శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భారత సైనికులు మరణించారని అధికారులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు ఆగస్టు 4న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉగ్రవాదుల జాడను జల్లెడ పడుతుండగా ఒక్కసారిగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు.
ఉగ్రవాదులు చేసిన కాల్పులకు ప్రతిగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వారు చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు ఆ అధికారి తెలిపారు.
హాలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉన్నట్టు మావద్ద పక్కా సమాచారముందని భారత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అయన తెలిపారు.
Operation Halan #Kulgam
On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed.
Search operations… pic.twitter.com/NJ3DZa2OpK— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023
ఇది కూడా చదవండి: Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి