సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్‌కి ఆ పార్టీ ఉద్వాసన పలికింది. జాతీయ కార్యవర్గం నుంచి సునీల్ దేవధర్‌ను తొలగించింది. ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయన పని తీరుపై జాతీయ నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
బీజేపీ జాతీయ కమిటీని అధిష్టానం శనివారం ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. ఏపీ నుంచి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు.
చదవండి: ఆపరేషన్ ఆకర్ష్.. జయసుధ సహా తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు!