రామచంద్రపురం: ‘నాకు రాజకీయ విలువలు ఉన్నాయి. వైఎస్సార్సీపీని విడిచి వెళ్లి వెన్నుపోటు పొడవలేను. నేను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతాను...’ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ తనకు కలలో కూడా పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని, వైఎస్సార్సీపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసి నైతిక విలువలను దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలను కాçపాడే విధంగా పత్రికలు వార్తలు ప్రచురించాలని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని హితవుపలికారు.
వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా
ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్
ADVERTISEMENT
ADVERTISEMENT