సాక్షి, ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్, కంభం అనిల్ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్రావ్ ఠాక్రే ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇటీవలే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తన కుమారుడు రోహిత్‌కు బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లికి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
#WATCH | Delhi: BRS MLA Mynampally Hanumantha Rao along with his son joined the Congress Party in the presence of the Congress president Mallikarjun Kharge and party's Telangana unit chief Anumula Revanth Reddy.
BRS Ex MLA Vemula Veeresham also joined the party today. pic.twitter.com/rLG2pMHcgL— ANI (@ANI) September 28, 2023
ఈ సందర్బంగా కుంభం అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడం వల్ల కేడర్‌కు దూరం అయ్యాను. భువనగిరి ప్రజల ఆలోచనతో మళ్ళీ పార్టీలోకి వచ్చాను. భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తాను. టికెట్ కేటాయింపు అంశం అధిష్టానం చూసుకుంటుంది.
ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’