ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్లో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్, హ్రిదయ్ చద్దా, అనుష్ అగర్వల్లాలతో కూడిన జట్టు 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. దీనికి ముందు సెయిలింగ్‌లో భారత్‌కు ఇవాళే (సెప్టెంబర్ 26) మూడు పతకాలు అందాయి.
#EquestrianExcellence at the 🔝
After 41 long years, Team 🇮🇳 clinches🥇in Dressage Team Event at #AsianGames2022
Many congratulations to all the team members 🥳🥳#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/CpsuBkIEAw— SAI Media (@Media_SAI) September 26, 2023
భారత సెయిలర్లు నేహా ఠాకూర్ రజతం, ఎబాద్ అలీ, విష్ణు శరవనన్ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు) చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.