సాక్షి, అమరావతి: సీఎం జగన్పై దాడి జరిగిన ఘటనలో గాయపడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వెలంపల్లి ఇంటికి వెళ్లి ఆయన కంటికి అయిన గాయం గురించి ఆరా తీశారు. డాక్టర్ను కలిసి చికిత్స పొందాలని సూచించారు. ఘటన జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సజ్జల వెంట రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, కనకారావు మాదిగ, గుబ్బా చంద్రశేఖర్ ఉన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT
