పట్నా: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బిహార్ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విషయంలో బీజేపీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. ప్రజలకు జబ్బు పడితే లేదా గాయపడితే గుడికి వెళ్లుతారా? లేదా ఆస్పత్రికి వెళ్లుతారా? అని సూటిగా ప్రశ్నించారు.
సమాజంలో ఉన్నతమైన ఉద్యోగాలు, పదవులకు సాధించడానికి ఉపయోగపడే చదువు కావాలంటే గుడికి వెళ్లుతా? లేదా స్కూల్కు వెళ్లుతారా?’ అని విమర్శించారు. ప్రజలు కపట హిందుత్వ, అబద్ధపూరితమైన జాతీయవాదంపై అవగాహనతో ఉండాలని ఉన్నారు.
"Temple or hospital?": Bihar Education Minister Chandra Shekhar sparks another controversy on Ram Temple
Read @ANI Story | https://t.co/vJH2fFzYGT#Bihar #ChandraShekhar #RamTemple pic.twitter.com/Y81yIqFlXW— ANI Digital (@ani_digital) January 8, 2024
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22ను జరగనుంది. ఓవైపు ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు మరోవైపు ప్రతిపక్షాలు, పలు రాష్ట్రాల నేతలు బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ పావుగా వాడుకొంటుందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొంత మంది రాజకీయ ప్రముఖలకు ఆహ్వానం అందించకపోవటంతో బీజేపీపై మండిపడుతున్నారు.