ఛండీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అవినీతిని భరించలేక.. ఓ హోంగార్డ్ వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసనకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ హోంగార్డ్.. తోటి పోలీసులు అవినీతి చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో హైవేకు అడ్డుగా ఓ తాడు కట్టి వాహనాలను నిలిపివేశాడు. అనంతరం.. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. ‘నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్పూర్ ప్రాంతంలో పఠాన్‌కోట్ హైవేపై నిరసనకు దిగాడు. ఇది చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాకయ్యారు.
ఈ క్రమంలో అక్కడే మరో పోలీసు అధికారి.. నిరసనకు దిగిన హోంగార్డ్ను పైకిలేపే ప్రయత్నం చేశాడు. హోంగార్డ్ వినకపోవడంతో అతడిని కాలితో తన్నాడు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఇక, ఈ ఘటనపై భోగ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సుఖ్జిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక గొడవకు సంబంధించి ఓ యువకుడిని హోంగార్డు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. అది మంజూరు చేయబడింది. దీని తర్వాత అతను విడుదలయ్యాడు. హోంగార్డు జవాన్‌ను తన్నలేదని సుఖ్జిత్ సింగ్ పేర్కొన్నారు.
‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’
रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd— Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023
ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్