బెంగళూరు: బాలికపై అసభ్యంగా నడుచుకున్న ఆరోపణలతో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ మల్లికార్జున ముత్యా కలబుర్గి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఫిర్యాదు మేరకు గోగి పోలీస్ స్టేషన్లో ముత్యాపై పోక్సో కేసు నమోదు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు మార్చి 2న విచారణ చేపట్టనుంది. ముత్యా అనతికాలంలోనే స్వామీజీగా ప్రజల నమ్మకం చూరగొన్నాడు. అయితే ఒక బాలిక పట్ల ఆయన ప్రవర్తించిన దృశ్యాలు వైరలై వివాదంగా మారడంతో పాటు పోక్సో కేసు మెడకు చుట్టుకుంది.
= కోర్టును ఆశ్రయించిన మల్లికార్జున ముత్యా
ADVERTISEMENT
ADVERTISEMENT