సాక్షి, ఢిల్లీ: హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా ప్రకటించినట్లు వెలుగులోకి వచ్చిన విషయంపై కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ స్పందించారు. హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా గుర్తిస్తున్నారా? అంటూ పార్లమెంట్లో ప్రశ్నగా ఉన్న పేపర్‌కు సమాధానంగా తాను ఎటువంటి సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ‘స్టార్ గుర్తు లేని’ ప్రశ్నకు కేంద్ర మంత్రి మీనాక్షీ సమాధానం ఇచ్చినట్లు లిఖితపూర్వకమైన పత్రం ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
You have been misinformed as I have not signed any paper with this question and this answer @DrSJaishankar @PMOIndia https://t.co/4xUWjROeNH
— Meenakashi Lekhi (@M_Lekhi) December 8, 2023
‘అది సరైన సమాచారం కాదు. నేను ఎటువంటి ప్రశ్నకు సంబంధించిన పత్రాలపై సమాధానంగా సంతకం చేయలేదు’ అని స్పష్టం చేస్తూ.. కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్రమోదీకి ‘ఎక్స్’లో ట్యాగ్ చేశారు. అయితే తాను ఈ విషయంపై అధికారికంగా దర్యాప్తు చేపడతామని, దర్యాప్తులో అసలు దోషి ఒవరో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
In the tweet below,
- Meenakshi Lekhi ji is denying&disassociating to a response attributed to her
- says has no idea who drafted this as response to a PQ since she didn’t sign it
- is she then claiming it is a forged response, if yes this is a serious breach and violation of… pic.twitter.com/4mNscaFhpA— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) December 9, 2023
అయితే, కేంద్ర మంత్రి మీనాక్షీ క్లారిటీపై శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ‘ఈ విషయంలో ఫోర్జరీ జరిగి ఉంటుందని మీనాక్షీ భావిస్తున్నారా? అదే నిజమైతే. ఇది తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’ అని అన్నారు.