సాక్షి, ఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హర్యానా, జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు.
ఆర్టికల్-370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 110 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో పోలింగ్ జరగనుంది.
-
సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటో తేదీన మూడు విడతల్లో జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు.
👉ఒకటో విడత సెప్టెంబర్ 18(24 స్థానాలు)
👉రెండో విడత సెప్టెంబర్ 25(26 స్థానాలు)
👉మూడో విడత అక్టోబర్ 1(40స్థానాలు)
-
అక్టోబర్ నాలుగో తేదీన జమ్ము కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్.
ఇక హర్యానాలో ఒకే విడతలతో ఎన్నికలు జరగనున్నట్లు సీఈసీ ప్రకటించారు.
-
హర్యానాలో 90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు.
-
అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికలు, నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్
Assembly poll in J&K will be held in three phases, with voting on Sep 18, Sep 25, and Oct 1
Counting of votes on October 4 pic.twitter.com/XXvtq4ReEU— ANI (@ANI) August 16, 2024
#WATCH | Assembly Elections in Haryana: Chief Election Commissioner Rajiv Kumar says, "Assembly Elections will be held in one phase; voting on October 1. Counting of votes will take place on October 4" pic.twitter.com/U22qhG3uoR
— ANI (@ANI) August 16, 2024