Beats Powerbeats Pro Earbuds: క్రికెట్ గురించి తెలిసినవారికి 'విరాట్ కోహ్లీ' (Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈయన ఒక ఖరీదైన ఇయర్‌బడ్స్ పెట్టుకుని కనిపించారు. దీని ధర ఎంత? ఏ కంపెనీకి చెందినదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర..
నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఈ ఇయర్‌బడ్స్ మన దేశంలో లభించవని తెలుస్తోంది. ఇది బీట్స్ పవర్‌బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అని.. దీని ధర రూ. 249.95 డాలర్లు లేదా రూ. 20,000 వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు యాపిల్ ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తారు, కానీ కోహ్లీ ఇందుకు భిన్నంగా వేరే బ్రాండ్ ఉపయోగిస్తున్నారు.

ఈ ఇయర్‌బడ్స్ కేవలం యుఎస్ మార్కెట్లోని ఆపిల్ స్టోర్లలో లేదా అమెజాన్ వంటి ఆన్లైన్ సెక్టార్లలో లభిస్తుంది. పవర్‌బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. కాగా దీని లేటెస్ట్ వెర్షన్ నవంబర్ 2022లో విడుదలైంది.
ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
కోహ్లీ వెస్టిండీస్ వికెట్ కీపర్ 'జాషువా డా సిల్వా' తల్లిని కలవడం, ఆలింగనం చేసుకోవడం వంటి సన్నివేశాలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికి వేలమంది ఈ వీడియో లైక్ చేశారు, కొంత మంది అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.
𝙒𝙝𝙤𝙡𝙚𝙨𝙤𝙢𝙚 😊 ❤️
When Virat Kohli made Josh's mom's day & "year" 🤗#TeamIndia | #WIvIND | @imVkohli | @windiescricket | @joshuadasilva08 pic.twitter.com/0RL20rRcYL— BCCI (@BCCI) July 22, 2023