విశాఖ సాక్షి: బక్కన్నపాలెం నవోదయ స్కూల్లో ఉద్రిక్తత నెలకొంది. దోమల నివారణకు వాడే పొగపీల్చడంతో 36 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. దీంతో వెంటనే వారిని కొమ్మాది ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ADVERTISEMENT
ADVERTISEMENT