సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం హీటెక్కింది. చేవెళ్లలో బీజేపీ తలపెట్టిన విజయ సంక్పల సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచ్చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు లిప్ట్ ఇరిగేషన్‌కు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయ, మెడికల్, నర్సింగ్ కళాశాలల శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని అనుకున్నా. అమిత్ షా వచ్చింది అందుకు కాదా?. గత తొమ్మిదేళల్లో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ రాష్ట్రం పేరు ఎందుకు చెప్పలేదు. అంటూ కామెంట్స్ చేశారు.
I thank HM @AmitShah Ji on laying the foundation for
☑️ ITIR Hyderabad
☑️ National Project status for Palamuru - RR lift irrigation project
☑️ Hyderabad Metro Phase 2
☑️ IIM, IISER, IIIT, IIT, NID, Navodayas, Medical & Nursing Colleges
Oh Wait 😁 he did none of that.
Amit…— KTR (@KTRBRS) April 23, 2023