అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజీత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులు, దర్శకులు, కళాకారులను ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్లో అయోధ్యకు సంబంధించిన అప్డేట్లను తరచూ షేర్ చేస్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గాయని లతా మంగేష్కర్‌ను మిస్ కావడం విచారకరమని అన్నారు.
As the nation awaits 22nd January with great enthusiasm, one of the people who will be missed is our beloved Lata Didi.
Here is a Shlok she sung. Her family told me that it was the last Shlok she recorded. #ShriRamBhajanhttps://t.co/MHlliiABVX— Narendra Modi (@narendramodi) January 17, 2024
లతా మంగేష్కర్ కీర్తనలలో ఒకదానిని ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని.. ఇది లతా మంగేష్కర్ పాడగా, రికార్డ్ చేసిన చివరి శ్రీరాముని శ్లోకమని తెలిపారు. ఈ శ్లోకం పేరు ‘శ్రీ రామ్ అర్పణ్’. దీనిలో లతా మంగేష్కర్ మధురమైన గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇది కూడా చదవండి: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!