మెక్సికో: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
lవివరాల ప్రకారం.. ఉత్తర మెక్సికోలోని సినలోవాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల 19 మంది మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని జాతీయ రహదారిపై సరుకులను రవాణా చేసే ట్రక్కు, బస్సు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరగిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
ఇక, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
🚨 No es un choque sino un intento de rebase, posible causa del accidente en la maxipista, en #Elota
Lee la nota completa 🔗 https://t.co/kyhrySHYci#Accidente #Vialidad #LDNoticias #Carretera #Sinaloa pic.twitter.com/R75emSD0Gp— Línea Directa Portal (@linea_directa) January 31, 2024