండి: ఏందీ క్రేజ్.. బంతులు వేయాలంటే భయపడుతున్నారు!