సాక్షి, తాడేపల్లి: విజయవాడ భవానీపురంలో దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటి నుంచి (గురువారం) జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దర్గా ముజావర్ల కమిటీ ఆహ్వానించింది. సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్, చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ కూడా ఉన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT