రిలయన్స్ అధినేత బిలియనీర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ బాష్ అంగరంగ వైభంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.
అయితే ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ 12 వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు.

దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్ నగలు, కాబోయే వరుడు అనంత్ అంబానీ డైమండ్ వాచ్ గురించి ఇంటర్నెట్ తీవ్ర చర్చ నడిచింది.
ఇదంతా ఒక ఎత్తయితే నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ వైరల్గా మారింది. పాకిస్తాన్ జీడీపీ కంటే నీతా అంబానీ డైమండ్ నెక్లెస్ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్స్టాలో పలు పోస్ట్లు వైరల్గా, తాజాగా ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం.

కాగా ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 341 కోట్ల డాలర్లు (రూ. 28.23 లక్షల కోట్లు)గా ఉన్న సంగతి తెలిసిందే.
Etched with the initials Anant Ambani and Radhika Merchant, Nita Ambani dons the world-famous handloom Kanchipuram saree designed by Swadesh and handcrafted by artisans.
She was seen thanking the Jamnagar Reliance Parivar for their love and support during Anant and Radhika's… pic.twitter.com/YEOYdVOmjp— ANI (@ANI) March 7, 2024