న్యూఢిల్లీ: కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బో ర్డు (సీబీఐసీ) చైర్మన్‌గా ఐఆర్ఎస్ అధికారి వివే క్ చతుర్వేది నియమితులయ్యారు. నవంబర్ 28న పదవీ విరమణ చేసిన సంజయ్ కుమార్ అగర్వాల్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్ఎస్ 1990 బ్యాచ్‌కు చెందిన చతుర్వేది ప్రస్తుతం సీబీఐసీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తున్నారు. ‘‘సీబీఐసీ సభ్యుడి గా ఉన్న చతుర్వేదిని అదే బోర్డుకు చైర్మన్‌గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది’’ అని డీఓపీటీ ఉత్తర్వుల్లో తెలిపింది.
ADVERTISEMENT
ADVERTISEMENT